• facebook
  • whatsapp
  • telegram

విద్యుత్ 

1. ధనావేశిత వస్తువు ద్రవ్యరాశి, తటస్థ వస్తువు ద్రవ్యరాశి కంటే...?

1) స్వల్పంగా ఎక్కువ     2) స్వల్పంగా తక్కువ    3) చాలా ఎక్కువ         4) చాలా తక్కువ

 

2. ఒక సబ్బు నీటి బుడగ పరిమాణాన్ని పెంచాలంటే దానికి ఏ విద్యుదావేశాన్ని ఇవ్వాలి?

1)  ధన    2) రుణ    3) ధన లేదా రుణ  4) ఏదీకాదు

 

3. విద్యుదావేశం విషయంలో సరైంది ఏది?

a) ఎలక్ట్రాన్ల బదిలీ విద్యుదావేశానికి కారణం

b) విద్యుదావేశాన్ని సృష్టించవచ్చు, నాశనం చెయ్యొచ్చు.

c) ఏ విద్యుదావేశమైనా, ఎలక్ట్రాన్‌ విద్యుదావేశానికి సమానం.

d) ఎలక్ట్రాన్ల సంఖ్య ఉండాల్సిన విలువ కంటే ఎక్కువైతే లేదా తక్కువైతే వస్తువుకు విద్యుదావేశం ఏర్పడుతుంది.

1)a, b     2) b, c       3) c, d     4) a, d

 

4. ఆకాశంలో మెరుపు ఏర్పడటానికి కారణం?

A) మేఘాల మధ్య రాపిడితో వాటికి విద్యుదావేశాలు ఏర్పడటం.

B)  భిన్న ఆవేశాలతో ఉండే మేఘాల మధ్య జరిగే విద్యుత్‌ ఉత్సర్గం

C) ప్లాస్మా స్థితిలోని వాయువుల్లో అధిక విద్యుత్‌ ప్రసరించడం.]

D) అధిక విద్యుత్‌ గాలిని మండించడం

1) A, B, C        2) B, C, D   3)  A, B, C, D     4) A, C, D

 

5. పిడుగులను ఆకర్షించేందుకు ఎత్తయిన భవనాలపై బిగించే రక్షణ కడ్డీలను దేనితో తయారుచేస్తారు?

1) రాగి    2) జింక్‌    3) వెండి    4) ప్లాటినం

 

6. రెండు విద్యుదావేశాల మధ్య దూరాన్ని రెట్టింపు చేస్తే వాటి మధ్య పనిచేసే బలం.....

1) రెండు రెట్లు అవుతుంది           2) నాలుగో వంతుకు తగ్గుతుంది

3) నాలుగు రెట్లు పెరుగుతుంది     4) సగానికి తగ్గుతుంది


7. విద్యుత్‌ ప్రసరించే తీగపై ఏ ఆవేశం ఉంటుంది?

1) ధనావేశం         2) రుణావేశం   3) తటస్థం         4) ధన లేదా రుణ

 

8. అత్యుత్తమ విద్యుత్‌ వాహకం?

1) వెండి   2)బంగారం   3)రాగి   4) అల్యూమినియం

 

9. కెపాసిటర్‌ లేదా కండెన్సర్‌ను ఎక్కడ ఉపయోగిస్తారు?

1) విద్యుత్‌ మోటార్లలో                     2) ఫిల్టర్‌ వలయాల్లో

3) రేడియో ట్యూనింగ్‌ వలయంలో       4) పైఅన్నింటిలో 

 

10. కిందివాటిలో అత్యల్ప ఆవేశాన్ని కలిగి ఉండేది ఏది?

1) క్వార్క్‌           2) ఎలక్ట్రాన్‌    3)ప్రోటాన్‌           4) హైడ్రోజన్‌ కేంద్రకం

 

11. విద్యుదావేశం ఎల్లప్పుడు...

1) బోలు ఉపరితలాలపై మాత్రమే ఉంటుంది.

2) మొనదేలిన అంచుల వద్ద కేంద్రీకృతం అవుతుంది.

3) ఎలక్ట్రాన్‌ ఆవేశానికి పూర్ణాంక గుణిజం 

4) పైవన్నీ

 

12. పిడుగుపాటు విషయంలో సరైంది ఏది?

1) స్థిర విద్యుత్‌ ప్రేరణ వల్ల భూమి వైపు  ఆకర్షితమవుతుంది.

2) ఎత్తయిన కట్టడాలపైకి ఆకర్షితమతుంది.

3) విమానాల్లో ప్రయాణించే వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపదు

4) పైవన్నీ

 

13. ఒక ధనావేశిత గోళాన్ని భూమికి కలిపితే..

1) ఎలక్ట్రాన్లు భూమి నుంచి గోళానికి ప్రసరిస్తాయి.

2) విద్యుత్‌ గోళం నుంచి భూమికి ప్రయాణిస్తుంది.

3) ఎలక్ట్రాన్లు గోళం నుంచి భూమికి ప్రయాణిస్తాయి.

4)1, 2

 

14. రబ్బరు, ప్లాస్టిక్‌ మొదలైన పదార్థాల్లో విద్యుత్‌ ప్రసరించకుండా ఉండటానికి కారణం అందులో..?

1) ఎలక్ట్రాన్లు లేకపోవడం

2) బంధిత ఎలక్ట్రాన్లు లేకపోవడం

3) కేవలం బంధిత ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండటం.

4) స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు అధికంగా ఉండటం.

 

15. విద్యుత్‌ బలరేఖలు...

A)  సంవృత వలయాలు 

B) ధనావేశం వద్ద ప్రారంభమవుతాయి

B) రుణావేశం వద్ద అంతమవుతాయి 

D)  వియుక్త ఆవేశం విషయంలో అవి అనంతం వద్ద నుంచి ప్రారంభం లేదా అంతమవుతాయి.

1) A, B     2) C, D     3) B,  C, D   4) A, C, D 

 

16. ఒక కూలుమ్‌ ఆవేశం కలిగి ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య?

1) 6 * 1018         2)1.6 * 10-19       3) 1.6 * 1018         4) 6 * 10-18

 

17. అనంత దూరంలోని ఏకాంక ధనావేశాన్ని విద్యుత్‌ క్షేత్రంలోని ఒక బిందువు వద్దకు తీసుకు రావడానికి చేసిన పని, ఆ బిందువు వద్ద దేనికి సమానం?


1) విద్యుత్‌ చాలక బలం    2)  స్థిర విద్యుత్‌ పొటెన్షియల్‌      3) 1 వోల్ట్‌        4) విద్యుత్‌ క్షేత్ర తీవ్రత


18. పొటెన్షియల్‌ విషయంలో సరైంది?

1) అనంతం వద్ద పొటెన్షియల్‌ శూన్యం

2) భూమి పొటెన్షియల్‌ను శూన్యంగా తీసుకుంటారు

3) సమ పొటెన్షియల్‌తో ఉండే రెండు బిందువుల మధ్య విద్యుత్‌ ప్రవహించదు

4) పైవన్నీ

 

19. పొడి వెంట్రుకలను దువ్విన ప్లాస్టిక్‌ దువ్వెన చిన్న కాగితపు ముక్కలను ఆకర్షిస్తుంది. ఎందుకు?

1)  ఘర్షణ (రాపిడి)తో దువ్వెన విద్యుదావేశాన్ని పొందడం వల్ల

2)  దువ్వెన కాగితపు ముక్కలపై స్థిర విద్యుత్‌ ప్రేరణ వల్ల వ్యతిరేక ఆవేశాన్ని ప్రేరేపించడంతో

3) వ్యతిరేక ఆవేశాలు పరస్పరం ఆకర్షించడం వల్ల

4) పైవన్నీ

 

20. పేలుడు పదార్థాలను రవాణా చేసే లారీలకు భూమిని తాకే విధంగా ఇనుప గొలుసులను వేలాడదీస్తారు. ఎందుకు?

1) గాలితో ఘర్షణ వల్ల లారీ విద్యుదావేశాన్ని పొందటం

2) గొలుసులు ఆవేశాన్ని భూమికి ప్రసారం చేయడానికి

3) విద్యుదావేశం వల్ల పదార్థాలు పేలకుండా ఉండటానికి

4) పైవన్నీ

 

21. విద్యుత్‌ తీగపై వాలిన పక్షి ఎప్పుడు విద్యుత్‌ షాక్‌కు గురవుతుంది?

1)  ఒక తీగపై ఉన్న పక్షి తోక మరొక తీగను తాకినప్పుడు

2)  రెండు వేర్వేరు తీగలపై ఉన్న పక్షులు, ఒకదాన్ని మరొకటి తాకినప్పుడు

3)  ఒకే పక్షి రెండు కాళ్లు వేర్వేరు తీగలపై ఉన్నప్పుడు 

4) పైవన్నీ


22. స్థిర విద్యుదాకర్షణతో పని చేసేవి ఏవి?

1)  జిరాక్స్‌ మెషిన్‌

2) థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ పొగ గొట్టాల్లో దుమ్ము, ధూళి కణాలను నిలిపి ఉంచే ప్రిసిపిటేటర్లు

3) పెయింట్‌ స్ప్రేయర్‌ పరికరాలు

4) పైవన్నీ

 

23. కింది అంశాలను జతపరచండి.

  పరికరం                               కొలిచే రాశి   

i)  పొటెన్షియో మీటర్‌             a) ఘటం అంతర్నిరోధం

ii) వోల్ట్‌మీటర్‌                       b)  విద్యుత్‌ ప్రవాహం

iii)  అమ్మీటర్‌                      c) స్వల్ప విద్యుత్‌ ఉనికి

iv)  గాల్వనామీటర్‌               d)  పొటెన్షియల్‌ తేడా

1) i-a,   ii-d,    iii-b,     iv-c        2) i-d,   ii-b,    iii-c,     iv-a

3) i-c,   ii-d,    iii-a,     iv-b        4) i-a,     ii-b,    iii-c,       iv-d

 

24. విద్యుదావేశానికి ళీఖి ప్రమాణం ఏది?

1) ఆంపియర్‌   2) జౌల్‌   3) వోల్ట్‌   4) కూలుమ్‌

 

25. పొటెన్షియల్‌ తేడాకి మరొక పేరు...

1)  ఆంపియరేజ్‌         2) వాటేజ్‌       3) వోల్టేజ్‌         4) ఏదీకాదు

 

26. క్రింది ప్రవచనాల్లో సరైంది ఏది?

1)  అమ్మీటర్‌ని వలయంలో సమాంతరంగా కలుపుతారు

2)  అమ్మీటర్‌ అధిక నిరోధాన్ని కలిగి ఉంటుంది.

3)  గాల్వనామీటర్‌కి షంట్‌ నిరోధాన్ని కలిపితే అమ్మీటర్‌ ఏర్పడుతుంది.

4) గాల్వనామీటర్‌కి అధిక నిరోధాన్ని శ్రేణిలో కలిపితే అమ్మీటర్‌ ఏర్పడుతుంది.


27. ఓమ్‌ నియమం నిర్వచనంలో దేన్ని స్థిరంగా ఉంచుతారు?

1)  విద్యుత్‌ నిరోధం         2) ఉష్ణోగ్రత    3) వోల్టేజీ         4) విద్యుత్‌ ప్రవాహం

 

28. నాన్‌-ఓమిక్‌ వాహకానికి ఉదాహరణ ఏది?

1) థర్మిష్టర్‌    2) వెండి తీగ  3) రెసిస్టర్‌  4) రాగి తీగ

 

29. R నిరోధంతో ఉండే ఒక తీగ పొడవు రెట్టింపు అయ్యేంతగా సాగదీస్తే దాని నిరోధం?

1) 2R    2) 4R        3) R/2       4) R/4

 

30. విద్యుత్‌ పరంగా కార్బన్‌ రూపాంతరాలైన గ్రాఫైట్, వజ్రాలు

1)  విద్యుత్‌ వాహకం, బంధకం        2) బంధకం, వాహకం

3)  విద్యుత్‌ వాహకాలు                4)  విద్యుత్‌ బంధకాలు

 

31. విశిష్ట నిరోధం విషయంలో సరైంది ఏది?

A) వాహకం పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది

B) వాహకం ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది

C) వాహకం మధ్యచ్ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది.

D) వాహకం పదార్థంపై ఆధారపడుతుంది

1) A, C   2) B, C 3) B, D    4) A, B, C, D

 

32. సమాన నిరోధంతో ఉండే మూడు విద్యుత్‌ నిరోధాలను సమాంతరంగా, శ్రేణిలో అనుసంధానం చేస్తే రెండు సందర్భాల్లో ఫలిత నిరోధాల నిష్పత్తి ఎంత?

1) 1 : 9    2)  9 : 1    3) 4 : 1   4)  1 : 4

 

33. 100 W సామర్థ్యం ఉన్న విద్యుత్‌ హీటర్‌ను 2 నిమిషాలపాటు వినియోగిస్తే విడుదలయ్యే ఉష్ణశక్తి ఎంత?

1)  4 * 103J         2) 10 * 103J       3) 6 * 103J        4) 12 * 103J

 

34. ఫారడ్‌ ( Farad) అనే ప్రమాణాన్ని కలిగిన విద్యుత్‌ రాశి ఏది?

1)  కెపాసిటెన్స్‌         2) ఇండక్టన్స్‌    3) ఇంపిడెన్స్‌         4) కండక్టన్స్‌


35. జౌల్‌ ఉష్ణ ఫలితం ఆధారంగా పనిచేసే విద్యుత్‌   పరికరం?

1) హీటర్‌         2)  ఇస్త్రీపెట్టె    3)  విద్యుత్‌ ఫ్యూజు         4)  పైవన్నీ

 

36. విద్యుత్‌ ఫ్యూజు తీగకు ఉండాల్సిన లక్షణం ఏది?

1)  అధిక నిరోధం, అధిక ద్రవీభవన స్థానం

2) అధిక నిరోధం, అల్ప ద్రవీభవన స్థానం

3) అల్ప నిరోధం, అధిక ద్రవీభవన స్థానం

4)  అల్ప నిరోధం, అల్ప ద్రవీభవన స్థానం


37. శక్తి లేదా పనికి ప్రమాణం ఏది?

1) కిలోవాటర్‌ అవర్‌( KWH)    2) ఎలక్ట్రాన్‌ వోల్ట్‌ (eV)   3) ఆంపియర్‌ అవర్‌(Ah)     4) 1, 2

 

38. నిరోధాలను సమాంతరంగా కలిపితే

1)  వాటిపై ఉండే పొటెన్షియల్‌ విలువలు సమానం

2) వాటి ద్వారా ప్రయాణించే విద్యుత్‌ విలువలు  అసమానం

3)  ఫలిత నిరోధం నిరోధాల్లోని కనిష్ఠ విలువ కంటే తక్కువ 

4)  పైవన్నీ

 

39. వస్తువులను ఎన్ని రకాలుగా విద్యుదావేశితం (Charging) చేయవచ్చు?

1) విద్యుత్‌ ప్రేరణతో                                   2) స్పర్శలో ఉంచడం ద్వారా

3)  పరస్పరం రాపిడికి గురిచేయడం ద్వారా     4)  పైవన్నీ


40. విద్యుత్‌ నిరోధం లేని పదార్థాలు ఏవి?

1)  విద్యుత్‌ వాహకాలు                  2)  విద్యుత్‌ బంధకాలు

3)  విద్యుత్‌ అతివాహకాలు             4) అర్ధవాహకాలు


41. వాన్‌-డి-గ్రాఫ్‌ జనరేటర్‌ దేన్ని ఉత్పత్తి చేస్తుంది?

1)  అధిక వోల్టేజీని                         2)  అధిక విద్యుత్‌ను 

3) అధిక విద్యుచ్ఛాలక బలాన్ని       4)  ఏదీకాదు

 

42. మైక్రోవేవ్‌ ఓవెన్లో వేడికి గురి అయ్యే పదార్థాల్లోని  అణువులు వేటిని కలిగి ఉండాలి?

1) ధ్రువ అణువులు                 2)  అధ్రువ అణువులు

3) తటస్థ ఆవేశిత అణువులు    4) ధనావేశిత అణువులు

 

43. ఎలక్ట్రాన్‌ ఆవేశాన్ని, ఆవేశ క్వాంటీకరణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?

1) కూలూమ్‌      2) ఫ్రాంక్లిన్‌      3)  మిల్లికాన్‌  4) ఫారడే

 

44. ఏ రకమైన అపాయాల నుంచి విద్యుత్‌ ఫ్యూజు ఇంటిని కాపాడుతుంది?

1)  అధిక విద్యుత్‌         2)  ఓవర్‌లోడ్‌ సమస్యలు

3)  షార్ట్‌ సర్క్యూట్‌        4)  పైవన్నీ


45. విద్యుత్‌ హీటర్‌ కాయిల్‌ని దేంతో తయారుచేస్తారు?

1) నిక్రోమ్‌           2) టంగ్‌స్టన్‌        3) ఎబోనైట్‌        4) జింక్‌


46. కండెన్సర్‌ దేన్ని నిల్వ చేస్తుంది?

1)  విద్యుత్‌ ఆవేశం            2) విద్యుత్‌ శక్తి

3)  విద్యుత్‌ పొటెన్షియల్‌     4)  1, 2


47. అధిక  ఉష్ణోగ్రతల వద్ద విద్యుత్‌ వాహకంగా అల్ప ఉష్ణోగ్రతల వద్ద విద్యుత్‌ బంధకంగా పనిచేసే పదార్థాలు ఏవి?

1)  అర్ధవాహకాలు         2)  వాహకాలు   3)  అతివాహకాలు         4) పైవన్నీ


సమాధానాలు


1) 2   2) 3   3) 4   4) 3   5) 1   6) 2   7) 3   8) 1   9) 4   10) 1  11) 4  12) 4  13) 4  14) 3  15) 4  16) 1  17) 2  18) 4  19) 4  20) 4  21) 4  22) 4  23) 1  24) 4  25) 3  26) 3  27) 2 28) 1  29) 2  30) 1  31) 3  32) 1  33) 4  34) 1  35) 4  36) 2  37) 4  38) 4  39) 4  40) 3  41) 1  42) 1  43) 3  44) 4  45) 1  46) 4   47) 1.

 

 

అభ్యాస ప్ర‌శ్న‌లు

1. విద్యుదయస్కాంతాన్ని దేనితో తయారు చేస్తారు?
జ‌: మెత్తటి ఇనుము


2. ప్రాథమిక ఘటానికి సంబంధించి సరైంది ఏది?
ఎ) ధనావేశం జింక్ ఎలక్ట్రోడ్‌కు చేరుతుంది
బి) రుణావేశం రాగి ఎలక్ట్రోడ్‌కు చేరుతుంది
సి) రుణావేశం జింక్ ఎలక్ట్రోడ్‌ను చేరుతుంది
డి) ధనావేశం రాగి ఎలక్ట్రోడ్‌ను, రుణావేశం జింక్ ఎలక్ట్రోడ్‌ను చేరతాయి.
జ‌: డి(ధనావేశం రాగి ఎలక్ట్రోడ్‌ను, రుణావేశం జింక్ ఎలక్ట్రోడ్‌ను చేరతాయి)


3. ప్రాథమిక ఘటంలో ఏం జరుగుతుంది?
ఎ) విద్యుచ్ఛక్తి రసాయనిక శక్తిగా మారుతుంది
బి) రసాయనశక్తి విద్యుచ్ఛక్తిగా మారుతుంది
సి) విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది
డి) రసాయనశక్తి ఉత్పత్తి అవుతుంది
జ‌: బి(రసాయనశక్తి విద్యుచ్ఛక్తిగా మారుతుంది)


4. విద్యుత్ ఎలా ప్రవహిస్తుంది?
జ‌: ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్‌కు


5. భూమి పొటెన్షియల్ ఎంత?
జ‌: 0 V


6. కరెంట్‌కు ప్రమాణం ఏమిటి?
జ‌: ఆంపియర్


7. కిందివాటిలో అవాహకానికి ఉదాహరణ ఏది?
ఎ) మానవచర్మం      బి) లోహాలు       సి) రబ్బర్      డి) ఏదీకాదు
జ‌: సి(రబ్బర్)


8. 1 కూలూంబ్ విలువ ఎంత?
జ‌: 6.24 × 1018 ఎలక్ట్రాన్లు/ సెకన్

 

 

బిట్ బ్యాంక్

1. AC విద్యుత్‌ను DC విద్యుత్‌గా మార్చే రెక్టిఫైయర్‌లోకి వెళ్లే విద్యుత్‌ పౌనఃపున్యం 'n'  అయితే, దాని నుంచి వెలుపలికి వచ్చే విద్యుత్‌ పౌనఃపున్యం ఎంత?

 1) n/2       2) n     3)3n/2         4) 2n

    

2. DC విద్యుత్‌ను AC విద్యుత్‌గా మార్చేది ఏది?

1) బ్రిడ్జి రెక్టిఫైయర్‌    2) ఇన్వర్టర్‌      3) ఆంప్లిఫైయర్‌         4) డయోడ్‌


3. విద్యుత్‌ ప్రవాహం విషయంలో సరైంది ఏది?

1)  ప్రమాణ వాహక మధ్యచ్ఛేదం నుంచి ప్రమాణకాలంలో ప్రసరించే స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య

2) ప్రమాణ వాహక మధ్యచ్ఛేదం నుంచి ప్రమాణకాలంలో ప్రసరించే విద్యుత్‌ ఆవేశం

3)  ఎలక్ట్రాన్ల ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది.

4)  పైవన్నీ


4. కిర్కాఫ్‌ రెండో నియమం విషయంలో సరైంది/ సరైనవి ఏది/ ఏవి?

A. శక్తి నిత్యత్వ నియమాన్ని సూచిస్తుంది.

B . సంవృత వలయంలోని పొటెన్షియల్‌ తేడాల బీజీయ మొత్తం శూన్యం.

C. సంక్లిష్ట విద్యుత్‌ వలయాల్లో విద్యుత్‌ ప్రవాహం, పొటెన్షియల్‌ పాతం, విద్యుత్‌ నిరోధాన్ని కలిగించే శక్తి నష్టాలను లెక్కించవచ్చు.

D. దీన్నే వలయ నియమం లేదా వోల్టేజి నియమం అంటారు.

1) A, C, D    2) A, B, C, D    3) A, B, D    4) A, B, C


5. వోల్టేజి (v) , కరెంట్‌ (i) గ్రాఫ్‌ వాలు దేన్ని సూచిస్తుంది?

1)  విద్యుత్‌ నిరోధం  

2) విద్యుత్‌ సామర్థ్యం

3) విద్యుత్‌ వాహకత్వం 

4) విద్యుత్‌ కెపాసిటెన్స్‌


6. రెండు పలకలపై సమాన, వ్యతిరేక ఆవేశాలతో ఉండే సమాంతర పలకల కెపాసిటర్‌ విషయంలో సరైంది?

1) కెపాసిటర్‌ ఫలిత విద్యుదావేశం శూన్యం.

2) కెపాసిటర్‌ పలకల మధ్య పొటెన్షియల్‌ వ్యత్యాసం ఉండదు.

3) కెపాసిటర్‌ ద్వారా విద్యుత్‌ ప్రసరిస్తుంది. 

4) ఏదీకాదు

 

7. కెపాసిటర్‌ కెపాసిటెన్స్‌ c = Q/V దేనిపై  ఆధారపడుతుంది?

1)  విద్యుదావేశం (Q) 

2) పొటెన్షియల్‌ (V)

3) పలకల మధ్య ఉండే యానకం  

4) పైవన్నీ


8. ఫ్లెమింగ్‌ కుడిచేతి నియమం ఆధారంగా దేని దిశను తెలుసుకోవచ్చు?

1) AC కరెంట్‌       2) DC కరెంట్‌     3) ప్రేరిత విద్యుత్‌      4) ఉష్ణ విద్యుత్‌

 

9. గృహాలకు సరఫరా అయ్యే విద్యుత్‌ వినియోగ యూనిట్‌?

1) వోల్ట్‌          2) వాట్‌        3) కిలోవాట్‌ అవర్‌         4) ఆంపియర్‌


10. పొడిగా ఉండే మానవ శరీరం విద్యుత్‌ నిరోధం సుమారుగా....?

1) 10        2) 102    3) 103       4) 104  


11. నీటిని తోడే విద్యుత్‌ పంపులో జరిగే శక్తి పరివర్తన?

1) విద్యుత్‌ శక్తి గతిజ శక్తి   

2)  విద్యుత్‌ శక్తి స్థితిజ శక్తి

3) గతిజ శక్తి విద్యుత్‌ శక్తి  

4)  స్థితిజ శక్తి విద్యుత్‌ శక్తి 

 

12. అనంతమైన విద్యుత్‌ నిరోధాన్ని కలిగి ఉండే పదార్థాలు?

1) అర్ధ వాహకాలు       2) బంధకాలు    3) అతివాహకాలు       4) ఏదీకాదు

 

13. విద్యుత్‌ ప్రవాహంలో పాల్గొనేవి ఏవి?

1)  ఎలక్ట్రాన్లు     2) రంధ్రాలు (holes)  3) అయాన్లు     4) పైవన్నీ


14. విద్యుత్‌ ప్రవాహం (i) , వోల్టేజి(v) ల లబ్ధం దేన్ని సూచిస్తుంది?

1) విద్యుత్‌ నిరోధం   

2) విద్యుత్‌ తీగ కోల్పోయే ఉష్ణ రేటు

3) విద్యుత్‌ తీగ కోల్పోయే ఉష్ణం  

4) ఏదీకాదు


15. విద్యుత్‌ ప్రవహించే తీగ సమీపంలో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని కనుక్కున్న శాస్త్రవేత్త?

1)  ఫారడే     2)  అయిర్‌స్టెడ్‌     3) ఆంపియర్‌    4)  హెన్రీ


16. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దేన్ని మారుస్తుంది?

1) AC విద్యుత్‌ ప్రవాహం (i) విలువను

2) AC విద్యుత్‌ వోల్టేజి ్బ్ర్శ విలువను

3) AC విద్యుత్‌ పౌనఃపున్యాన్ని

4) 1, 2


17. ఇంట్లో ఉపయోగించే ఫ్యూజ్‌ తీగ ఏ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది?

1)  విద్యుత్‌ వల్ల కలిగే అయస్కాంత ప్రభావం

2) విద్యుత్‌ వల్ల కలిగే ఉష్ణ ప్రభావం

3)  విద్యుత్‌ వల్ల కలిగే రసాయన ప్రభావం

4) విద్యుత్‌ వల్ల కలిగే యాంత్రిక ప్రభావం


18. 20 నిరోధంతో ఉన్న తీగను వృత్తాకారంగా వంచారు. దాని వ్యాసం చివరల మధ్య ఉండే విద్యుత్‌ నిరోధం ఎంత?

1)  5     2)  10   3)  20     4) 40  

 

19. స్టెప్‌ అప్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నిర్వర్తించే పని?

1) విద్యుత్‌ శక్తిని పెంచుతుంది.   

2)  విద్యుత్‌ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

3) వోల్టేజిని తగ్గిస్తుంది   

4)  విద్యుత్‌ ప్రవాహాన్ని తగ్గిస్తుంది.

 

20. బియో - సవార్(Biot - Savart) నియమం ప్రకారం విద్యుత్‌ తీగ వల్ల ఏర్పడే అయస్కాంత ప్రేరణ ్బత్శీ... 

1) విద్యుత్‌ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది.

2)  తీగ వ్యాసార్ధ వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది.

3)  పరిసరాల ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉంటుంది.

4)  తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది.

 

21. కింది ప్రవచనాల్లో సరైంది ఏది?

A) శ్రేణి సంధానంలో విద్యుత్‌ బల్బులను కలిపితే, తక్కువ నిరోధం ఉన్న బల్బు ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతుంది.

B) సమాంతర సంధానంలో విద్యుత్‌ బల్బులను కలిపితే ఎక్కువ నిరోధం ఉన్న బల్బు ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతుంది.

C)  శ్రేణి సంధానంలో విద్యుత్‌ బల్బులను కలిపితే ఎక్కువ నిరోధం ఉన్న బల్బు ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతుంది.

D)  సమాంతర సంధానంలో, నిరోధం విలువతో సంబంధం లేకుండా అన్నీ సమానంగా ప్రకాశిస్తాయి.

1) C    2) A    3) B, D   4) A, D

 

22. ఒక తీగలో విద్యుత్‌ ప్రసారంలో పాల్గొనే ఎలక్ట్రాన్‌ డ్రిఫ్ట్‌ వేగం పరిమాణం (సుమారుగా)...

1) 104 m/s     2) 10−4 m/s   3) 105 m/s    4) 106 m/s

 

23. రెండు సమాంతర విద్యుత్‌ తీగల్లో ఒకే దిశలో DC విద్యుత్‌ ప్రవహిస్తే, అవి రెండూ పరస్పరం....

1) ఆకర్షించుకుంటాయి   

2)  వికర్షించుకుంటాయి

3) ఆకర్షించుకోవు, వికర్షించుకోవు   

4)  ఏదీకాదు


24. లెంజ్‌ నియమం దేనికి ప్రతిరూపం?

1)  ఆవేశ నిత్యత్వ నియమం     

2)  శక్తి నిత్యత్వ నియమం

3)  ద్రవ్యవేగ నిత్యత్వ నియమం   

4) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం 


25. ప్రేరకత్వానికి ప్రమాణం ఏది?

1)  ఫారడే      2)  హెన్రీ      3)  సీమెన్స్‌    4)  ఓమ్‌


26. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?

1) స్వయం ప్రేరణ 

2) స్థిర విద్యుత్‌ ప్రేరణ

3) అయస్కాంత ప్రేరణ 

4) అన్యోన్య ప్రేరణ

 

27. విద్యుత్‌ జనరేటర్‌ ఏ సూత్రం ఆధారంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది?

1) రసాయన శక్తి విద్యుత్‌ శక్తిగా మారడం

2) స్థిర విద్యుత్‌ ప్రేరణ   

3) విద్యుదయస్కాంత ప్రేరణ

4) అన్యోన్య ప్రేరణ

 

28. మైస్నర్‌ ప్రభావంతో ముడిపడినవి ఏవి?

1)  అతివాహకాలు     2)  అర్ధవాహకాలు    3)  బంధకాలు    4)  పైవన్నీ


29. ఎడ్డీ విద్యుత్‌ ప్రవాహాల ్బ(Eddy Currents) అనువర్తనం.....

1) రైలుకు బ్రేకులు వేయడానికి

2)  తిరిగే వృత్తాకార లోహ పలకను కలిగిన విద్యుత్‌ మీటర్లలో

3)  ఇండక్షన్‌ స్టవ్‌లో        4) పైవన్నీ


30. ఒకే పదార్థంతో తయారైన రెండు తీగల పొడవులు సమానం. వాటి వ్యాసార్ధాల నిష్పత్తి 1 : 2 అయితే వాటి విశిష్ట నిరోధాల నిష్పత్తి ఎంత?

1) 1 : 2     2)  2 : 1    3)  1 : 1     4) 4 : 1


31. చలించే విద్యుదావేశం దేన్ని ఉత్పత్తి చేస్తుంది?

1)  విద్యుత్‌ క్షేత్రం                        2)  విద్యుత్‌ క్షేత్రం, అయస్కాంత క్షేత్రం

3)  కేవలం అయస్కాంత క్షేత్రం       4) ఏదీకాదు


32. శీతాకాలంలో ఉదయం కారు త్వరగా స్టార్ట్‌ కాకపోవడానికి కారణం?

A)  బ్యాటరీ అంతర్నిరోధం తగ్గడం

B). బ్యాటరీ అంతర్నిరోధం పెరగడం

C). బ్యాటరీ విద్యుచ్ఛాలక బలం తగ్గడం

D). బ్యాటరీ విద్యుచ్ఛాలక బలం పెరగడం

1) A, D     2) B, C     3) D     4) A

 

33. భారతదేశంలో గృహాలకు సరఫరా అయ్యే విద్యుత్‌ వోల్టేజ్, పౌనఃపున్యాలు వరుసగా-

1) 110v, 100Hz    2)  220v , 100Hz   3) 220 v, 50 Hz      4) 110v, 50Hz


34. వోల్టేజి (v), కరెంట్‌(i) ల లబ్ధం దేన్ని సూచిస్తుంది?

1) విద్యుత్‌ శక్తి     2) విద్యుత్‌ సామర్థ్యం    3) విద్యుత్‌ కెపాసిటెన్స్‌    4)  ప్రేరకత్వం


35. వెండి, బంగారు పతకాల తయారీలో ఏ పద్ధతి ద్వారా చవకైన లోహాలపై వెండి లేదా బంగారు పూత పూస్తారు?

1) విద్యుత్‌ రసాయన విశ్లేషణ    

2)  రసాయన విశ్లేషణ

3) విద్యుత్‌ విశ్లేషణ   

 4) పైవన్నీ

 

36. కింది వాటిలో విద్యుత్‌ బంధకం ఏది?

1)  వజ్రం       2)  పాదరసం      3)  ఇనుము       4)  క్రోమియం


37. విద్యుత్‌ నిరోధం ద్వారా విద్యుత్‌ ప్రసారం జరిగితే వెలువడే ఉష్ణం దేని వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది?

1)  విద్యుత్‌ ప్రవాహం                                      2) విద్యుత్‌ నిరోధం     

3) నిరోధం చివరల ఉండే పొటెన్షియల్‌ తేడా          4) విద్యుత్‌ ప్రసరించిన కాలం

 

38. ఘటం విద్యుచ్ఛాలక బలాన్ని కొలిచేందుకు ఉపయోగించే పరికరం?

1)  వోల్ట్‌ మీటర్‌         2) వోల్టా మీటర్‌   

3)  గాల్వనా మీటర్‌    4) పొటెన్షియో మీటర్‌


39. కిర్కాఫ్‌ మొదటి నియమం ∑i = 0, ఏ నిత్యత్వ నియమాన్ని సూచిస్తుంది?

1)  శక్తి      2)  విద్యుదావేశం    3)  ద్రవ్యవేగం      4)  ద్రవ్యరాశి

 

40. విద్యుత్‌ ఘటాలను (cells) శ్రేణిలో  కలిపితే...

1)  విద్యత్‌ ప్రవాహం పెరుగుతుంది

2)  విద్యుత్‌ ప్రవాహం తగ్గుతుంది

3)  EMF పెరుగుతుంది

4)  EMF  తగ్గుతుంది

 

41. A: విద్యుత్‌ బల్బులో ఫిలమెంట్‌ తీగను స్ప్రింగ్‌లా చుట్టి ఉంచుతారు.

R: విద్యుత్‌ నిరోధం తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది.

1) A సరైంది. R, A కి సరైన వివరణ కాదు 

2) A సరైంది. R, A కి సరైన వివరణ

3) A  తప్పు, కానీ R సరైంది

4)  A, R  రెండూ సరైనవి కావు


42. కెపాసిటర్‌..

1)  విద్యుదావేశం, శక్తిని నిల్వ చేస్తుంది

2)  DC విద్యుత్‌ను నిలిపేస్తుంది

3)  AC విద్యుత్‌ను ప్రసారం చేస్తుంది.

4)  పైవన్నీ 

 


సమాధానాలు

1) 4   2)2  3) 4    4) 2   5) 3   6) 1   7) 3   8) 3   9) 3   10) 4   11)1   12) 2   13) 4   14) 2   15) 2   16) 4   17) 2   18) 2   19) 4   20) 1   21) 1   22) 2   23) 1   24) 2   25) 2     26)4   27)3   28)1   29)4   30)3   31)2   32)2   33)3   34)2   35)1   36)1   37)1   38)4   39)2   40)3   41)1    42)4

Posted Date : 21-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌