• facebook
  • whatsapp
  • telegram

జీర్ణ వ్యవస్థ

1. కిందివాటిని జతపరచండి.

గ్రంథి/జీర్ణాశయ భాగం     స్రవించే ప్రదేశం

 i) లాలాజల గ్రంథులు      a) ఆంత్రమూలం

ii) కాలేయం                  b) అస్యకుహరం

iii) క్లోమం                     c) చిన్నపేగు

జ‌:  i-b, ii-a, iii-a           

 

2. కిందివాటిలో ఎన్‌జైమ్‌లు లేని జీర్ణరసం?

జ‌: పైత్య రసం   

 

 

3. పెప్సిన్‌ యొక్క చైతన్యరహిత రూపం?

జ‌: పెప్పినోజెన్‌    

 


4. కిందివాటిని జతపరచండి.

   ఎన్‌జైమ్‌                 స్రవించే భాగం

 i) టయాలిన్‌                a) చిన్నపేగు

 ii) పెప్సిన్‌                   b) క్లోమం

 iii) ట్రిప్సిన్‌                  c) జీర్ణాశయం

 iv) పెప్టిడేజ్‌                 d) లాలాజల గ్రంథులు

జ‌:  i-d, ii-c, iii-b, iv-a

 

 

5. ‘కైమ్‌’ ఏ స్థితిలో ఉంటుంది?

జ‌: ఆమ్ల స్థితి    

 


6. కింది పదార్థాలను జీర్ణక్రియ జరిగిన తరువాత ఏర్పడే ఉత్పన్నాలతో జతపరచండి.

       జాబితా ఎ                   జాబితా బి

 i) కార్బోహైడ్రేట్లు                 a) గ్లూకోజ్‌

ii) ప్రొటీన్లు                         b)కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్‌

iii) కొవ్వులు                      c) పెప్టోన్లు

iv) సుక్రేజ్‌                         d) మాల్టోజ్‌

జ‌: i-d, ii-c iii-b, iv-a     

 

 

7. కిందివాటిలో సరైన వాక్యాలేవి?

i) లాలాజలం PH విలువ 6.5 నుంచి 7 వరకు ఉంటుంది.

ii) గ్రసని ద్వారానే ఆహారవాహిక అనేది జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది.

iii) జీర్ణాశయం అనేది కండరయుతమైన సంచి. ఇది ఉదరవితానానికి దిగువన, ఉదరకుహరంలో ఎడమ పక్క ఉంటుంది.

జ‌: i, ii, iii

 


8. మానవుడిలో సంవరణీ కండరాలు వ్యాకోచించినప్పుడు ఏమవుతుంది?

జ‌: మలం పాయువు ద్వారా బయటకు వెళ్తుంది.

 

 

9. నాలుకపై ఉండే రుచి మొగ్గల భాగాలను అవి గ్రహించే రుచితో జతపరచండి.

 నాలుకపై ఉండే                                         గ్రహించే రుచి 

రుచిమొగ్గల భాగం             

 i) నాలుక మొదటి ముందర భాగం               a) చేదు

ii) నాలుక ముందరి తరువాతి భాగం             b)పులుపు

iii)నాలుక పక్క భాగం                               c) ఉప్పు

 iv) నాలుక చివరి భాగం                            d) తీపి

జ‌: i-d, ii-c iii-b, iv-a     

 

 

10. మానవుడిలో చర్వణకాల సంఖ్య?

జ‌: 12     

 

11. మనిషిలో కొరకడానికి ఉపయోగపడే దంతాలు ఏవి?

జ‌: కుంతకాలు     

 

12. జీర్ణాశయం, ఉదరంలోని భాగాల అధ్యయనాన్ని ఏమంటారు?

జ‌: గ్యాస్ట్రో ఎంటరాలజీ   

 

13. రెనిన్‌ అనే ఎన్‌జైమ్‌ నిర్వర్తించే విధి?   

జ‌: పాలను పెరుగుగా మారుస్తుంది.

 

14. సోడియం కోలేట్, సోడియం డీఆక్సీకోలేట్‌ అనేవి?

జ‌: పైత్యరస లవణాలు   

 

15. కిందివాటిలో సరైన వాక్యాలేవి? 

1) క్లోమం పసుపు, బూడిద రంగులో ఉండే గ్రంథి

2) క్లోమం నాళ, వినాళ గ్రంథిగా పనిచేస్తుంది.

3) క్లోమరసం క్షారయుతంగా ఉంటుంది.

4) క్లోమరసంలో ఉండే ముఖ్యమైన ఎన్‌జైమ్‌లు ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్‌లు.

జ‌: i, ii, iii, iv

 

16. యూరియా మానవ శరీరంలో ఏభాగంలో తయారవుతుంది? 

జ‌:  కాలేయం


17. లాలాజలంలో నీరు సుమారు ఎంతశాతం ఉంటుంది?

జ‌:  99.5%    


18. మనిషి దంతాలు వేటితో నిర్మితమై ఉంటాయి?

జ‌: డెంటయిన్‌    


19. ఏనుగుల్లో పొడవుగా కనిపించే దంతాలు కింది వేటి రూపాంతరాలు?

జ‌:  కుంతకాలు      


20. కింది ఏ భాగంలో ప్రోటీన్ల జీర్ణక్రియ ప్రారంభమవుతుంది?

జ‌: జీర్ణాశయం    


21. మానవుడి జీర్ణనాళంలో అతిపెద్ద భాగం?

జ‌: చిన్నపేగు    

 


22. మనిషి జీర్ణక్రియ సంపూర్ణమయ్యే భాగం?

జ‌: చిన్నపేగు    

 


23. మన శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఎక్కడ ఉంటుంది? 

జ‌: ఎనామిల్‌     

 


24. మానవ జీర్ణవ్యవస్థతో సంబంధం లేని భాగం?

జ‌: నెఫ్రాన్‌

 


25. సుక్రేజ్‌ ఎన్‌జైమ్‌ ఎక్కడ ఉంటుంది? 

జ‌: ఆంత్ర రసం      

 

Posted Date : 15-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌