• facebook
  • whatsapp
  • telegram

రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా

మాదిరి ప్రశ్నలు

 

1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొంత కార్యాలయాలు లేని చోట ఆర్‌బీఐ ఏజెంటుగా ఏ సంస్థ వ్యవహరిస్తుంది?

ఎ) స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బి) ఆర్థికమంత్రిత్వ శాఖ సి) భారత ప్రభుత్వం డి) అంతర్జాతీయ ద్రవ్య సంస్థ
జ: (ఎ)

 

2. కిందివాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే విధుల్లో ఏది సరైంది?
1) ద్రవ్యాన్ని చెలామణి చేయడం 2) ప్రభుత్వ బ్యాంకు 3) బ్యాంకులకు బ్యాంకు 4) పరపతి నియంత్రణ
ఎ) 1, 2 బి) 3, 4 సి) పైవన్నీ డి) ఏదీకాదు
జ: (సి)

 

3. ఆర్‌బీఐ 'వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సు' (డబ్ల్యూఎమ్ఏ)ను కిందివాటిలో దేనికి కల్పిస్తుంది?
ఎ) కేంద్ర ప్రభుత్వం బి) రాష్ట్ర ప్రభుత్వం సి) రెండింటికీ డి) ఏదీకాదు
జ: (సి)

 

4. ఆర్‌బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మితే వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వల మీద ప్రభావం ఎలా ఉంటుంది?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది సి) స్థిరంగా ఉంటుంది డి) పెరుగుతుంది లేదా తగ్గుతుంది
జ: (బి

 

5. ఆర్‌బీఐ కింది చర్యల్లో ఏది దేశంలోని ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడదు?
ఎ) బ్యాంకు రేటును పెంచడం బి) రిజర్వు నిష్పత్తులను పెంచడం
సి) బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనడం డి) రెపో రేటును పెంచడం
జ: (సి)

 

6. నగదు నిల్వల నిష్పత్తిని తగ్గిస్తే వచ్చే ఫలితం
1) బ్యాంకుల వద్ద నగదు నిల్వలు పెరుగుతాయి 2) రెపో రేటు పెరుగుతుంది 3) శాసనాత్మక ద్రవ్యత్వ నిష్పతి (ఎస్ఎల్ఆర్) తగ్గుతుంది
ఎ) 1 మాత్రమే బి) 1, 2 సి) 1, 3 డి) 1, 2, 3
జ: (ఎ)

 

7. 'బ్యాంకింగ్ నియంత్రణ చట్టం'ను ఎప్పుడు జారీ చేశారు?
ఎ) 1947 బి) 1948 సి) 1949 డి) 1950
జ: (సి)

 

8. బహిరంగ మార్కెట్ వ్యవహారాల ద్వారా ఆర్‌బీఐ వేటిని కొనడం/ అమ్మడం చేస్తుంది?
ఎ) విదేశీ మారక ద్రవ్యం బి) బంగారం సి) ప్రభుత్వ సెక్యూరిటీలు డి) పైవన్నీ
జ: (సి)

 

9. బ్యాంకు రేటు అని దేన్ని అంటారు?
ఎ) వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి రుణాన్ని పొందే వడ్డీ రేటు
బి) వాణిజ్య బ్యాంకులు తమ వినియోగదారులకు రుణాన్ని ఇచ్చే రేటు
సి) వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐకు రుణాన్ని ఇచ్చే వడ్డీ రేటు
డి) ఏదీకాదు
జ: (ఎ)

Posted Date : 21-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌