1. రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
జవాబు: రాజస్థాన్
2. రూర్ ఆఫ్ ఇండియా (Ruhr of India) అని దేనికి పేరు?
జవాబు: ఛోటానాగ్పుర్ పీఠభూమి
3. మానవుడు తొలిసారిగా ఉపయోగించిన ఖనిజం ఏది?
జవాబు: రాగి
4. ప్యాకేజింగ్ పరిశ్రమలో అత్యధికంగా ఉపయోగిస్తున్న ఖనిజం ఏది?
జవాబు: అల్యూమినియం
5. వజ్రపు గనులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు: మధ్యప్రదేశ్
6. గెలీనా ఏ ఖనిజపు ధాతువు?
జవాబు: సీసం
7. థర్మల్ ఇన్సులేషన్లో ముఖ్యంగా ఉపయోగించే ఖనిజం ఏది?
జవాబు: రాతినార
8. ఆంధ్రప్రదేశ్లో బంగారు గనులు ఉన్న జిల్లా ఏది?
జవాబు: అనంతపురం
9. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు: తమిళనాడు
10. రాగితో జింకును కలపడం వల్ల ఏర్పడే Alloy ఏది?
జవాబు: ఇత్తడి
11. సున్నపురాయిని ప్రధానంగా ఏ పరిశ్రమలో ముడి సరుకుగా ఉపయోగిస్తారు?
జవాబు: సిమెంట్ పరిశ్రమ
12. అల్యూమినియం ఖనిజ రూపం ఏది?
జవాబు: బాక్సైట్
13. మాంగనీస్ ఖనిజం ఏ రాష్ట్రంలో అత్యధికంగా లభిస్తుంది?
జవాబు: ఒడిశా
14. ఏ ఖనిజం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది?
జవాబు: అభ్రకం
15. బంగారం ఏ శిలల్లో లభిస్తుంది?
జవాబు: క్వార్ట్జ్ శిలలు