• facebook
  • whatsapp
  • telegram

జలావరణం - సముద్రాలు

1. ఒక ఏడాదికి ఆవిరి రూపంలో వాతావరణంలోకి చేరే సముద్ర జలం ఎన్ని ఘనపు కిలోమీటర్లు ఉంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు?
జ: 3,30,000 ఘ.కి.మీ.

 

2. ప్రపంచంలోనే అత్యంత తక్కువ లవణీయత ఉన్న సముద్రం ఏది?
జ: బాల్టిక్

 

3. మహాసముద్రాల సరాసరి లోతు ఎన్ని మీటర్లు?
జ: 3650 మీ.

 

4. 'సునామీలు' ప్రధానంగా వేటివల్ల ఏర్పడతాయి?
జ: భూకంపాలు

 

5. ప్రపంచంలో అత్యధిక వేలా పరిమితి ఎక్కడ నమోదైంది?
జ: ఫండి అఖాతం, తూర్పు కెనడా

 

6. కింది ఏ సముద్రంలో అత్యధిక లవణీయత ఉన్నట్లు గుర్తించారు?
     1) నల్ల సముద్రం 2) పసుపు సముద్రం 3) మృత సముద్రం 4) ఏదీకాదు
జ: 3 (మృత సముద్రం)

 

7. పర్వవేలా తరంగాలు సంభవించే రోజు ఏది?
జ: పౌర్ణమి - అమావాస్య

 

8. సముద్రాల లవణీయత విస్తరణను పటంలో చూపడానికి ఏ రేఖలను ఉపయోగిస్తారు?
జ: ఐసోహలెన్స్

 

9. సముద్ర భూతలాన్ని పటంలో చూపించడానికి ఉపయోగించే రేఖలు ఏవి?
జ: ఐసోబాత్

 

10. సముద్ర ప్రవాహాలు ఏర్పడటానికి కారణం?
      1) భూభ్రమణం 2) సముద్ర భూతలం ఆకృతి 3) సముద్ర తీరాల్లోని భూభాగాల ఆకృతి  4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

11. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకేవరుసలోకి వచ్చినప్పుడు, వాటి గురుత్వాకర్షణ బలం వల్ల ఏర్పడే తరంగం ఏది?
జ: పర్వవేలా తరంగం

 

12. పసిఫిక్ మహాసముద్రంలో ప్రవహించే ఉష్ణ ప్రవాహం ఏది?
జ: క్యోరోషివో

 

13. ఉత్తర సముద్రంలో అతి ముఖ్యమైన మత్స్యగ్రహణ కేంద్రం ఏది?
జ: డాగర్ బ్యాంక్

 

14. సముద్రాల లోతుల్లో నివసించే చేపలు ఏవి?
జ: డెమర్‌సెల్

 

15. సముద్ర గర్భంలో ఉన్న పర్వతాలను ఏమంటారు?
జ: సముద్ర రిట్జ్‌లు

Posted Date : 25-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌