• facebook
  • whatsapp
  • telegram

లిపిడ్‌లు.. ప్రోటీన్‌లు

1. లిపిడ్‌లు మన శరీరానికి ఏ విధంగా అవసరమవుతాయి?
ఎ) శరీర నిర్మాణానికి బి) కణత్వచాల నిర్మాణానికి సి) శక్తిని ఇవ్వడానికి డి) పైఅన్ని విధాలుగా

జ: (డి)

 

2. మన శరీరంలో పసుపు రంగు కొవ్వు ఏ రూపంలో నిల్వ ఉంటుంది?
ఎ) అడిపోజ్ కణజాలం బి) తంతుయుత కణజాలం సి) బంధన కణజాలం డి) స్థితిస్థాపక (ఎలాస్టిక్) కణజాలం

జ: (ఎ)

 

3. కొవ్వు ఆమ్లాలు ఇతర పదార్థాలతో కలిసి ఏర్పరిచే సంయుక్త లిపిడ్‌లకు ఉదాహరణ ... ?
ఎ) ఫాస్ఫో లిపిడ్‌లు బి) గ్లైకో లిపిడ్‌లు సి) సల్ఫో లిపిడ్‌లు డి) పైవన్నీ

జ: (డి)

 

4. కింది వాటిలో హైడ్రోజనీకరణం ద్వారా తయారయ్యే పదార్థం?
ఎ) నెయ్యి బి) వెన్న సి) వనస్పతి డి) పామ్ఆయిల్

జ: (సి)

 

5. నాడీవ్యవస్థ అభివృద్ధికి ఉపయోగపడే ఓమేగా-3-కొవ్వు ఆమ్లానికి ఉదాహరణ ?
ఎ) బ్యుటరిక్ బి) లినోలెనిక్ సి) స్టియరిక్ డి) పామిటిక్

జ: (బి)

 

6. చెడ్డ కొలెస్ట్రాల్‌ను పెంపొందించే సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండే ఆహారం ఏది?
ఎ) కోడిగుడ్డు పచ్చసొన బి) వెన్న సి) వనస్పతి డి) పైవన్నీ

జ: (డి)

 

7. ఆరాఖిడిక్ కొవ్వు ఆమ్లం కింది ఏ నూనెలో ఎక్కువగా ఉంటుంది?
ఎ) వేరుశనగ బి) కొబ్బరి సి) సోయా డి) అవిసె

జ: (ఎ)

 

8. గుండె జబ్బులు ఉన్నవారు కింది ఏ నూనెను ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం మంచిది కాదు?
ఎ) సన్‌ఫ్లవర్ బి) సోయానూనె సి) పామ్ఆయిల్ డి) ఆలివ్‌నూనె

జ: (సి)

 

9. కింది ఏ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అథిరోస్ల్కీరోసిస్ వస్తుంది?
ఎ) కార్బోహైడ్రేట్‌లు బి) ప్రోటీన్‌లు సి) చెడ్డకొలెస్ట్రాల్ ఉన్న కొవ్వు డి) ఆల్కహాల్

జ: (సి)

 

10. కరోనరీ ధమనుల్లో చెడ్డ కొలెస్ట్రాల్ జమకూడటం వల్ల ఎలాంటి హాని కలుగుతుంది?
ఎ) గుండెపోటు రావచ్చు బి) పక్షవాతం రావచ్చు సి) మూత్రపిండాల వైఫల్యం డి) కాలేయం దెబ్బతింటుంది

జ: (ఎ)

 

11. మన శరీరానికి ప్రోటీన్‌లు ఏ విధంగా అవసరమవుతాయి?
ఎ) పెరుగుదల, అభివృద్ధికి బి) గాయాలు మానడానికి సి) ప్రోటీన్‌ల తయారీకి డి) పైఅన్ని విధాలుగా

జ: (డి)

Posted Date : 24-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌