• facebook
  • whatsapp
  • telegram

కాక‌తీయులు

మాదిరి ప్రశ్నలు

 

1. నీతిసారం గ్రంథకర్త ఎవరు?

ఎ) ప్రోలరాజు బి) గణపతిదేవుడు సి) ప్రతాపరుద్రుడు డి) రుద్రదేవుడు
జ: (డి)

 

2. కాకతీయుల్లో చివరి పాలకుడు ఎవరు?
ఎ) రుద్రమదేవి బి) గణపతిదేవుడు సి) ప్రతాపరుద్రుడు డి) ప్రోలరాజు
జ: (సి)

 

3. కాకతీయులను గురించి మొదటి ప్రస్తావన ఏ శాసనంలో ఉంది?
ఎ) హనుమకొండ శాసనం బి) మల్కాపురం శాసనం సి) బీదరు శాసనం డి) మాగల్లు శాసనం
జ: (డి)

 

4. దేవగిరి యాదవుల నాణేలు ఎక్కడ లభించాయి?
ఎ) రాచపట్నం బి) హనుమకొండ సి) సబ్బీమండలం డి) పిల్లలమర్రి
జ: (ఎ)

 

5. గణపతిదేవుడి శివదీక్షా గురువు ఎవరు?
ఎ) నైనాచార్యుడు బి) శ్రీపతి పండితుడు సి) విశ్వేశ్వర శంభూ డి) మల్లికార్జున పండితారాధ్యుడు
జ: (సి)

 

6. హనుమకొండలో కడలాలయ జైన బసదిని నిర్మించినదెవరు?
ఎ) కుందమాంబ బి) మైలమ సి) గణపాంబ డి) ముమ్మడమ్మ
జ: (బి)

 

7. శనిగరం శాసనాన్ని ఎవరు వేయించారు?
ఎ) నారణయ్య బి) గోనగన్నయ్య సి) రేచర్ల ప్రసాదాదిత్యుడు డి) రేచర్ల రుద్రుడు
జ: (ఎ)

 

8. గణపతిదేవుడు తన రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు ఎప్పుడు మార్చాడు?
ఎ) 1222 బి) 1236 సి) 1249 డి) 1254
జ: (డి)

 

9. జైనశైవ సంఘర్షణ ఏ కాకతీయ పాలకుడి కాలంలో ప్రారంభమైంది?
ఎ) రుద్రదేవుడు బి) గణపతిదేవుడు సి) రెండో ప్రోలరాజు డి) మొదటి బేతరాజు
జ: (ఎ)

 

10. దేశీయకొండ పట్టణం అంటే..?
ఎ) మచిలీపట్నం బి) పులికాట్ సి) హంసల దీవి డి) మోటుపల్లి
జ: (డి)

 

11. నాయంకర వ్యవస్థను ఎవరు ప్రవేశ పెట్టారు?
ఎ) ప్రతాపరుద్రుడు బి) దుర్గరాజు సి) రుద్రమదేవి డి) రెండో ప్రోలరాజు
జ: (సి)

 

12. ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపిన శాసనం ఏది?
ఎ) హనుమకొండ శాసనం బి) దేశటి శాసనం సి) దోశపాడు శాసనం డి) కలువచేరు శాసనం
జ: (డి)

 

13. కాకతీయుల కాలంలో ప్రభుత్వ శాఖలను ఏమని పిలిచేవారు?
ఎ) జనపదాలు బి) నియోగాలు సి) ఆహారాలు డి) విషయాలు
జ: (బి)

 

14. జయపత్రాలు అంటే ఏమిటి?
ఎ) న్యాయతీర్పులు బి) వృత్తిపన్ను సి) వర్తక సుంకం డి) యుద్ధంలో గెలిచినప్పుడు లభించే పత్రాలు
జ: (ఎ)

 

15. హనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని నిర్మించిన దెవరు?
ఎ) గణపతిదేవుడు బి) రుద్రదేవుడు సి) ప్రతాపరుద్రుడు డి) రుద్రమదేవి
జ: (బి)

Posted Date : 07-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌