• facebook
  • whatsapp
  • telegram

వేములవాడ చాళుక్యులు

మాదిరి ప్రశ్నలు

 

1. వేములవాడను పూర్వం ఏమని పిలిచేవారు?

జ: లేంబులవాడ

 

2. వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని ఏది?
జ: బోధన్

 

3. ఏలేశ్వర విద్యాపీఠాన్ని ఎవరు నిర్వహించేవారు?
జ: ముగ్దశివాచార్యుడు

 

4. 'శ్యాద్వాదచల సింహ' అనే బిరుదు ఎవరిది?
జ: సోమదేవసూరి

 

5. 'జనాశ్రయ' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: మల్లియరేచన

 

6. కింది వాటిలో పంపకవికి రెండో అరికేసరి ఇచ్చిన అగ్రహారం ఏది?
ఎ) పెంచికల్లు బి) కురిక్క్యాల సి) ధర్మపురం డి) చెన్నూరు
జ: సి(ధర్మపురం)

 

7. వేములవాడ చాళుక్యుల కాలం నాటి అధికార భాష ఏది?
జ: కన్నడం

 

8. కింది ఏ శాసనాన్ని మూడు భాషల్లో వేయించారు?
ఎ) కురవగట్టు శాసనం బి) పర్భిణి తామ్ర శాసనం సి) కొల్లిపర తామ్ర శాసనం డి) కురిక్క్యాల శాసనం
జ: డి(కురిక్క్యాల శాసనం)

 

9. వేములవాడ చాళుక్యుల్లో చివరి రాజు ఎవరు?
జ: మూడో అరికేసరి

 

10. 'కవితాగుణార్ణవుడు' అనే బిరుదు ఎవరిది?
జ: పంపకవి

 

11. ఏ శాసనంలో మొదటి తెలుగు కంద పద్యాలున్నాయి?
జ: కురిక్క్యాల శాసనం

 

12. సోలదగండడు అనే బిరుదు ఎవరిది?
జ: ఒకటో బద్దెగడు

 

13. వేములవాడ చాళుక్యుల్లో గొప్ప పాలకుడు ఎవరు?
జ: రెండో అరికేసరి

 

14. 'విక్రమార్జున విజయం' అనే గ్రంథాన్ని రచించిందెవరు?
జ: పంపకవి

 

15. 'యశస్తిలక చంపు'ను రచించింది ఎవరు?
జ: సోమదేవసూరి

Posted Date : 07-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌