1. ఆయుర్వేద పితామహుడు ఎవరు?
జ: చరకుడు
2. బేసానగర్ వద్ద వాసుదేవ దేవాలయంలో హీలియోడోరస్ ఎత్తించిన గరుఢద్వజం ఏ ఇండో-గ్రీకు రాజుకాలం నాటిది?
జ: ఆంటియోల్సిడస్
3. కిందివాటిలో ఏ బౌద్ధమత శాఖ 'బుద్ధుడి అవశేషాలను సన్యాసంతో పూజించడం వల్ల మోక్షం పొందవచ్చు, బుద్ధుడు మరోసారి జన్మించడు' అనే అభిప్రాయాలు కలిగి ఉంది?
ఎ) హీనయాన బి) మహాయాన సి) వజ్రయాన డి) సహజయాన
జ: ఎ (హీనయాన)
4. 'మాతృదేవత ఉమ' పేరుమీద నాణేలను ముద్రించింది?
జ: కుషాణులు
5. కనిష్కుడి కాలంలోని బౌద్ధగ్రంథాలను ఏ భాషలో రచించారు?
జ: సంస్కృతం
6. కనిష్కుడి శాసనాలు ఏ ప్రాంతాల్లో బయటపడ్డాయి?
ఎ) భాగల్‌పూర్ బి) రావల్పిండి సి) మథుర డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)
7. విమా కాడ్‌ఫిసెస్ నాణేలపై ఎవరి ప్రతిమ ఉంటుంది?
జ: నంది
8. కనిష్కుడి వ్యక్తిగత ఆరాధ్య దేవత ఎవరు?
ఎ) బుద్ధుడు బి) హీలియస్ సి) సెలీనా డి) బి, సి
జ: డి (హీలియస్, సెలీనా)
9. 'గాంధార శిల్పకళారీతి' ఏ ప్రాంతానికి చెందిన కళ?
జ: వాయవ్య భారతదేశం
10. రెండో తథాగతుడు ఎవరు?
జ: ఆచార్య నాగార్జునుడు
11. రెండో కనిష్కుడి బిరుదు ఏమిటి?
జ: కైజర్
12. కనిష్కుడి శిథిల విగ్రహం ఎక్కడ లభించింది?
జ: మథుర