• facebook
  • whatsapp
  • telegram

ఎడారుల్లో అర్ధ చంద్రాకృతి ఇసుక తిన్నెలు!

ప్రధాన భూఉపరితల స్వరూపాలు, వికోశీకరణం, క్రమక్షయ స్వరూపాలు



పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదీ లోయలు, జలపాతాలు, ఎడారుల వంటివన్నీ ప్రధాన భూఉపరితల స్వరూపాలు. పవనాలు, నదీ ప్రవాహాలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, సముద్ర ప్రవాహాలు తదితరాలు అంతర్జనిత, బహిర్జనిత బలాల ప్రభావాలు.  క్రమక్షయం, నిక్షేపణం, వికోషీకరణం  మొదలైనవి గాలి, నీటి ప్రవాహాల వల్ల జరిగే నిరంతర పరిణామాలు. ఈ సహజ ప్రకృతి కృత్యాలతో ఏ భూస్వరూపం ఎలా ఏర్పడుతుంది? అందుకు తోడ్పడే ఇతర కారకాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన భూస్వరూపాలు, శీతోష్ణ పరిస్థితులపై  పరిజ్ఞానం పెంచుకోవాలి.

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1. శిలలను శిథిలం చేయడం, భూఉపరితలాన్ని సమం చేసే ప్రక్రియను ఏమంటారు?

1) శిలాశైథిల్యం      2) క్రమక్షయం  

3) వికోశీకరణం      4) పైవన్నీ

 

2. శైథిల్యాన్ని ప్రభావితం చేసే కారకాలు?

ఎ) శిలా స్వభావం     బి) శీతోష్ణస్థితి  

సి) కాలం           డి) శిలాపదార్థాల రవాణా

1) ఎ, బి, డి        2)  బి, సి    

3) ఎ, బి, సి      4) బి, సి, డి

 

3. శిలలు శైథిల్యం చెందినప్పుడు శిలల ఉపరితలంపై ఏర్పడే మృదువైన పొరను ఏమని పిలుస్తారు?

1) రిగోలిత్‌      2) బెడ్‌రాక్‌  

3) టార్స్‌      4) అపదళనం

 

4. కింది ఏ ప్రాంతాల్లో భౌతిక శిలాశైథిల్యం అధికంగా జరుగుతుంది?

1) భూమధ్యరేఖ ప్రాంతాలు  2) ఎడారి ప్రాంతాలు

3) మంచు ప్రాంతాలు  4) సమ శీతోష్ణమండల ప్రాంతాలు

 

5. రసాయనిక శిలాశైథిల్యం కింది ఏ ప్రాంతాల్లో అధికంగా జరుగుతుంది?

1) గ్రానైట్‌ ప్రాంతాలు   2) సున్నపురాయి భౌగోళిక ప్రాంతాలు

3) మంచు ప్రాంతాలు       4) పైవన్నీ

 

6. ఏ కారణం వల్ల ఎడారి ప్రాంతాల్లో ‘భౌతిక శిలా శైథిల్యం’ ఎక్కువగా కనిపిస్తుంది?

1) ఉష్ణోగ్రత   2) వర్షపాతం తక్కువగా ఉండటం

3) ఇసుక నేల  4) పరిసరాల ప్రభావం

 

7. కిందివాటిలో భూ ఉపరితల దృశ్యంపై అనేక రకాల మూడో తరం భూస్వరూపాలు ఏర్పడే క్రమంలో అంతర్జనిత బలాలకు ఉదాహరణ?

1) నదులు      2) భూకంపాలు  

3) పవనాలు      4) సముద్ర ప్రవాహాలు

 

8. డుడుమా జలపాతం ఏ నదిపై ఉంది?

1) కావేరి      2) కృష్ణా 

3) మాచ్‌ఖండ్‌      4) మహానది

 

9. ఎడారి ప్రాంతాల్లో కనిపించే ఇసుక మైదానాలను ఏమని పిలుస్తారు?

1) హమ్మడాలు  2) సెరీర్‌   3) ఎర్గ్స్‌  4) రెగ్‌

 

10. U -  ఆకార లోయలు హిమానీనద క్రమక్షయం చర్య వల్ల ఏర్పడుతుండగా V - ఆకార లోయలు దేనివల్ల ఏర్పడతాయి?

1) నదీ క్రమక్షయ చర్య   2) పవన క్రమక్షయ చర్య

3) అంతర్భూజల క్రమక్షయ చర్య  4) సముద్ర తీరపు క్రమక్షయ చర్య

 

11. ‘బైసన్‌ గార్జ్‌’ ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఆంధ్రప్రదేశ్‌      2) తెలంగాణ 

3) అరుణాచల్‌ ప్రదేశ్‌      4) హిమచల్‌ ప్రదేశ్‌

 

12. ‘షోల్స్‌’ అంటే?

1) తీర ప్రాంతాల్లోని ఉప్పునీటి సరస్సులు

2) సముద్రాల్లో ఏర్పడే చిన్న చిన్న ఇసుక దిబ్బలు

3) తీరప్రాంతం వెంబడి విస్తరించి ఉన్న ఇసుక, ఒండ్రు మట్టికట్టలు     4) ఏదీకాదు

 

13. ‘శరావతి’ నదిపై ఉన్న జలపాతం?

1) జోగ్‌    2) యన్న   3) ఎడ్డ   4) కెల్వి

 

14. అమెరికాలోని కొలరాడో పీఠభూమిలో కొలరాడో నది ఏర్పరుస్తున్న ‘గ్రాండ్‌ కాన్యాన్‌’ ఏ రకమైన నదీ క్రమక్షయం, నిక్షేపణ చర్యల వల్ల ఏర్పడే భూస్వరూపానికి ఉదాహరణ?

1) అగాధ దరి     2) గార్జ్‌

3) మోనాడ్‌ నాక్స్‌   4) V, U ఆకార లోయలు

 

15. ‘బార్కాన్స్‌’ అంటే ఏమిటి?

1) ఎడారి ప్రాంతాల్లో కనిపించే కత్తి ఆకారపు ఇసుక తిన్నెలు

2) ఎడారి ప్రాంతాల్లో కనిపించే అర్ధ చంద్రాకృతి ఇసుక తిన్నెలు

3) ఎడారి భౌగోళిక ప్రాంతాల్లో కనిపించే లోయలు 4) ఏదీకాదు

 

16. ఎడారుల్లో కురిసిన వర్షపు నీరు పెద్ద లోయల ద్వారా ప్రవహిస్తే దాన్ని ఏమంటారు?

 1) వాడీలు 2) బజాడాలు 3) ప్లయాలు 4) బోల్సన్‌

 

17. ప్రపంచంలో అతి పెద్దదైన ‘నయాగరా జలపాతం’ ఏ నదిపై ఉంది?

1) మిసిసిపి 2) ఒరినాకో 3) సెంట్‌లారెన్స్‌ 4) నైలు

 

18. ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘కాన్యాన్‌’ ఏ నదిపై ఉంది?

1) అమెజాన్‌  2) నైలు  3) కొలరాడో  4) మెకంజి

 

19. ఇన్సల్‌ బర్గ్‌ అంటే?

1) పెనిప్లేన్‌ మైదానాల్లో మిగిలిపోయిన ఒంటరి శిలాఖండాలు

2) పెడిప్లేన్‌ మైదానాల్లో మిగిలిపోయిన ఒంటరి శిలాఖండాలు

3) ఎడారి ప్రాంతాల్లో కనిపించే లోయలు

4) సున్నపురాయి ప్రాంతాల్లో కనిపించే లోయలు

 

20. టెర్రరోజా అంటే?

1) ఒక చెట్టు    2) నల్లరేగడి నేల

3) ఎరుపు వర్ణపు మైదానం    4) ఒక గుట్ట

 

21. స్టాలక్‌ టైట్స్, స్టాలగ్‌ మైట్స్‌ అనే భూస్వరూపాలు ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి?

1) గ్రానైట్‌ ప్రాంతాలు   2) సున్నపురాయి భౌగోళిక ప్రాంతాలు

3) ఎడారి ప్రాంతాలు       4) మంచు ప్రాంతాలు

 

22. గోలాశ్మ మృత్తిక మైదానాలు అంటే?

1) హిమానీ నదాలు మెరైన్‌ నిక్షేపాలను ఏర్పరచడం వల్ల ఏర్పడిన మైదానాలు

2) గాలి ద్వారా ఏర్పడిన మైదానాలు

3) ఇసుక, గ్రావెల్‌లో నిక్షేపించడం వల్ల ఏర్పడిన మైదానాలు

4) నదులు తమ ప్రవాహ క్రమంలో ఏర్పరిచిన మైదానాలు

 

23. పుస్టాస్‌ అంటే?

1) పవన నిక్షేపాలు       2) గడ్డి మైదానాలు

3) హిమానీ నదీకృత స్వరూపాలు    4) స్థానిక పవనాలు

 

24. నది బాల్యదశలో ఏర్పడే భూస్వరూపం?

1) ఆక్స్‌బౌ సరస్సులు       2) డెల్టా  

3) గార్జ్‌      4) నదీ వక్రం

 

25. ‘గుడ్లగంప ఆకారం ఉన్న స్థలాకృతి’ దేనికి సంబంధించింది?

1) గర్త్‌లు    2) డ్రమ్లిన్స్‌   

3) కోత మైదానాలు      4) ఒండ్రు నేలలు

 

26. ‘ఎరాటిక్స్‌’ దేనివల్ల ఏర్పడిన భూస్వరూపాలు?

1) నదులు       2) హిమానీనదాలు  

3) పవనం      4) ఉష్ణోగ్రత

 

27. ‘బహిర్గత మైదాన భూస్వరూపం’ దేనివల్ల ఏర్పడుతుంది?

1) హిమానీనదాలు      2) పవనాలు  

3) నదులు      4) అలలు

 

28. పర్వత పాదాల్లో ‘శంకు’ ఆకారంలో పోగుపడే రేణువులు?

1) టోర్స్‌      2) స్టాలక్‌ మైట్‌  

3) టోలస్‌కాన్స్‌      4) డ్రమ్లిన్స్‌

 

29. ‘జ్యాగన్‌’ ఏ ప్రాంతంలో ఏర్పడుతుంది?

1) హిమానీనద ప్రాంతం    2) శుష్క మైదానం

3) కార్‌స్ట్‌ మైదాన ప్రాంతం   4) నదీ పరీవాహక ప్రాంతం

 

30. ‘ఆక్స్‌బౌ సరస్సు’ ఆకారం ఏ విధంగా ఉంటుంది?

1) వృత్తాకారం      2) దీర్ఘవృత్తాకారం

3) అర్ధవృత్తాకారం       4) త్రికోణీయం

 

31. ‘యార్డాంగ్స్‌’ ఏ ప్రాంతంలోని భూఆకృతులు?

1) సముద్ర అంతర్భాగం 2) ఎడారి ప్రాంతం

3) నదీప్రవాహ ప్రాంతం 4) హిమానీనదాల ప్రాంతం

 

32. ‘సీఫ్‌’ అనేది?

1) బార్కాన్‌ ఆకారంలో ఏర్పడే స్వరూపం

2) అరబ్బుల కత్తిని పోలి ఏర్పడే ఇసుక తిన్నెలు

3) పవనాల క్రమక్షయం వల్ల తేనె పట్టు ఆకారంలో ఏర్పడిన నిర్మాణాలు

4) ఎడారి ప్రాంతంలో ఏర్పడిన తాత్కాలిక సరస్సులు

 

33. సముద్ర అంతర్భాగంలోని ఎత్తయిన కొండలకు (రిడ్జ్‌) ఉదాహరణ?

1) అట్లాంటిక్‌  2) పసిఫిక్‌ 3) అరేబియా 4) హిందూ

 

34. ‘కార్‌స్ట్‌/కార్ప్స్‌’ భూస్వరూపాలకు ఉదాహరణ?

1) బ్యాంక్స్‌/ ఇసుక దిబ్బలు        2) అఖాతాలు  

3) ఆక్స్‌బౌ సరస్సులు      4) రోచ్‌మాటినే

 

35. కిందివాటిలో రెండు లోయలను వేరు చేసే ఇరుకైన రాతి శిఖరం ఏది?

1) ఎరెటే   2) సీఫ్స్‌  3) కాన్యన్‌   4) కొమ్ము

 

36. అపదళన ప్రక్రియ వల్ల గుండ్రంగా మారిన శిలలను ఏమని పిలుస్తారు?

1) టార్స్‌ 2) రిగోలిత్‌  3) బెడ్‌రాక్‌ 4) అపదళనం

 

37. అపదళన ప్రక్రియ ఎక్కువగా ఏ శిలల్లో జరుగుతుంది?

1) సున్నపురాయి      2) గ్రానైట్‌  

3) బసాల్ట్‌      4) క్వార్ట్జ్‌

38. శిలా శైథిల్యం వల్ల శిలల ఉపరితలంపై ఏర్పడే మృదువైన శిథిల పొరను ఏమంటారు?

1) టార్స్‌  2) రిగోలిత్‌ 3) బెడ్‌రాక్‌ 4) అపదళనం

 

39. ప్రాథమిక శిలలు అని వేటిని అంటారు?

1) అవక్షేప శిలలు      2) రూపాంతర శిలలు  

3) యాంత్రిక శిలలు      4) అగ్ని శిలలు

 

40. జలపాతాలు, కొండలు, గుహలు వంటి శిలాకృతులు ఏర్పడటానికి కారణం?

1) అంతర్జనిత బలాలు      2) బహిర్జనిత బలాలు  

3) సంపీడన బలాలు     4) తన్యతా బలాలు

 

41. కాల్షియం కార్బోనేట్‌ నిక్షేపణలు కింద నుంచి స్తంభాకృతిలో ఏర్పడటాన్ని ఏమంటారు?

1) స్టాలగ్‌ మైట్‌     2) హెలిక్‌ మైట్‌  

3) స్టాలక్‌ టైట్‌     4) హెలిక్‌ టైట్‌

 

42. లేత పసుపు రంగులో మెత్తని మట్టితో విస్తారంగా నిర్మితమైన మట్టి దిబ్బలను ఏమంటారు?

1) లోయస్‌లు 2) నెబ్జా  3) బార్కాన్స్‌ 4) సైఫ్‌

 

43. రాజస్థాన్‌లో కదిలే ఇసుక దిబ్బలను ఏమంటారు?

1) థ్రియాన్‌  2) ఎర్గ్‌  3) బార్కాన్స్‌ 4) నెబ్జా

 

44. పెద్ద బండలతో విస్తరించి ఉన్న ఎడారులను ఏమంటారు?

1) హమ్మడాలు 2) బజడాలు 3) పెడిమెంట్‌ 4) బోల్సన్‌

 

45. ఎడారిలో వీచే ఇసుక తుపాన్‌లను ఏమంటారు?

1) థ్రియాన్‌     2) ఎర్గ్‌  

3) పైమూన్‌లు      4) బార్కాన్స్‌ 

 

46. గుహలు, భూ ఉపరితలాన్ని కలిపే రంధ్రాలను ఏమని పిలుస్తారు?

1) పోనోర్‌ 2) ఉవాలాలు 3) పోల్జెలు 4) లాపీలు

 

47. దగ్గరగా ఉన్న గుహల గోడలు కరిగిపోయినప్పుడు ఏర్పడే లోయల వంటి ఆకారాలను ఏమంటారు?

1) పాకెట్‌ లోయలు      2) లోయస్‌ లోయలు

3) సాల్యూట్‌ లోయలు     4) సాల్యూషన్‌ లోయలు

 


సమాధానాలు

1 3; 2-3; 3-1; 4-2; 5-2; 6-1; 7-2; 8-3; 9-3; 10-1; 11-2; 12-2; 13-1; 14-1; 15-2; 16-1; 17-2; 18-3; 19-2; 20-3; 21-2; 22-1; 23-2; 24-3; 25-2; 26-2; 27-1; 28-3; 29-2; 30-3; 31-2; 32-2; 33-1; 34-1; 35-1; 36-1; 37-2; 38-2; 39-1; 40-2; 41-1; 42-1; 43-1; 44-1; 45-3; 46-1; 47-4.

 


రచయిత: సక్కరి జయకర్‌ 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 27-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌