• facebook
  • whatsapp
  • telegram

కొండచరియలు విరిగిపడటం

1. కొండచరియలు విరిగిపడటంతో మనదేశంలోని ఏ జాతీయ రహదారులు తరుచుగా దెబ్బతింటున్నాయి?
జ: 1ఎ, 1బి

 

2. భారతదేశంలో మొదటిసారిగా ఏ సంస్థ కొండచరియలు విరిగిపడటంపై పరిశోధన నిర్వహించింది?
జ: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

 

3. ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి కలిగేవైపరీత్యాల్లో 30 శాతం భారతదేశంలోని ఏ ప్రాంతంలో  సంభవిస్తున్నాయని అంచనా?
జ: హిమాలయాలు

 

4. మనదేశంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతం ఎంత శాతంగా ఉంది?
: 15

 

5. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలకు, పర్యావరణానికి వాటిల్లుతున్న నష్టం-
జ: ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి;ప్రాంత స్వరూపం మారిపోతుంది;రోడ్లు, పంటపొలాలు దెబ్బతింటాయి.

 

6. భారతదేశంలో ఏ ప్రాంతాల్లో కొండచరియలు తరచుగా విరిగిపడుతుంటాయి?​​​​​
జ: హిమాలయాలు,పశ్చిమ కనుమలు,నీలగిరి కొండలు

 

7. మనరాష్ట్రంలో ఏ నగరాల్లో కొండప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతూండటంతో కొండచరియలు విరిగిపడి నష్టం వాటిల్లే ప్రమాదముంది?
: విజయవాడ, విశాఖపట్టణం

 

8. కొండచరియలు విరిగి పడటానికి కారణం-
జ: కొండ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడటం,నేల క్రమక్షయానికి గురవడం,భూకంపాలు రావడం

 

9. సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంటల్ ఆర్గనైజేషన్ కొండచరియలు విరిగిపడటాన్ని గుర్తించడానికి ఏ ప్రాంతంలో ఇన్‌స్ట్రుమెంటేషన్ నెట్‌వర్క్‌ను నెలకొల్పింది?
జ: హరిద్వార్

 

10. కొండచరియలు విరిగిపడే వైపరీత్యానికి సంబంధించిన ప్రాంతాల పటాలను రూపొందిస్తున్న పరిశోధనా సంస్థ ఏది?
జ: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్

Posted Date : 24-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌