• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఉనికి - క్షేత్రీయ అమరిక

    భారత భూగోళశాస్త్రం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు మన దేశ ఉనికి, క్షేత్రీయ అమరిక గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఇది తదనంతర అధ్యయనానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో అంకెలు, సంఖ్యలు, పేర్లు ఎక్కువగా కనిపించినప్పటికీ ఆందోళన అవసరంలేదు. ఒకటికి రెండు సార్లు చదివితే సులభంగా గుర్తుంటాయి.

 

భారతదేశ ఉనికి - క్షేత్రీయ అమరిక

భారతదేశం 8%న 4' నుంచి 37%న 6' ఉత్తర అక్షాంశాల, 68%న 7' నుంచి 97%న 25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. మనదేశ విస్తీర్ణం 32,87,263 చ.కి.మీ. (3.28 మిలియన్ చ.కి.మీ.) లేదా ఖండ భూభాగ విస్తీర్ణంలో 2.42%. ఉపరితల విస్తీర్ణంలో 0.57%. మొత్తంగా ప్రపంచ విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉంది.

 

విస్తీర్ణంలో పెద్ద దేశాలు

1) రష్యా

2) కెనడా

3) చైనా

4) అమెరికా

5) బ్రెజిల్

6) ఆస్ట్రేలియా

7) భారత్

జనాభాలో రెండో పెద్ద దేశం మనది. మొదటి స్థానాన్ని చైనా ఆక్రమించింది. భారతదేశం ఉత్తర - దక్షిణాల మధ్య దూరం 3214 కి.మీ., తూర్పు-పశ్చిమాల మధ్య దూరం 2933 కి.మీ. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమాల మధ్య వ్యత్యాసం 281 కి.మీ. ప్రధాన భూభాగపు తీర రేఖ పొడవు 6,100 కి.మీ. మొత్తం భౌగోళిక తీర రేఖ పొడవు దీవులతో కలిపి 7516.6 కి.మీ. మొత్తం భూ సరిహద్దు పొడవు 15,200 కి.మీ.

 

తీర రేఖ ఉన్న రాష్ట్రాలు:

పశ్చిమ తీరం: అరేబియా సముద్రం; తూర్పు తీరం: బంగాళాఖాతం, హిందూమహాసముద్రం.

పశ్చిమ తీరంలోని రాష్ట్రాలు:

1) గుజరాత్ - 1054 కి.మీ. (పొడవైన తీర రేఖ ఉన్న రాష్ట్రం)

2) మహారాష్ట్ర - 804 కి.మీ.

3) గోవా-36 కి.మీ. (అతితక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రం)

4) కర్ణాటక - 288 కి.మీ

5) కేరళ - 480 కి.మీ.

 

తూర్పు తీరంలోని రాష్ట్రాలు:

1) ఆంధ్రప్రదేశ్ - 974 కి.మీ. (తూర్పు తీరంలో పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం)

2) తమిళనాడు - 912 కి.మీ.

3) ఒడిశా - 722 కి.మీ.

4) పశ్చిమ్‌బంగ - 400 కి.మీ.

మన దేశంలో పొడవైన బీచ్: చెన్నైలోని మెరీనా బీచ్. దీని పొడవు 13 కి.మీ.

 

భారత్‌తో భూ సరిహద్దు ఉన్న దేశాలు:

1) బంగ్లాదేశ్ - 4096 కి.మీ. (భారత్‌తో పొడవైన భూ సరిహద్దు ఉన్న దేశం)

2) చైనా - 3917 కి.మీ.

3) పాకిస్థాన్ 3310 కి.మీ.

4) నేపాల్ - 1752 కి.మీ.

5) మయన్మార్ - 1458 కి.మీ.

6) భూటాన్ - 587 కి.మీ.

7) అఫ్ఘనిస్థాన్ - 80 కి.మీ. (భారత్‌తో అతి తక్కువ భూ సరిహద్దు ఉన్న దేశం)

 

భారతదేశానికి అత్యంత చివరిలో ఉన్న ప్రాంతం:

భారతదేశానికి ఉత్తరాన ఉన్న చివరి ప్రాంతం ఇందిరా కాల్. ఇది కలిక్‌దావన్ కనుమలో జమ్మూకశ్మీర్‌లో ఉంది. పశ్చిమాన చివరి ప్రాంతం గురుమిటో. ఇది రాణా ఆఫ్ కచ్ (గుజరాత్)లో ఉంది. తూర్పున చివరి ప్రాంతం డాంగ్ ద్వీప కనుమ. ఇది అరుణాచల్‌ప్రదేశ్‌లో పూర్వాంచల్ పర్వతాల్లో ఉంది. దక్షిణ ప్రధాన భూభాగం చివరి ప్రాంతం కన్యాకుమారి. ఇది తమిళనాడులో ఉంది. ఇది ఇందిరా పాయింట్ గ్రెటోనికో బార్ దీవిలో ఉంది.

* భారత్‌కు దక్షిణాన ఉన్న పొరుగు దేశం శ్రీలంక. మన్నార్ సింధు శాఖ, పాక్ జలసంధి భారత దేశాన్ని, శ్రీలంకను వేరు చేస్తున్నాయి.

* రామసేతు/ఆడమ్స్ బ్రిడ్జి భారత్, శ్రీలంక దేశాలను కలుపుతుంది. భారత్ నుంచి శ్రీలంక తల్త్లెమన్నారు వద్ద వేరవుతుంది.

* మనదేశంలో మొదటి సూర్య కిరణాలు పడే ప్రాంతం డాంగ్ (అరుణాచల్ ప్రదేశ్). సూర్యుడు అస్తమించే ప్రాంతం 'రాణ్ ఆఫ్ కచ్ గుజరాత్.

* ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ప్రకారం ఏ దేశానికైనా సముద్రతీరం ఉంటే ఆ దేశ చివరి భూభాగం నుంచి దాని ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్ల వరకు ఆ దేశానికి సార్వభౌమాధికారం ఉంటుంది. భారతదేశం ప్రత్యేక ఆర్థిక మండలం 200 నాటికల్ మైళ్ల వరకు ఉంది. ఒక నాటికల్ మైలు = 1.852 కి.మీ. లేదా 1852 మీ.

* నౌకాయానంలో నాటికల్ మైళ్లను ఉపయోగిస్తారు.

* మనదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.

* 17 రాష్ట్రాలకు 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.

* 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలకు తీర రేఖ ఉంది.

* 5 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు తీర రేఖ, అంతర్జాతీయ సరిహద్దు లేదు. వీటిని భూపరివేష్ఠిత రాష్ట్రాలు అంటారు.

ఉదా:

1) మధ్యప్రదేశ్

2) ఛత్తీస్‌గఢ్

3) ఝార్ఖండ్

4) హరియాణ

5) తెలంగాణ

6) దిల్లీ

7) చండీగఢ్

8) దాద్రానగర్ హవేలి.

* గుజరాత్, పశ్చిమ్‌బంగా రాష్ట్రాలకు తీరరేఖ, అంతర్జాతీయ సరిహద్దు ఉంది.

 

సరిహద్దు రేఖలు:

* రాడ్ క్లిఫ్ రేఖ: ఇది భారత్, పాకిస్థాన్; భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఉంది.

* 24 డిగ్రీల అక్షాంశరేఖ: ఇది భారత్, గుజరాత్, పాకిస్థాన్‌ల మధ్య ఉంది.

* నియంత్రణా రేఖ (ఎల్‌వోసీ): భారత్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ల మధ్య ఉంది.

* డ్యూరాండ్ రేఖ: ఇది భారత్, అఫ్ఘనిస్థాన్; అఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ల మధ్య ఉంటుంది.

* మెక్ మోహన్‌రేఖ: ఇది భారత్, చైనాల మధ్య తూర్పుభాగం (అరుణాచల్‌ప్రదేశ్) లో ఉంది.

* వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ): ఇది భారత్, చైనాల మధ్య ఉత్తర భాగం (జమ్మూకశ్మీర్)లో ఉంది.

 

పొరుగు దేశాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు

పాకిస్థాన్‌తో సరిహద్దున్న రాష్ట్రాలు: గుజరాత్, రాజస్థాన్ (పాక్‌తో అధిక సరిహద్దున్న రాష్ట్రం), పంజాబ్, జమ్మూకశ్మీర్

అఫ్ఘనిస్థాన్: జమ్మూకశ్మీర్

చైనా: జమ్మూకశ్మీర్ (చైనాతో అధిక సరిహద్దున్న రాష్ట్రం), హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్నే

*పాల్: ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ (నేపాల్‌తో అధిక సరిహద్దున్న రాష్ట్రం), బిహార్, పశ్చిమ బంగా, సిక్కిం.

*భూటాన్: సిక్కిం, పశ్చిమ్‌బంగ, అసోం (అధిక సరిహద్దున్న రాష్ట్రం), అరుణాచల్‌ప్రదేశ్.

* మయన్మార్: అరుణాచల్ ప్రదేశ్ (అధిక సరిహద్దున్న రాష్ట్రం), నాగాలాండ్, మణిపూర్, మిజోరాం

* బంగ్లాదేశ్: పశ్చిమ్‌బంగ (అధిక సరిహద్దున్న రాష్ట్రం), అసోం, మేఘాలయా, త్రిపుర, మిజోరాం.

 

రాష్ట్రాలపరంగా సరిహద్దు ఉన్న దేశాలు

* పశ్చిమ్‌బంగతో సరిహద్దున్న దేశాలు: బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్.

* సిక్కిం: భూటాన్, నేపాల్, చైనా.

* అరుణాచల్‌ప్రదేశ్: భూటాన్, చైనా, మయన్మార్.

* జమ్మూకశ్మీర్: పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, చైనా.

 

ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దున్న రాష్ట్రాలు:

* ఉత్తర్‌ప్రదేశ్- 8 రాష్ట్రాలు

* అసోం - 7

* ఛత్తీస్‌గఢ్ - 6

* మహారాష్ట్ర - 6

 

విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలు:

1. రాజస్థాన్

2. మధ్యప్రదేశ్

3. మహారాష్ట్ర

4. ఉత్తర్‌ప్రదేశ్

* విస్తీర్ణంలో చిన్న రాష్ట్రం - గోవా.

* విస్తీర్ణంలో చిన్న కేంద్రపాలిత ప్రాంతం - లక్షదీవులు

* విస్తీర్ణంలో పెద్ద కేంద్రపాలిత ప్రాంతం - అండమాన్ నికోబార్ దీవులు

 

జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు:

1. ఉత్తర్‌ప్రదేశ్

2. మహారాష్ట్ర

3. బిహార్

4. పశ్చిమ్‌బంగ

* జనాభా పరంగా చిన్న రాష్ట్రం - సిక్కిం

* జనాభా పరంగా చిన్న కేంద్రపాలిత ప్రాంతం - లక్షదీవులు

* జనాభా పరంగా పెద్ద కేంద్రపాలిత ప్రాంతం - దిల్లీ.

Posted Date : 16-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌