1. డల్హౌసీ ప్రవేశ పెట్టిన విధానం ఏది?
జ: రాజ్యసంక్రమణ విధానం
2. 1856లో సామాన్య సేవా నియుక్త చట్టం చేసింది ఎవరు?
జ: కానింగ్
3. ఝాన్సీ లక్ష్మీబాయిని ఓడించిన ఆంగ్లేయ సేనాని ఎవరు?
జ: సర్ హ్యురోజ్
4. మొదటి భారత రాజ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టింది ఎవరు?
జ: ఛార్లెస్ ఉడ్
5. నానాసాహెబ్ అసలు పేరేంటి?
జ: దోండుపంత్
6. భారతదేశంలో మొదటి వైస్రాయిగా నియమితుడైన వ్యక్తి?
జ: కానింగ్
7. 1857 తిరుగుబాటుకు కారణం/ కారణాలు...?
1) రాజ్య సంక్రమణ సిద్ధాంతం 2) ఆంగ్లేయుల భూమి శిస్తు విధానం
3) ఆంగ్లేయుల ఆర్థిక విధానాలు 4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)
8. క్రైస్తవ మిషనరీలను భారతదేశంలోకి ఎప్పుడు అనుమతించారు?
జ:1813
9. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏది?
జ: ఎన్ఫీల్డ్ తుపాకులు
10. 1857 తిరుగుబాటు సమయంలో తిరుగుబాటు చేసిన మొదటి వ్యక్తి?
జ: మంగళ్‌పాండే
11. 1857 తిరుగుబాటు ఎక్కడ మొదలైంది?
జ: మీరట్
12. 1857 తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1857 మే 10
13. 1858లో భారతదేశ పరిపాలనను స్వీకరించిన బ్రిటిష్ రాణి?
జ: మొదటి విక్టోరియా
14. రెండో బహదూర్ షా ఎప్పుడు మరణించాడు?
జ: 1862
15. 1856లో వితంతు పునర్వివాహ చట్టం తీసుకు వచ్చింది ఎవరు?
జ: లార్డ్ డల్హౌసీ
16. 1857 తిరుగుబాటు ప్రధాన ఫలితం ఏది?
1) ఈస్టిండియా కంపెనీ పాలన రద్దు 2) బ్రిటిష్ ప్రభుత్వం భారతపాలన చేపట్టింది
3) భారతీయులపట్ల బ్రిటిష్ విధానాలు, దృక్పథాలు మారాయి 4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)