• facebook
  • whatsapp
  • telegram

చంద్రగిరి పర్వతాల్లో బాహుబలి!

జైన మతం

 


భారతదేశంలో పుట్టిన జైన మతం ఎంతో విశిష్టమైంది. అనుసరించే వారికి విప్లవాత్మక జీవన విధానాన్ని పరిచయం చేసింది. అహింసే పరమ ధర్మమని ప్రపంచానికి చాటి చెప్పింది. నైతిక, ఆధ్యాత్మిక శాంతికి బాటలు వేసింది. ప్రారంభంలో ఒక వెలుగు వెలిగినప్పటికీ మత విధానాల్లోని కఠిన నియమాలు, ఆచరణ సాధ్యం కాని అహింస కారణంగా ప్రజాదరణకు నోచుకోలేదు. చివరికి మైనారిటీ మతంగా మిగిలిపోయింది. మనుషుల సహజ ఆలోచనా ధోరణిని, ప్రాపంచిక దృక్పథాన్ని సమూలంగా మార్చగలిగే ఈ మతం ఆవిర్భావం, ఆచరణ విధానాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. జైనుల ఆరాధ్యనీయులు, వారి జీవిత విశేషాలు, మత గ్రంథాలు, పవిత్ర స్థలాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1.     వర్ధమాన మహావీరుడు ఒక

1) బ్రాహ్మణుడు    2) క్షత్రియుడు  

3) వైశ్యుడు      4) శూద్రుడు


2.     కిందివాటిలో సరికానిది?

1) జైనమతం భారతదేశంలో మొదటి ప్రాచీన మతం.

2) జైనమత గురువులను తీర్థంకరులు అంటారు.

3) తీర్థాంకరులు అంటే జీవనస్రవంతిని దాటడానికి వారధి నిర్మించేవారు.

4) మొత్తం తీర్థంకరులు 24 మంది.


3.     కిందివాక్యాల్లో రిషభనాథుడి గురించి సరైనవి.

ఎ) మొదటి తీర్థంకరుడు, ఇతడి ప్రస్తావన రుగ్వేదంలో ఉంది.

బి) దక్షిణ భారతదేశంలోని అస్మక అనే ప్రాంతానికి చెందినవారు.

సి) ఇతడి చిహ్నం - వృషభం.

డి) ఇతడి కుమారులు భరతుడు, బాహుబలి; కుమారై బ్రాహ్మీ.

1) ఎ, బి, సి, డి      2) ఎ, సి, డి  

3) ఎ, బి, సి      4) ఎ, డి


4.     కిందివాటిలో పార్శ్వనాథుడికి సంబంధించి సరైనవి.

ఎ) 23వ తీర్థంకరుడు.

బి) వర్ధమాన మహావీరుడి కంటే 250 సంవత్సరాలు పూర్వం జీవించాడు.

సి) ఇతడి చిహ్నం - సర్పం.

డి) కాశీరాజు అశ్వసేన, వామల దేవి కుమారుడు.

1) ఎ, బి, సి      2) ఎ, బి, సి, డి  

3) బి, డి      4) ఎ, సి, డి


5.     వర్ధమాన మహావీరుడికి సంబంధించి సరైనవి?

ఎ) ఇతడు 24వ తీర్థంకరుడు.

బి) వైశాలీ సమీపంలోని కుంద గ్రామంలో జన్మించాడు.

సి) వర్థమానుడు జ్ఞాత్రిక వంశానికి చెందిన క్షత్రియుడు.

డి) తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల.

1) ఎ, బి       2) ఎ, బి, సి, డి  

3) ఎ, బి, డి      4) బి, సి, డి


6.     వర్ధమాన మహావీరుడు 42 ఏళ్ల వయసులో జ్ఞానోదయం పొందిన ప్రాంతం, నది వరుసగా?

1) జృంభిక - రుజపాలిక      2) జృంభిక - నర్మదా నది

3) జృంభిక - కుశి నది       4) వైశాలి - రుజపాలిక


7.     వర్ధమాన మహావీరుడి బిరుదులు, వాటి అర్థాల్లో సరికానిది?

1) జిన ఎ) కోరికలు జయించినవాడు
2) మహావీరుడు బి) ఇంద్రియాలపై నియంత్రణ ఉన్నవాడు
3) నిర్గందుడు సి) బంధాలు లేనివాడు
4) కేవలి డి) సంపూర్ణ జ్ఞానం ఉన్నవాడు

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి      2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి  4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి


8.     కిందివాటిలో పంచవ్రతాల్లో లేనిది?

1) అహింస      2) బ్రహ్మచర్యం  

3) తపస్సు      4) అపరిగ్రహం


9.     జైనమత పంచవ్రతాల్లో వర్ధమానుడు చేర్చింది?

1) అస్తేయ      2) అపరిగ్రహం 

3) బ్రహ్మచర్యం       4) సత్యం


10. వర్ధమాన మహావీరుడి దృష్టిలో ‘ఆత్మకర్మ నుంచి విముక్తి పొందే స్థితి’ అంటే ఏమిటి?

1) కేవల (కైవల్య) స్థితి      2) గొప్ప స్థితి  

3) ఆనంద స్థితి      4) పైవన్నీ 


11. కిందివాటిలో త్రిరత్నాల్లో లేనిది?

1) సమ్యక్‌ క్రియ       2) సమ్యక్‌ జ్ఞానం

3) సమ్యక్‌ దృష్టి        4) సమ్యక్‌ విశ్వాసం


12. కిందివాటిలో సరైనవి గుర్తించండి.

ఎ) సల్లేఖన వ్రతం: ఆహార పానీయాలు తీసుకోకుండా కఠిన ఉపవాస దీక్ష ద్వారా మరణం

బి) ప్రయోగ పద్ధతి: ప్రవహించే నీటిలో మునిగి మరణం

1) ఎ, బి సరైనవి  2) ఎ సరైంది, బి సరికాదు

3) ఎ, బి సరికావు      4) ఎ సరికాదు, బి సరైంది


13.    జైనమత గ్రంథాలను ఏమంటారు? అవి ఏ భాషలో ఉన్నాయి?

       గ్రంథం             భాష
1) అంగాలు - అర్థమాగధ 2) అంగాలు - హిందీ
3) త్రిరత్నాలు - అర్థమాగధ 4) త్రిరత్నాలు - హిందీ

 
14. కిందివారిలో దిగంబరులు, శ్వేతాంబరుల నాయకులు వరుసగా?

1) స్థూలబాహు - భద్రబాహు      2) భద్రబాహు - స్థూలబాహు

3) స్థూలబాహు - చంద్రగుప్తుడు     4) భద్రబాహు - చంద్రగుప్తుడు


15. జైనమత సమావేశాలు, అవి జరిగిన ప్రాంతాల్లో సరైనవి గుర్తించండి.

ఎ) మొదటి సమావేశం క్రీ.పూ. 3వ శతాబ్దంలో పాటలీపుత్రలో జరిగింది.

బి) రెండో సమావేశం క్రీ.శ. 5/6వ శతాబ్దంలో వల్లభి గుజరాత్‌లో జరిగింది.

1) ఎ, బి సరైనవి      2) ఎ, బి సరికావు

3) ఎ సరైంది, బి సరికాదు   4) ఎ సరికాదు, బి సరైంది


16. కిందివాటిలో సరైనవి?

ఎ) గోమఠేశ్వరుడు అంటే బాహుబలి.

బి) ఇది ఏకశిల విగ్రహం.

సి) ఈ విగ్రహం కర్ణాటకలోని శ్రావణ బెళగోళ వద్ద ఉంది.

డి) ఈ విగ్రహం ఎత్తు 57 అడుగులు.

1) ఎ, సి       2) ఎ, సి, డి  

3) ఎ, బి, సి      4) ఎ, బి, సి, డి


17.    గోమఠేశ్వరుడి విగ్రహం ఏ పర్వతాల్లో ఉంది?

1) ఆరావళి పర్వతాలు      2) చంద్రగిరి పర్వతాలు

3) కైలాస పర్వతాలు       4) వారాహి పర్వతాలు


18. జైనులు పూజించే స్త్రీ దేవతా విగ్రహం, అది ఉన్న ప్రదేశం?

1) విద్యాదేవిన్‌ - శ్రావణ బెళగోళ     2) సరస్వతి - బాసర

3) విద్యాదేవిన్‌ - దిల్వారా ఆలయం     4) సరస్వతి - కొలనుపాక


19. దిల్వారా దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌      2) రాజస్థాన్‌  

3) మధ్యప్రదేశ్‌      4) మహారాష్ట్ర


20. దిల్వారా అనే జైన ఆలయం ఉన్న కొండలు?

1) చంద్రగిరి కొండలు  2) మౌంట్‌ అబూ కొండలు

3) బ్రహ్మగిరి కొండలు  4) కైలాసగిరి కొండలు


21. పరిశిష్ట పర్యన్‌ అనే గ్రంథం ఎవరు రచించారు?

1) స్థూలబాహు      2) భద్రబాహు  

3) హేమచంద్ర      4) సుదర్శన్‌


22. జైన అశోకుడిగా పేరు పొందిన రాజు?

1) అశోకుడు       2) సంప్రతి   

3) చంద్రగుప్తుడు      4) ఖారవేలుడు


23. ఒడిశాలోని ఉదయగిరి, ఖండగిరి/స్కంధగిరి వద్ద జైన క్షేత్రాలు నిర్మించిన రాజు?

1) రుద్రదమనుడు      2) చాముండరాయ

3) ఖారవేలుడు       4) చంద్రగుప్తుడు


24. జైనమతంలోని శ్వేతంబరులు, దిగంబరుల గురించి ప్రస్తావించిన చైనా యాత్రికుడు?

1) పాహియాన్‌      2) హుయాన్‌త్సాంగ్‌

3) 1, 2       4) కన్ఫ్యూషియస్‌


25. పంచవత్రాల్లో ‘అపరిగ్రహం’ అంటే ఏమిటి?

1) ఆస్తిని దొంగిలించకూడదు.  

2) అవసరానికి మించి ఆస్తి కలిగి ఉండకూడదు.

3) 1, 2  4) ఆస్తిని జైన గుడికి అప్పగించాలి.


26. జైనమత మొదటి సమావేశానికి అధ్యక్షుడు?

1) స్థూలబాహు      2) భద్రబాహు

3) దేవరధి       4) వర్ధమానుడు


27. కిందివాటిలో అజీవక మతం గురించి సరైనవి?

ఎ) దీని స్థాపకుడు గోశాల మక్కరిపుత్ర.

బి) దీనికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు.

సి) ఇతడి సిద్ధాంతం ‘ఉద్బేదవాదం’.

డి) బిందుసారుడు ఈ మతాన్ని స్వీకరించారు.

1) ఎ, సి, డి      2) ఎ, బి, సి, డి  

3) ఎ, బి, డి      4) ఎ, డి


28. చార్వక మతస్థాపకుడు?

1) అజిత కేశకంబలి      2) మక్కలి గోశాల

3) వర్ధమానుడు       4) బృహస్పతి


29. జైనకల్ప సూత్రం రచించినవారు?

1) స్థూలబాహు      2) బాహుబలి    

3) భద్రబాహు       4) భరతుడు


30. జైనుల ప్రథమ తీర్థంకరుడు రిషభనాథుడు ఎక్కడ నిర్యాణం చెందాడు?

1) శ్రావణ బెళగోళ  2) కైలాస శిఖర పర్వతం

3) సారనాథ్‌      4) గయ


31. రిషభనాథుడి గురించి ఇతిహాసం, పురాణాల్లో ఏ అవతారం అని పేర్కొన్నారు? 

1) బ్రహ్మ   2) శివ   3) విష్ణు   4) ప్రజాపతి


32. జైనమత గ్రంథాల ప్రకారం 24 మంది తీర్థంకరుల కులం?

1) బ్రాహ్మణులు      2) క్షత్రియులు  

3) శూద్రులు      4) వైశ్యులు


33. పార్శ్వనాథుడు జైనమతంలో చేర్చిన సిద్ధాంతం/ సిద్ధాంతాలు?

1) అహింస, సత్యం       2) అపరిగ్రహం   

3) అస్తేయం      4) పైవన్నీ


34. రిషభనాథుడు, వర్ధమాన మహావీరుల చిహ్నాలు వరుసగా?

1) సింహం, పాము      2) పాము, సింహం  

3) ఎద్దు, సింహం      4) సింహం, ఎద్దు


35. సాద్వాదం అంటే?

1) హిందూమత వేదాంతం 2) జైనమత వేదాంతం

3) బౌద్ధమత వేదాంతం      4) క్రైస్తవమత వేదాంతం


36. అనేకాంతవాదం అంటే?

1) జైనమతంలోని నాలుగు సిద్ధాంతాలు 

2) జైనమతంలోని రెండు సిద్ధాంతాలు

3) బౌద్ధమతంలోని మూడు సిద్ధాంతాలు

4) జైనమతంలోని అయిదు సిద్ధాంతాలు


37. ఏ రాష్ట్రకూట రాజు సల్లేఖన వ్రతం చేసి మరణించారు?

1) దంతిదుర్గుడు       2) అమోఘవర్షుడు  

3) నాలుగో ఇంద్రుడు      4) రెండో కృష్ణుడు


38. రాజస్థాన్, గుజరాత్‌లలో ఎక్కువగా ఉన్న మతం?

1) జైనం  2) బౌద్ధం  3) అజీవకం  4) క్రైస్తవం


39. సల్లేఖన వ్రతం ఏ మతానికి చెందింది?

1) హిందూ  2) జైన   3) బౌద్ధ  4) చార్వాక


40. జైన మతస్థులు వాసుదేవుడికి దగ్గరి చుట్టంగా ఎవరిని భావిస్తారు?

 1) రిషభనాథుడు 2) అరిష్టనేమి 3) పార్శ్వనాథుడు      4) మహావీరుడు

 


సమాధానాలు

1-2, 2-1; 3-1; 4-2; 5-2; 6-1; 7-1; 8-3; 9-3; 10-1; 11-3; 12-1; 13-1; 14-2; 15-1; 16-4; 17-2; 18-3; 19-2; 20-2; 21-3; 22-2; 23-3; 24-2; 25-2; 26-1; 27-2; 28-1; 29-3; 30-2; 31-3; 32-2; 33-4; 34-3; 35-2; 36-2; 37-3; 38-1; 39-2; 40-3.

 


ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


గ‌ద్దె న‌ర‌సింహారావు

Posted Date : 26-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌