• facebook
  • whatsapp
  • telegram

వ్యవ‌సాయ‌రంగం

  భారతదేశ వ్యవసాయ రంగంలో పంట ఉత్పత్తులు, ఉత్పాదకత, తీరుతెన్నులు, పంట విస్తీర్ణం, సగటు దిగుబడులు.. అత్యంత కీలకమైన అంశాలు. వ్యవసాయం మన దేశ జాతీయాదాయం, వృద్ధిలో కీలకమైన రంగం. ముఖ్యంగా ఉపాధి కల్పన, అంతర్జాతీయ వాణిజ్యం, ఆహారభద్రత కల్పనలో ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఉంది. (పట్టిక-1 చూడండి)

మూలధన కల్పన (జీసీఎఫ్)లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా
2011-12లో 8.6%, 2012-13లో 7.7%, 2013-14లో 7.9%గా నమోదైంది. దీనిలో ప్రధానంగా పంటల వాటా చాలా ఎక్కువగా ఉంది. ఇది 2011-12లో 7.4%, 2012-13లో 6.5%, 2013-14లో 6.6%గా ఉంది. అతి తక్కువగా అడవులు, కలపకు సంబం ధించి 2011-12, 2012-13, 2013-14 అన్ని సంవత్సరాల్లో కేవలం 0.1%గా ఉంది.

 

వ్యవసాయం, అనుబంధ రంగాల జీడీపీలో జీసీఎఫ్ వాటా

వ్యవసాయం, అనుబంధ రంగాల స్థూల దేశీయ ఆదాయం(జీడీపీ)లో స్థూల మూలధన కల్పన వాటా 2011-12లో 18.3%, 2012-13లో 15.5%, 2013-14లో 14.8%గా ఉంది. (పట్టిక-2 చూడండి).

 

ప్రధాన పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత (2013-14)

ఆహారధాన్యాలు: భారతదేశంలో ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం 126 మిలియన్ హెక్టార్లు ఉండగా సగటు ఉత్పత్తి 264.8 మిలియన్ టన్నులు. సగటు ఉత్పాదకత ప్రధానంగా 2,101 కిలోలుగా ఉంది.

పప్పుధాన్యాలు: పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 25.2 మిలియన్ హెక్టార్లు. 2012-13తో పోలిస్తే 8.3ృ పెరుగుదల ఉంది. పప్పుధాన్యాల ఉత్పత్తి 19.3 మిలియన్ టన్నులు, సగటు ఉత్పాదకత 764 కిలోలుగా ఉంది.

నూనెగింజలు: నూనెగింజల సాగు విస్తీర్ణం 28.5 మిలియన్ హెక్టార్లు. 2012-13లో పోలిస్తే 7.6ృ పెరుగుదల ఉంది. అయితే వీటి ఉత్పత్తి 32.9 మిలియన్ టన్నులు, 1,153 కిలోల సగటు ఉత్పత్తి ఉంది.

 

వ్యవసాయ పరపతి

2013-14 సంవత్సరానికి వ్యవసాయ పరపతి (రుణాల) లక్ష్యాన్ని రూ. 7,00,000 కోట్లుగా నిర్దేశించగా, రూ.7,30,765 కోట్లు ఇచ్చారు. 2012-13లో రూ.6,07,375 కోట్లు మాత్రమే వ్యవసాయ రుణాలు ఇచ్చారు. 2014-15 సంవత్సరం వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 8,00,000 కోట్లు కాగా, 2014 సెప్టెంబరు 30 నాటికి రూ. 3,70,828.60 కోట్లు పంపిణీ చేశారు.

2013-14లో ప్రధాన పంటల సగటు, గరిష్ఠ-కనిష్ఠ దిగుబడులు (కి.గ్రా./ హె.)

దేశంలో ప్రధాన ఆహార పంటలు.. ముఖ్యంగా వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్నతోపాటు వాణిజ్య పంటలైన పత్తి లాంటి వాటివిషయంలో సగటు ఉత్పత్తులు, గరిష్ఠ-కనిష్ఠ విలువలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. (పట్టిక-3 చూడండి)

 

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై)

ఆర్‌కేవీవై కింద 2015-16లో రూ. 18,000 కోట్లు కేటాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. వీటిని 100ృ మౌలిక వసతులు, ఆస్తుల సృష్టి కోసం ఖర్చు చేసేందుకు రాష్ట్రాలకు స్వేచ్ఛను ఇచ్చింది.

 

జాతీయ ఆహారభద్రత మిషన్

12వ ప్రణాళిక అంతానికి 25 మిలియన్ టన్నులు అదనంగా పెంచాలన్న ఉద్దేశంతో దీన్ని అమలు చేశారు. దీనికింద 10 మిలియన్ టన్నుల (మి.ట.) అదనపు బియ్యం, 8 మి.ట. గోధుమ, 4 మి.ట. పప్పుధాన్యాలు, 3 మి.ట. ముతక ధాన్యాలు అదనంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

* పునర్‌వ్యవస్థీకరించిన ఈ పథకాన్ని 2014-15 నుంచి 28 రాష్ట్రాల్లోని 619 జిల్లాల్లో అమలు చేస్తున్నారు.

* వాణిజ్య పంటలను కూడా 2014-15 నుంచి ఆహారభద్రత మిషన్‌కు జత చేశారు.

 

వ్యవసాయ పథకాలు

సాగునీటి ప్రయోజన పథకం

అసంపూర్ణంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడానికి 1996-97లో కేంద్రం సత్వర సాగునీటి ప్రయోజన పథకాన్ని(ఏఐబీపీ) ప్రారంభించింది. దీనికింద 2014, డిసెంబరు 31 నాటికి రూ.61,195.47 కోట్ల రుణాలు/గ్రాంట్లు విడుదల చేసింది.

 

ఎరువుల యూనిట్ల ఆధునికీకరణ

2014-15లో ఎరువుల విధానానికి సంబంధించి కేంద్రం రెండు చర్యలు చేపట్టింది. 2014, ఏప్రిల్ 2న యూరియా యూనిట్ల ఆధునికీకరణ ద్వారా నూతన ధర విధానాన్ని ప్రకటించింది. యూరియా ఉత్పత్తిలో పెట్టుబడులకు 2013, జనవరి 2న నూతన పెట్టుబడి విధానం-2012ను ఆమోదించింది.

12వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి లక్ష్యాన్ని 4ృగా నిర్ణయించగా, 201112 ధరల వద్ద 201213 లో 1.2%, 201314లో 3.7%, 201415లో 1.1% వృద్ధి సాధించారు.

Posted Date : 21-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌