• facebook
  • whatsapp
  • telegram

విటమిన్లు

1. కిందివాటిలో భిన్నంగా ఉన్న విటమిన్ ఏది?
     ఎ) విటమిన్-ఎ      బి) విటమిన్-డి      సి) విటమిన్-సి      డి) విటమిన్-ఇ

జ: (ఎ)

 

2. విటమిన్-ఎ లోపం వల్ల కలిగే కంటి వ్యాధులేవి?
     ఎ) రేచీకటి      బి) గ్జీరాఫ్తాల్మియా      సి) కార్నియా మెత్తబడటం      డి) పైవన్నీ

జ: (డి)

 

3. కంటి రెటీనాలో ఉండే ఏ వర్ణకం ఏర్పడటానికి విటమిన్-ఎ అవసరం?
     ఎ) రొడాప్సిన్      బి) మెలనిన్      సి) యూరోక్రోమ్      డి) మెలటోనిన్
జ: (ఎ)

 

4. కంటిలోని ఏ గ్రంథి పనితీరుకు విటమిన్-ఎ అవసరం?
     ఎ) థైమస్      బి) లాక్రిమల్      సి) మ్యూకస్      డి) ప్రోస్టేట్

జ: (బి)

 

5. యాంటిన్యూరిటిక్ విటమిన్ అని దేన్ని అంటారు?
     ఎ) విటమిన్-బి1      బి) విటమిన్-బి2      సి) విటమిన్-బి3      డి) విటమిన్-బి4

జ: (ఎ)

 

6. విటమిన్-బి2 లోపం వల్ల కలిగే వ్యాధులేవి?
     ఎ) కీలోసిస్      బి) గ్లాసైటిస్      సి) సెబోరిక్ డెర్మటైటిస్      డి) పైవన్నీ

జ: (డి)

 

7. పెల్లగ్రా అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల ఏర్పడుతుంది?
     ఎ) విటమిన్-ఎ      బి) విటమిన్-బి3      సి) విటమిన్-సి      డి) విటమిన్-బి6

జ: (బి)

 

8. కిందివాటిలో నియాసిన్ విటమిన్ లోపంతో సంబంధం లేని వ్యాధి?
     ఎ) డయేరియా      బి) డెర్మటైటిస్      సి) డిమెన్షియా      డి) డెంగీ

జ: (డి)

 

9. పచ్చికోడిగుడ్డులో ఉన్న పదార్థం బారి నుంచి కాపాడే విటమిన్ ఏది?
     ఎ) బయోటిన్ (బి7)         బి) పైరిడాక్సిన్ (బి6)      

    సి) థయామిన్ (బి1)            డి) నియాసిన్ (బి3)

జ: (ఎ)

 

10. గర్భిణులకు తగినంత ఫోలిక్ ఆమ్లం అందకపోతే పుట్టబోయే శిశువుల్లో ఏ నాడీసంబంధ వ్యాధి వస్తుంది?
     ఎ) మాక్రోసైటిక్ అనీమియా      బి) మెగాలో బ్లాస్టిక్ అనీమియా
      సి) స్పైనా బిఫిడా                          డి) పెర్నీషియస్ అనీమియా

జ: (సి)

 

11. ఏ విటమిన్‌ను ఎనిమల్ ప్రొటీన్ ఫ్యాక్టర్ అంటారు?
     ఎ) బి1      బి) బి12      సి) బి3      డి) బి9

జ: (బి)

 

12. నిక్టలోపియా అని ఏ వ్యాధిని అంటారు?
     ఎ) కీలోసిస్      బి) గ్లాసైటిస్      సి) రేచీకటి      డి) రక్తహీనత

జ: (సి)

 

13. విటమిన్-సి కిందివాటిలో దేనికి అవసరం?
ఎ) చిన్నపేగులో నుంచి ఇనుము శోషణకు
బి) రక్తంలో కాల్షియం నియంత్రణకు
సి) పెద్దపేగులో నుంచి నీటి శోషణకు
డి) చిన్నపేగులో నుంచి విటమిన్-డి శోషణకు

జ: (ఎ)

 

14. మన చర్మం అతి తక్కువ తీక్షణత ఉన్న సూర్యరశ్మికి గురైనప్పుడు శరీరంలో తయారయ్యే విటమిన్ ఏది?
ఎ) విటమిన్-సి    బి) విటమిన్-డి    సి) విటమిన్-ఎ    డి) విటమిన్-ఇ

జ: (బి)

 

15. విటమిన్-సి కింది ఏ పండ్లలో అత్యధికంగా ఉంటుంది?
ఎ) నారింజ     బి) ఉసిరి     సి) రోజ్‌హిప్     డి) బొప్పాయి

జ: (సి)

 

16. మన శరీరంలోని ఏభాగంలో చివరకు చైతన్యవంతమైన విటమిన్-డి తయారవుతుంది?
ఎ) గుండె     బి) మెదడు    సి) ఊపిరితిత్తులు     డి) మూత్రపిండాలు

జ: (డి)

 

17. విటమిన్-డి లోపిస్తే వచ్చే వ్యాధి ఏది?
ఎ) చిన్నపిల్లల్లో రికెట్స్       బి) పెద్దవారిలో ఆస్టియోమలాసియా

సి) వృద్ధుల్లో ఆస్టియోపోరోసిస్       డి) పైవన్నీ

జ: (డి)

 

18. కింది ఏ విటమిన్ శక్తిమంతమైన ఆక్సీకరణిగా పనిచేసి వృద్ధాప్య లక్షణాలను తొందరగా రాకుండా కాపాడుతుంది?
ఎ) విటమిన్-ఇ     బి) విటమిన్-సి     సి) విటమిన్-డి      డి) విటమిన్-ఎ

జ: (ఎ)

Posted Date : 25-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌