మాదిరి ప్రశ్నలు
1. 'ద్రవ్యం ఏ పనులను నిర్వహిస్తుందో అదే ద్రవ్యం' అని అన్నవారు?
జ: వాకర్
2. అంతర్గత, బహిర్గత విలువలు సమానంగా ఉండే ద్రవ్యం?
జ: ప్రమాణ ద్రవ్యం
3. బ్యాంకులు సృష్టించే ద్రవ్యం?
జ: పరపతి ద్రవ్యం
4. ద్రవ్యం ప్రాథమిక విధులు ఏవి?
1) వినిమయ మాధ్యమం 2) విలువల కొలమానం 3) విలువల విధి 4) వాయిదాల చెల్లింపులు
జ: 1, 2
5. ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల 2% - 3% వరకు ఉంటే ఆ ద్రవ్యోల్బణం?
జ: పాకుతున్న ద్రవ్యోల్బణం
6. ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణం?
1) జనాభా పెరుగుదల 2) బ్లాక్ మార్కెటింగ్ 3) లోటు బడ్జెట్ 4) అన్నీ
జ: 4 (అన్నీ)
7. ద్రవ్యోల్బణానికి కారణమై సప్లయి తగ్గుదలకు దారితీసే అంశాలు?
1) అంతర్జాతీయ మార్పులు 2) వరదలు 3) వ్యవసాయ క్షీణత 4) అన్నీ
జ: 4 (అన్నీ)
8. ద్రవ్యోల్బణ సమయంలో ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తిని
జ: పెంచుతుంది
9. ధరల పెరుగుదల, నిరుద్యోగితకు సంబంధాన్ని తెలిపే రేఖ?
జ: ఫిలిప్స్ వక్రరేఖ