• facebook
  • whatsapp
  • telegram

కోడింగ్‌ - డీకోడింగ్‌

ప్రతిక్షే కోడింగ్‌


సూచనలు (ప్ర. 1 - 5): ఇచ్చిన సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


1. ఒక పరిభాషలో ఎరుపును గాలిగా, గాలిని నలుపుగా, నలుపును ఆకాశంగా, ఆకాశాన్ని నీలంగా, నీలాన్ని ధూళిగా, ధూళిని తెలుపుగా పేర్కొన్నారు. అయితే పక్షులు ఎక్కడ ఎగురుతాయి?


ఎ) గాలి    బి) ధూళి       సి) ఆకాశం     డి) నీలం


సాధన: ప్రశ్న ప్రకారం, ఆకాశం అంటే నీలం. కాబట్టి పక్షులు నీలంలో ఎగురుతాయి.


సమాధానం: డి


2. ఒక పరిభాషలో నీటిని రాయిగా, రాయిని నూనెగా, నూనెను గాలిగా, గాలిని చెక్కగా, చెక్కను వాయువుగా, వాయువును ద్రవంగా పిలుస్తారు. అయితే ఆక్సిజన్‌ ఒక...


ఎ) వాయువు    బి) ద్రవం    సి) రాయి    డి) చెక్క


సాధన: ప్రశ్న ప్రకారం, వాయువు (ఆక్సిజన్‌) అంటే ద్రవం.


సమాధానం: బి


3. ఒక పరిభాషలో పక్షిని రాజుగా, రాజును పువ్వుగా, పువ్వును ఘనంగా, ఘనాన్ని టేబుల్‌గా, టేబుల్‌ను మనిషిగా, మనిషిని పక్షిగా పేర్కొన్నారు. అయితే గులాబీని ఏమంటారు?


ఎ) పువ్వు    బి) పక్షి     సి) ఘనం       డి) టేబుల్‌


సాధన: ప్రశ్నలోని సమాచారం ప్రకారం, పువ్వు (గులాబీ) అంటే ఘనం.     

సమాధానం: సి


4. ఒక భాషలో కళ్లను చేతులు, చేతులను నోరు, నోటిని చెవులు, చెవులను ముక్కు, ముక్కును నాలుక అని భావించారు. అయితే మనిషి దేనితో వింటాడు?


ఎ) ముక్కు    బి)  చెవి     సి)  నాలుక     డి) నోరు


సాధన: ఇచ్చిన సమాచారం ఆధారంగా, చెవులు అంటే ముక్కు. కాబట్టి మనిషి ముక్కుతో వింటాడు.


సమాధానం:


5. ఒక కోడ్‌ పరిభాషలో లైట్‌ని మార్నింగ్, మార్నింగ్‌ని డార్క్, డార్క్‌ని నైట్, నైట్‌ని సన్‌షైన్, సన్‌షైన్‌ని డస్క్‌ అని పేర్కొంటే, మనం ఎప్పుడు నిద్రిస్తాం?


ఎ) నైట్‌      బి)  డార్క్‌     సి)  సన్‌షైన్‌         డి)  డస్క్‌


సాధన: సాధారణంగా మనుషులు రాత్రి (నైట్‌) వేళ నిద్రిస్తారు. అయితే ప్రశ్నలో నైట్‌ను సన్‌షైన్‌గా పేర్కొన్నారు. 


సమాధానం: సి


6. ఒక పరిభాషలో రాగిని బంగారం, బంగారాన్ని తగరం, తగరాన్ని వెండి, వెండిని స్టీలు, స్టీలును చెక్క, చెక్కను నీరుగా పిలిచారు. అయితే వెండిని ఏమంటారు?


ఎ) స్టీలు      బి)  చెక్క    సి) నీరు      డి) తగరం


సాధన: ప్రశ్నలో వెండిని స్టీలుగా పేర్కొన్నారు.


సమాధానం:


7. ఒక పరిభాషలో ధూళిని గాలి, గాలిని అగ్ని, అగ్నిని నీరు, నీటిని రంగు, రంగును వర్షం, వర్షాన్ని ధూళిగా పేర్కొంటే, చేపలు ఎక్కడ నివసిస్తాయి? 


ఎ) వర్షం     బి) నీరు     సి) రంగు     డి) ధూళి


సాధన: చేపలు నీటిలో ఉంటాయి. ఇచ్చిన పరిభాష ప్రకారం నీటిని రంగుగా కోడ్‌ చేశారు. దీని ప్రకారం, చేపలు రంగులో నివసిస్తాయి.


సమాధానం: సి


8. ఒక పరిభాషలో రాబందును దొంగ, దొంగను బోటు, బోటును పోలీసు, పోలీసును పుస్తకం, పుస్తకాన్ని తుపాకీ, తుపాకీని పెన్ను, పెన్నును లాఠీగా పిలిచారు. అయితే నదిలో ప్రయాణానికి కింది దేన్ని ఉపయోగిస్తారు?


ఎ)  తుపాకీ    బి) పుస్తకం    సి) పోలీస్‌    డి) బోటు


సాధన: ప్రశ్న ప్రకారం, బోటు అంటే పోలీస్‌. 


సమాధానం: సి


9. ఒక కోడ్‌ భాషలో 5 అంటే 10, 10 అంటే 15, 15 అంటే 20, 20 అంటే 25, 25 అంటే 29, 29 అంటే 31, 31 అంటే 38. అయితే శుద్ధవర్గ సంఖ్య ఏది?


ఎ) 25            బి) 29          సి)  31           డి) ఏదీకాదు


సాధన: ఇచ్చిన సంఖ్యలు 5, 10, 15, 20, 25, 29, 31, 38 లలో శుద్ధ వర్గ సంఖ్య 25. కానీ కోడ్‌ ప్రకారం 25 అంటే 29. 


సమాధానం: బి


సూచనలు (ప్ర. 10 - 16): ఇచ్చిన సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


10. ఒక పరిభాషలో 123 అంటే 'how are you', 432 అంటే 'how are they', 356 అంటే 'how is she' అని కోడ్‌ చేశారు. అయితే కిందివాటిలో  'how' కి కోడ్‌ ఏమిటి?


ఎ) 1           బి) 2             సి)  3             డి) 5


సాధన: 


పై వాటి నుంచి how కోడ్‌: 3.


సమాధానం: సి


11. 246  అంటే Manage your work; 803 అంటే They bring it; 631 అంటే They work quickly. అయితే 6ను సూచించే కోడ్‌ ఏది?


ఎ) work   బి) your       సి) they      డి) it


సాధన: 


  పైవాటి నుంచి 6 కోడ్‌  work.


సమాధానం:


12. ఒక కోడ్‌ భాషలో 'kew xas huma deko'  అంటే  'she is eating apples' అని అర్థం. 'kew tepo qua' అంటే  'she sells toys', 'sul lim deko' అంటే 'I like apples' అని అర్థం. అయితే  'she', 'apples' ను సూచించే కోడ్‌లు వరుసగా...

ఎ)  kew, deko     బి) kew, kas     సి) xas, deko          డి) ఏదీకాదు

సాధన: 


   

  kew- she, deko- apples ను సూచిస్తాయి.


సమాధానం:


13. 'ski rps tri' పదం 'nice sunday morning','the stri rps' అనేది 'every thursday morning', 'ski ptr qlm'  అనే పదం 'nice market place' ను సూచిస్తే sunday పదం కింది దేన్ని సూచిస్తుంది?


ఎ) tri           బి)  qlm            సి) rps           డి) ski


సాధన: 


 Sunday ను సూచించే పదం tri


సమాధానం:


14. ఒక కోడ్‌ భాషలో 123 అంటే'bright little boy, 143 అంటే 'tall big boy', 637 అంటే 'beautiful little flower'అని అర్థం. అయితే ఆ భాషలోbright ను సూచించే సంఖ్య ఏది?


ఎ) 1               బి) 2              సి) 3             డి) 4


సాధన: 


 

పై వాటి నుంచిbright ను సూచించే సంఖ్య: 2.


సమాధానం: బి


15. 'chin shan chou' అంటే 'Lavanya looks me'. 'chou min win' అంటే 'Gopal saw Lavanya yesterday'  'Rid sal min' అంటే 'Raman called Gopal' అయితే Gopal ను సూచించే కోడ్‌ ఏది?


ఎ) tin           బి)   chou           సి)  min          డి) win 


పై నుంచి, Goapl ను సూచించే కోడ్‌: min.


సమాధానం: సి


16. నీటిని ఆహారంగా, ఆహారాన్ని చెట్టుగా, చెట్టును ఆకాశంగా, ఆకాశాన్ని బావిగా, బావిని సరస్సుగా కోడ్‌ చేస్తే, పండ్లు వేటికి కాస్తాయి?


ఎ) చెట్టు      బి) ఆకాశం    సి)బావి         డి)సరస్సు


సాధన: చెట్టుకు కోడ్‌ ఆకాశం.


సమాధానం:  బి 


రచయిత

బూసర గణేష్, 

విషయ నిపుణులు 

Posted Date : 07-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌