• facebook
  • whatsapp
  • telegram

పారిశ్రామిక రంగం - సేవలు

* భారత్‌లో ప్రణాళికా అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం - 1944

* భారత్‌లో తొలి పారిశ్రామిక తీర్మానాన్ని చేసిన సంవత్సరం - 1948, ఏప్రిల్ 6

* స్వాతంత్య్రానంతరం తొలి పారిశ్రామిక తీర్మానాన్ని చేసిన సంవత్సరం - 1948

* మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం - 1948

* 1948 పారిశ్రామిక తీర్మానం పరిశ్రమలను ఎన్ని వర్గాలుగా విభజించింది - 4 వర్గాలు

* 1956 పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించిన సంవత్సరం - 1956, ఏప్రిల్ 30

* 'సామ్యవాద సమాజ స్థాపన'కు ప్రాధాన్యం ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం - 1956

* 'ఆర్థిక రాజ్యాంగం'గా పేరొందిన పారిశ్రామిక తీర్మానం - 1956

* పరిశ్రమల అభివృద్ధి - క్రమబద్ధీకరణ చట్టాన్ని చేసిన సంవత్సరం - 1951

* లైసెన్సింగ్ విధానాల లోపాల పరిశీలనకు ఏర్పాటుచేసిన కమిటీ - హజారే కమిటీ

* పారిశ్రామిక తీర్మానం - 1977ను ఏ ప్రభుత్వం ప్రకటించింది - జనతా ప్రభుత్వం

* జిల్లా పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించిన తీర్మానం - 1977

* వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేయడం అనేది దేనికి సంబంధించిన భావన - ఆర్థిక ఫెడరలిజం

* 'ఆర్థిక ఫెడరలిజం' అనే భావనను తెలిపిన పారిశ్రామిక తీర్మానం - 1980

* మెదటిసారిగా పర్యావరణ సమతౌల్యాన్ని ప్రస్తావించిన తీర్మానం - 1980

* 'భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్' పరిశ్రమ నిర్మాణం ఏ ప్రణాళికలో పూర్తయ్యింది - మూడో ప్రణాళిక

* 'సంయుక్త రంగం' ఏర్పాటు చేసిన పారిశ్రామిక తీర్మానం ఏ సంవత్సరంలోది? - 1970

* 'న్యూక్లియస్ సంస్థలు' అనే భావనను ప్రవేశపెట్టిన తీర్మానం - 1980

* లైసెన్సుల విస్తృత ఏకీకరణ (Broad Bonding) పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం - 1984

* పారిశ్రామిక విధానం - 1991ని ప్రవేశపెట్టిన సంవత్సరం - 1991, జులై 24

* విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని (FERA) చేసిన సంవత్సరం - 1973

* FERA ను సవరించి విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (FEMA) ప్రవేశపెట్టిన సంవత్సరం - 1998

* 'పారిశ్రామిక, వ్యవసాయ, విత్త వాణిజ్య సంస్థల్లో ప్రభుత్వ యాజమాన్యం, నిర్వహణే ప్రభుత్వ రంగం' అని అన్నది - హెన్సన్

* ప్రభుత్వ శాఖ అధీనంలో నిర్వహించే సంస్థలు - శాఖాపరమైన సంస్థలు (Departmental Undertaking)

* శాఖాపరమైన సంస్థలకు ఉదాహరణలు - రైల్వేలు, పోస్టల్

* ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసే సంస్థలు - ప్రభుత్వ కార్పొరేషన్లు

* ప్రభుత్వ కార్పొరేషన్లకు ఉదాహరణలు - LIC, FCI, IOC, STC మొదలైనవి

* కంపెనీల చట్టం నిబంధనల మేరకు జాయింట్ స్టాక్ కంపెనీ పద్ధతిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ కంపెనీలు అంటారు.

* ప్రభుత్వ కంపెనీలకు ఉదాహరణ - HMT, హిందుస్థాన్ షిప్‌యార్డ్, ఇండియన్ టెలిఫోన్ పరిశ్రమ

* 1951లో ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య - 5

* 1951లో ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడి విలువ - రూ.29 కోట్లు

* స్థూల స్థిర మూలధన కల్పన (GFCF) అంటే ఏమిటి?
జ: CGO ఉత్పత్తి మదింపు ప్రకారం, నిర్మాణం, యంత్రాలు, పరికరాల కింద మదింపు చేసిన మూలధన వస్తువులన్నింటినీ కలిపితే వచ్చేది.

 

పారిశ్రామిక రంగం - ఆర్థిక సంస్కరణలు

* ఆర్థిక సంస్కరణల్లో ప్రధాన అంశాలు - సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ

* ప్రభుత్వ నిబంధనలు, నియంత్రణలను సులభతరం చేయడం అనే విధానం - సరళీకరణ (Liberalisation)

* ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచే అంశం - ప్రైవేటీకరణ (Privatisation)

* ప్రభుత్వరంగ సంబంధిత సంస్థల నియంత్రణ, నిర్వహణలను ప్రైవేట్ రంగానికి అప్పగించే విధానం - ప్రైవేటీకరణ

* ప్రభుత్వ రంగానికి కేటాయించిన రంగాల్లోకి ప్రైవేట్ రంగాన్ని అనుమతించే ప్రక్రియ - ప్రైవేటీకరణ

* ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో కలిపి వేయడం - ప్రపంచీకరణ (Globalisation)

* ఇంగ్లండ్‌లో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించింది - మార్గరెట్ థాచర్

* అమెరికాలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించింది - రోనాల్డ్ రీగన్

* భారత్‌లో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించింది - పి.వి.నరసింహారావు

* ప్రైవేటీకరణ అనే పదాన్ని మొదటగా ప్రస్తావించింది - పీటర్ డ్రక్కర్

* ప్రైవేటీకరణ అనే పదాన్ని మొదటిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారు? - The Age of Discontinuity

* 'The Age of Discontinuity' అనే గ్రంథ రచయిత - పీటర్ డ్రక్కర్

* మన దేశంలో కొన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చేసిన సంవత్సరం - 1980

* భారత్‌లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన సంవత్సరం - 1991, జులై 24

* నూతన పారిశ్రామిక విధానం చేపట్టిన సంవత్సరం - 1991, జులై 24

* నూతన ఆర్థిక విధానం లక్ష్యాలు - ఆర్థిక వృద్ధిరేటు పెంపు, ఆదాయ, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం, సంపూర్ణ ఉద్యోగిత, పేదరికం తగ్గింపు

* 'ఆర్థిక కార్యకలాపాలు జాతుల రాజకీయ సరిహద్దులు దాటి విస్తరించడమే ప్రపంచీకరణ' అని తెలిపింది - దీపక్ నాయర్

* ప్రపంచ దేశాల మధ్య ఏయే అంశాల్లో స్వేచ్ఛా ప్రవాహం ఉంటే దాన్ని ప్రపంచీకరణ అంటారు?
జ: 1) వస్తుసేవలు 2) మూలధనం 3) శ్రామికులు 4) సాంకేతిక పరిజ్ఞానం

* ప్రపంచీకరణ వల్ల లాభాలు ఏవి?

జ: విదేశీ పెట్టుబడుల లభ్యత, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ల విస్తరణ, నాణ్యమైన ఉత్పత్తులు, ఉపాధి, అభివృద్ధి

* భారత్‌లో ప్రపంచీకరణకు తీసుకున్న చర్యలు
1) రూపాయి విలువ సవరణ 2) దిగుమతుల సరళీకరణ 3) విదేశీ పెట్టుబడుల ఆకర్షణ

* సరళీకృత మారక ద్రవ్య యాజమాన్య వ్యవస్థ (LERMS) ను ప్రవేశపెట్టింది - 1992 - 93

Posted Date : 21-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌