1. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
a) స్పానిష్ భాషలో టోర్నడో అంటే 'ఉరుముల తుపాన్' అని అర్థం.
b) గ్రీకు భాషలో కైక్లోన్ అంటే 'తిరుగుతున్న నీరు' అని అర్థం.
జ: a, b సరైనవి
2. కిందివాటిని జతపరచండి.
ప్రాంతాలు సైక్లోన్
a) జపాన్, చైనా i) బ్లిజార్డ్స్
b) ఆస్ట్రేలియా ii) హరికేన్లు
c) వెస్టిండీస్ iii) విల్లీ - విల్లీ
d) అంటార్కిటికా iv) టైఫూన్లు
v) టోర్నడోలు
జ: a-iv, b-iii, c-ii, d-i
3. దేశంలో తొలి విపత్తు రేడియోను ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: కడలూర్
4. ప్రపంచ చక్రవాతాల్లో భారతదేశ తీర ప్రాంతంలో ఎంత శాతం తుపాన్లు సంభవిస్తున్నాయి?
జ: 10%
5. సునామీలు ఎక్కువగా ఎప్పుడు సంభవిస్తాయి?
1) పగలు 2) రాత్రి 3) పగలు, రాత్రి 4) అన్ని వేళల్లో
జ: 4 (అన్ని వేళల్లో)
6. పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఎక్కడ ఉంది?
జ: హోనొలులు
7. 2017 సెప్టెంబరులో ఫ్లోరిడా, క్యూబాను తీవ్రంగా నష్టపరిచిన హరికేన్?
జ: ఇర్మా
8. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్లు ఏ నిష్పత్తిలో సంభవిస్తాయి?
జ: 4 : 1
గత పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. 2011, మార్చి 11న ఏ దేశంలో సంభవించిన సునామీ వల్ల వేలాది మంది మరణించారు?(గ్రూప్-4, 2012)
జ: జపాన్
2. భారతదేశంలో ఎంత మేర తీరప్రాంతం తుపాన్లు, గాలివానలు, సునామీలకు గురవుతుంది?(గ్రూప్-4, 2012)
జ: 5700 కి.మీ.
3. సముద్రాల్లో సునామీ సంభవించినప్పుడు దాని తరంగ/అలల ప్రయాణ వేగం ఎంత?(పంచాయతీ సెక్రటరీ, 2013)
జ: 800 కి.మీ./గంట
4. 1999లో ఒడిశాలో సంభవించిన తీవ్ర తుపాన్ వేగం ఎంత?(హాస్టల్ వెల్ఫేర్, 2017)
జ: 260 - 270 కి.మీ./గంట
5. కిందివాటిలో విపత్తు కానిది? (ఏఎస్వో - 2017, ఏపీ)
1) ప్రాణ నష్టంలేని తుపాన్ 2) ఆర్థిక నష్టంలేని తుపాన్
3) ప్రాణ, ఆర్థిక నష్టంలేని తుపాన్ 4) గాలి లేని, వర్షాలకు కారణమయ్యే అల్పపీడన ద్రోణి
జ: 4 (గాలి లేని, వర్షాలకు కారణమయ్యే అల్పపీడన ద్రోణి)
6. ఉష్ణమండల తుపాన్లను గుర్తించడానికి ఉపయోగించే సాధనం?(ఏఎస్వో-2017)
జ: తీరప్రాంత రాడార్లు
7. 2014లో విశాఖపట్టణాన్ని తీవ్రంగా నష్టపరిచిన తుపాన్?(డీఎల్-2017)
జ: హుద్‌హుద్
8. జపాన్ భాషలో సునామీ అంటే?(డిప్యూటీ సర్వేయర్-2017)
జ: హర్బర్ వేవ్