• facebook
  • whatsapp
  • telegram

కార్బోహైడ్రేట్‌లు

1. మానవ దేహానికి ప్రాథమిక శక్తి జనకాలుగా పనిచేసే పదార్థాలు ఏవి?
ఎ) విటమిన్‌లు    బి) ఖనిజ లవణాలు    సి) కార్బోహైడ్రేట్‌లు     డి) ప్రొటీన్‌లు

జ: సి

 

2. ఒకే చక్కెర అణువు ఉండే మోనోశాఖరైడ్‌లకు ఉదాహరణ?
ఎ) గ్లూకోజ్    బి) మానోజ్    సి) గాలక్టోజ్     డి) పైవన్నీ

జ: డి

 

3. కిందివాటిలో 5 కర్బన పరమాణువులు ఉన్న రైబోజ్ చక్కెర దేనిలో ఉంటుంది?
ఎ) పాలు    బి) కేంద్రకామ్లాలు    సి) తేనె    డి) పండ్లు

జ: బి

 

4. క్రీడాకారులు తక్షణ శక్తి కోసం ఏ చక్కెరను తీసుకుంటారు?
ఎ) రైబోజ్     బి) ఫ్రక్టోజ్     సి) గ్లూకోజ్     డి) గాలక్టోజ్

జ: సి

 

5. కిందివాటిలో ఫ్రక్టోజ్ చక్కెరకు సంబంధించి సరైంది ఏది?
ఎ) ఇది అత్యంత తియ్యనైన చక్కెర
బి) దీనిలో 3 కర్బన పరమాణువులుంటాయి
సి) ఇది రక్తంలో ఉంటుంది       డి) ఈ చక్కెర పాలిశాఖరైడ్

జ: ఎ

 

6. ఆరు కర్బన పరమాణువులు ఉండే చక్కెరలకు ఉదాహరణ ఏది?
ఎ) గ్లూకోజ్       బి) ఫ్రక్టోజ్       సి) మానోజ్     డి) పైవన్నీ

జ: డి

 

7. సుక్రోజ్‌ను వాణిజ్యపరంగా దేని నుంచి సంగ్రహిస్తారు?
ఎ) పండ్లు     బి) పాలు     సి) చెరకు రసం      డి) తేనె

జవాబు: సి

 

8. డైశాఖరైడ్ అయిన మాల్టోజ్ చక్కెర కింది వేటి కలయిక ద్వారా ఏర్పడుతుంది?
ఎ) గ్లూకోజ్ + గ్లూకోజ్      బి) గ్లూకోజ్ + గాలక్టోజ్
సి) గ్లూకోజ్ + ఫ్రక్టోజ్       డి) గ్లూకోజ్ + లాక్టోజ్

జ: ఎ

 

9. మనం రోజు ఉపయోగించే పంచదారను రసాయనికంగా ఏమంటారు?
ఎ) మాల్టోజ్     బి) రాఫినోజ్      సి) సుక్రోజ్       డి) లాక్టోజ్

జ: సి

 

10. కిందివాటిలో రాఫినోజ్ చక్కెర వేటిలో ఎక్కువగా ఉంటుంది?
ఎ) పత్తిగింజల పిండి       బి) పాలు     సి) ధాన్యాలు       డి) చెరకు రసం

జవాబు: ఎ

 

11. ఒకే రకమైన చక్కెర అణువులు ఉండే హోమో పాలిశాఖరైడ్ కార్బోహైడ్రేట్‌లకు ఉదాహరణ?
ఎ) పిండిపదార్థం        బి) గ్త్లెకోజెన్       సి) సెల్యులోజ్        డి) పైవన్నీ

జ: డి

Posted Date : 24-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌