• facebook
  • whatsapp
  • telegram

ఇస్రో - మ‌న ధ్రువ‌తార‌

1. భారత్ ప్రయోగించే జీశాట్ ఉపగ్రహం ... ?
ఎ) భూస్థావర ఉపగ్రహం
బి) కమ్యూనికేషన్ ఉపగ్రహం
సి) క్రయోజెనిక్ ఇంజిన్‌తో ప్రయోగించే ఉపగ్రహం
డి) పైవన్నీ

జ: (డి)

 

2. భూస్థావర ఉపగ్రహం కక్ష్యావర్తన కాలం ఎంత?
ఎ) 24 గంటలు బి) 24 రోజులు సి) ఒక నెల డి) ఒక సంవత్సరం

జ: (ఎ)

 

3. గగన్ వ్యవస్థతో ముడిపడింది ఏది?
ఎ) జీపీఎస్ బి) ఇస్రో సి) ఎయిర్‌ఫోర్ట్ ఆథారిటీ డి) పైవన్నీ

జ: (డి)

 

4. ఐఆర్ఎన్ఎస్ఎస్‌లో ఉపయోగించే ఉపగ్రహాల సంఖ్య
ఎ) 24 బి) 6 సి) 7 డి) 8

జ: (సి)

 

5. ఆస్ట్రోనాట్ ఉపగ్రహంతోపాటు ప్రయోగించిన ఉపగ్రహాలు ఏ దేశానికి చెందినవి?
ఎ) అమెరికా బి) ఇండోనేషియా సి) కెనడా డి) పైవన్నీ

జ: (డి)

 

6. గగన్ పేలోడ్స్ ఉన్న ఉపగ్రహం ఏది?
ఎ) జీశాట్-8 బి) జీశాట్-10 సి) జీశాట్-15 డి) పైవన్నీ

జ: (డి)

 

7. భారత అంతరిక్ష పితామహుడని ఎవరిని అంటారు?
ఎ) విక్రమ్ సారాభాయి బి) హోమి జహంగీర్ బాబా సి) అబ్దుల్ కలాం డి) సతీష్‌ధావన్

జ: (ఎ)

 

8. అయస్కాంత భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న ఇస్రో కేంద్రం?
ఎ) షార్ - శ్రీహరికోట బి) టెర్ల్స్ - తిరువనంతపురం సి) ఆంట్రిక్స్ - బెంగళూరు డి) ఏదీకాదు

జ: (బి)

Posted Date : 23-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌