• facebook
  • whatsapp
  • telegram

పాచికలు (డైస్)

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, ఏపీపీఎస్‌సీ నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షల్లో ఈ పాచికలకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థులకు కొద్దిగా తార్కిక ఆలోచన, సునిశిత దృష్టి ఉంటే, ఈ ప్రశ్నలకు జవాబులు తేలిగ్గా గుర్తించవచ్చు. 

  ఈ విభాగాల నుంచి ప్రశ్నలు ఆరు ముఖాలున్న ఒక చతురస్రాకార ఘనంపై సంఖ్యలు లేదా చుక్కలు లేదా ఇంగ్లిష్ అక్షరాలు ఇస్తారు. ఇలా 1 నుంచి 5 ఘనాల వరకు ఇచ్చి ఫలానా అంకెకు ఎదురుగా ఉన్న  అంకె లేదా చుక్కల సంఖ్య లేదా అక్షరాన్ని గుర్తించాలని అడుగుతారు.ఇప్పుడు కొన్ని నమూనాలను చూద్దాం.
* పటంలో చూపిన పాచికపై 6 ముఖాలపై A, B, C, D, E, F అనే అక్షరాలు ఉన్నాయి.
ఈ పాచికను రెండుసార్లు కుడివైపు తిప్పితే కనిపించే, కనిపించని అక్షరాలు ఏవి ?
సాధన: ఈ సమస్యలో A కి ఎదురుగా E , B కి ఎదురుగా D ఉన్నాయి. కాబట్టి, తప్పనిసరిగా C కి ఎదురుగా F వస్తుంది. ఈ పాచికను రెండుసార్లు కుడివైపు తిప్పితే పాచిక రూపం ఈ విధంగా మారుతుంది.
  కాబట్టి,  కనిపించే అక్షరాలు: B, E, F;  కనిపించని అక్షరాలు: A, C, D


 * ఒక పాచిక రెండు స్థితులను కింద చూడవచ్చు. అయితే పాచిక పైభాగంలో 1 అనే అంకె ఉంటే కిందిభాగంలో ఉండే అంకె ఏది?
సాధన: ఈ సమస్యలో పాచిక రెండు స్థితులను పరిశీలిస్తే 3కు ఆసన్న ముఖాలు (పక్క ముఖాలు) 2, 4, 5, 6. కాబట్టి, 3కు ఎదురుగా ఉండే అంకె 1. 1 కి కిందిభాగంలో ఉండే అంకె 3.

 

* ఒక పాచిక రెండు స్థితులను కింద గమనించవచ్చు. 5కు వ్యతిరేకంగా ఉండే అంకె ఏది ?సాధన: ఈ పాచిక కుడివైపు తిరగడంవల్ల 1 పైకి వచ్చింది. 4 స్థానంలో 1 వచ్చింది. కాబట్టి, 5 కు ఎదురుగా ఉన్న అంకె 1     

 

* ఉదా. 1: కిందివాటిలో 5కు ఎదురుగా ఉండే అంకె ఏది?
సాధన: ఈ సమస్యలో ఇచ్చిన పాచిక స్థితులను సునిశితంగా పరిశీలిస్తే 5కు పక్క ఉన్న ముఖాలు - 2, 3, 4, 6 మిగిలిన అంకె 1. కాబట్టి, 5 కు ఎదురుగా ఉండే సంఖ్య 1

 

ఉదా. 2: కిందివాటిలో 6 చుక్కలు ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంలో ఉన్న చుక్కల సంఖ్య ఎంత?
సాధన: ఈ సమస్య పై ఉదాహరణ మాదిరిగానే సాధించవచ్చు.
6 చుక్కలున్న ముఖానికి పక్కన ఉన్న ముఖాలపై చుక్కల అంకెలు  1, 2, 4, 5 కాబట్టి, 6కు ఎదురుగా ఉండే అంకె 3 

 

* కిందివాటిలో 3 కు ఎదురుగా ఉండే అంకె ఏది? సాధన: ఈ సమస్యలో పాచిక వివిధ స్థితులను సునిశితంగా పరిశీలిస్తే 3 కు పక్కగా ఉన్న ముఖాలు 1, 4, 5, 6. కాబట్టి, 3కు ఎదురుగా ఉండే అంకె 2.    

 

* కిందివాటిలో ఒకే పాచిక ఉన్న మూడు స్థితుల్లో అడుగుభాగాన వచ్చే అంకె ఏది?
సాధన: ఈ సమస్యలో మొదటి పాచిక కుడి పక్కకు ఒకసారి, ఎడమపక్కకు ఒకసారి తిప్పి ఇచ్చారు.
కాబట్టి, 3 కు పక్క ముఖాలపై ఉండే అంకెలు - 1, 4, 5, 6
  3కు కిందిభాగాన ఉండే అంకె 2 అవుతుంది

 

* కింద ఇచ్చిన చిత్రాన్ని ఒక ఘనంగా ఏర్పరిస్తే, ఏర్పడే ఘనాన్ని గుర్తించండి ?       

     
జవాబు: d.
సాధన: పై చిత్రాన్ని ఒక ఘనంగా ఏర్పరిస్తే 2కు ఎదురుగా 4,  1కు ఎదురుగా 6,  5కు ఎదురుగా 3 వస్తుంది.
(a) చిత్రంలో 1, 6లు పక్క భుజాలు
(b) చిత్రంలో 3, 5లు పక్క భుజాలు
(c) చిత్రంలో 2, 4లు పక్క భుజాలు
(d) చిత్రంలో 1, 3, 4లు పక్క భుజాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి, సమాధానం 'd' అవుతుంది.

Posted Date : 11-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌