1. సింధు నది ఉపనదులు ఏవి?
ఎ) గిల్గిత్, షోక్ బి) ద్రాస్, హుంజ సి) జీలం, సట్లెజ్ డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)
2. ఏ నది గతంలో గంగానదికి ఉపనదిగా ఉండి, తర్వాత బ్రహ్మపుత్రకు ఉపనదిగా మారింది?
జ: తీస్తా
3. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం దగ్గర వెలసిన పట్టణం ఏది?
జ: అలహాబాద్
4. యమునా నదికి అతి ముఖ్యమైన ఉపనది ఏది?
జ: టాన్స్
5. లాహోర్ పట్టణం ఏ నదీ పరివాహక ప్రాంతంలో ఉంది?
జ: రావి
6. భాక్రానంగల్ ప్రాజెక్ట్‌ను ఏ నదిపై నిర్మించారు?
జ: సట్లెజ్
7. కిందివాటిలో పగులు లోయలో ప్రవహించే నది?
ఎ) హుగ్లీ బి) సోన్ సి) కేన్ డి) దామోదర్
జ: డి (దామోదర్)
8. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌ను టెన్నిస్ వ్యాలీ అథారిటీ ఆధారంగా నిర్మించారు. ఈ నది ఏ దేశంలో ఉంది?
జ: అమెరికా
9. గాంధీ సాగర్ డ్యాం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: మధ్యప్రదేశ్
10. ఏ నదికి కర్ణాలి అనే మారు పేరుంది?
జ: ఘాగ్రా
11. గంగానది మొత్తం పొడవు ఎంత?
జ: 2525 కి.మీ.
12. 'బెంగాల్ దుఃఖదాయిని' అని ఏ నదికి పేరు?
జ: దామోదర్
13. అతిపెద్ద నదీ దీవి 'మజూలి' ఏ రాష్ట్రంలో ఉంది?
జ: అసోం
14. తెహ్రీ డ్యాం ఏ నదిపై ఉంది?
జ: భాగీరథి
15. అయోధ్య పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?
జ: సరయూ
16. బనాస్ నది ఏ నదికి ఉపనది?
జ: చంబల్
17. సప్తకౌషికి అని ఏ దేనికి పేరు?
జ: కోసి