1. దేశంలో విస్తరించి ఉన్న నేలల్లో అత్యంత సారవంతమైనవి ఏవి?
జ: ఒండ్రు నేలలు
2. నీటి ఎద్దడి నెలకొన్నప్పుడు 'పగుళ్లు' ఏర్పడే నేలలు ఏవి?
జ: నల్లరేగడి నేలలు
3. ఎర్ర నేలలు ఎరుపు రంగులో కనిపించడానికి కారణం?
జ: ఫెర్రస్ ధాతువు
4. కొత్త ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు?
జ: ఖాదర్
5. తోట పంటలకు అనుకూలమైన నేలలు ఏవి?
జ: లాటరైట్ నేలలు
6. ఇసుక నేలలు/ ఎడారి నేలలు అధికంగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది?
జ: రాజస్థాన్
7. 'బసాల్ట్' శిలలు క్రమక్షయం చెందగా ఏర్పడే నేలలు?
జ: నల్లరేగడి నేలలు
8. దేశంలో విస్తరించి ఉన్న నేలల్లో సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉండే మూలకం?
జ: నత్రజని
9. అధిక వర్షపాతం, అధిక నీటిపారుదల పద్ధతుల వల్ల ఏర్పడే నేలలు ఏవి?
జ: లవణ నేలలు
10. కింది ఏ నేలలు నీటిని అధిక కాలం పాటు నిల్వ ఉంచుకోగలవు?
1) నల్లరేగడి నేలలు 2) లాటరైట్ నేలలు 3) లవణ నేలలు 4) పీట్ నేలలు
జ: 1 (నల్లరేగడి నేలలు)
11. నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ...?
జ: పెడాలజీ
12. పప్పు ధాన్యాలకు అనుకూలమైన నేలలు ఏవి?
జ: ఎర్ర నేలలు
13. నదీ నిక్షేపణ వల్ల ఏర్పడే నేలలు ఏవి?
జ: ఒండ్రు నేలలు
14. నల్లరేగడి నేలలు అధికంగా విస్తరించి ఉన్న రాష్ట్రం?
జ: మహారాష్ట్ర
15. జీవ సంబంధ పదార్థం ఎక్కువగా సంచయనం కావడం వల్ల ఏర్పడే నేలలు?
జ: పీట్ నేలలు