• facebook
  • whatsapp
  • telegram

కమ్మీరేఖా చిత్రాలు

(డేటా ఇంటర్‌ప్రిటేషన్‌) 

ట్రెండ్‌ చెప్పే చిత్రాలు!
 


ఒక కంపెనీ పది రకాల వస్తువులను విక్రయిస్తుంది. సంవత్సర కాలంలో అన్నింటి గణాంకాలను పోల్చి చూసుకొని వాటి అమ్మకాల స్వరూపాన్ని వెంటనే తెలుసుకోవాలంటే కాస్త కష్టం. వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థులు సాధించిన మార్కుల తీరును గుర్తించేందుకు లెక్కలు వేస్తూ కూర్చుంటే చాలా సమయం వృథా అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో దత్తాంశ విశ్లేషణలోని కమ్మీ రేఖా చిత్రాలను ఉపయోగిస్తే నిర్దిష్ట కాలవ్యవధుల్లో డేటా మారుతున్న విధానాన్ని అవి స్పష్టంగా ప్రదర్శిస్తాయి. చూడగానే సంబంధిత నమూనాలు, ట్రెండ్‌ (ధోరణులు) సులభంగా అర్థమవుతాయి. వేర్వేరు వర్గాలు లేదా సమూహాల మధ్య సంబంధాలను వేగంగా గ్రహించగలిగే సామర్థ్యాన్ని అభ్యర్థుల్లో అంచనా వేయడానికి రీజనింగ్‌లో వీటిపై ప్రశ్నలు అడుగుతుంటారు. మౌలికాంశాలను, కొన్ని గణిత పరిక్రియలను నేర్చుకొని ప్రాక్టీస్‌ చేస్తే పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవచ్చు.


డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (దత్తాంశ విశ్లేషణ)లో భాగంగా వచ్చే కమ్మీరేఖా చిత్రాలు (బార్‌ డయాగ్రమ్స్‌) దీర్ఘచతురస్రాల రూపంలో ఉంటాయి. ఆ దీర్ఘచతురస్రంలో వెడల్పు తరగతి అంతరాన్ని, పొడవు పౌనఃపున్యాన్ని సూచిస్తాయి. ప్రశ్నలో ఇచ్చిన కమ్మీరేఖా చిత్రాల పొడవు, వెడల్పులను ఆధారంగా చేసుకుని డేటాను గ్రహించి ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలి. 


I. కింది పటంలో ఒక పట్టణ జనాభా 1951 నుంచి 2001 వరకు (ప్రతి పదేళ్లకు) ఇచ్చారు. సమాచారం ఆధారంగా ప్రశ్నలకు సమాధానం రాయండి. (జనాభా వేలల్లో ఇచ్చారు) 

1.  1971 నుంచి 1981 వరకు జనాభాలో పెరుగుదల శాతం ఎంత? 

1) 45%     2) 40%    3) 35%   4) 30% 

వివరణ: 1971లో జనాభా = 25,000

1981లో జనాభా = 35,000

పెరుగుదల = 35,000  25,000 

 = 10,000

= 40%    

జ: 2


2. 1961, 2001 సంవత్సరాల్లోని జనాభాలకు మధ్య నిష్పత్తి ఎంత? 

1) 3 : 1    2) 2 : 3     3) 1 : 2    4) 1 : 3

వివరణ: 1961లో జనాభా = 20,000 

2001లో జనాభా = 60,000 

నిష్పత్తి = 20,000 : 60,000 = 1 : 3      

జ: 4 


3. 1971వ ఏడాది జనాభా 1991వ సంవత్సరం జనాభాలో ఎంత శాతం? 

1) 55.55%     2) 44.55%    

3) 66.32%   4) 55.44% 

వివరణ: 1971వ సంవత్సర జనాభా = 25,000

1991వ జనాభా = 45,000 

జ: 1


II పలు పాఠశాలల నుంచి స్కాలర్‌షిప్‌ టెస్ట్‌కు హాజరైనవారిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలు కింది పటంలో ఇచ్చారు. సమాచారం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. 


4.  పాఠశాల C నుంచి టెస్ట్‌కి హాజరై, ఉత్తీర్ణులైన విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎంత? 

1) 9 : 13    2) 7 : 12   3) 13 : 9      4) 4 : 5 

వివరణ: పాఠశాల C నుంచి హాజరైన విద్యార్థులు = 3,250 

పాఠశాల C నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులు = 2,250 

నిష్పత్తి = 3,250 : 2,250 = 13 : 9      

 జ: 3 


5.  అన్ని పాఠశాలల్లో కలిపి హాజరైన సగటు విద్యార్థులకు, ఉత్తీర్ణులైన సగటు విద్యార్థులకు మధ్య భేదం ఎంత? 

1) 185     2) 950     3) 560    4) 980 

జ: 2 


6.  పాఠశాల D నుంచి హాజరైన విద్యార్థులు, అన్ని పాఠశాలల్లో హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్యలో ఎంత శాతం?  

1) 18%    2) 16%    3) 15%    4) 20%  

వివరణ: పాఠశాల D నుంచి హాజరైన విద్యార్థులు = 2,500 

మొత్తం హాజరైన విద్యార్థులు = 3,000  + 2,250 + 3,250 + 2,500 + 3,000 

= 14,000

జ: 1


III. కింది వృత్త రేఖాచిత్రంలో A,B,C,D,E, అనే పాఠశాలల్లోని మొత్తం 6000 మంది విద్యార్థుల సంఖ్యను శాతాల్లో ఇచ్చారు. కమ్మీ రేఖాచిత్రం ప్రతి పాఠశాలలోని బాలుర సంఖ్యను తెలియజేస్తుంది.




7. పాఠశాల C లోని బాలురు, పాఠశాల B లోని బాలికలు, పాఠశాల E లోని మొత్తం విద్యార్థుల సంఖ్యకు మధ్య నిష్పత్తి ఎంత?

1) 87 : 7 : 45   2) 45 : 87 : 7

3) 7 : 45 : 87   4) 45 : 7 : 87

వివరణ: పలు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య:

జ: 4


 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి 
 

Posted Date : 05-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌