• facebook
  • whatsapp
  • telegram

అభివృద్ధి సూచికలు - భారత్

1. సులభ వాణిజ్య విధానం - 2017లో భారత్ స్థానం ఎంత?
జ‌: 130

 

2. కిందివాటిలో ప్రపంచ ఆశావహ వ్యాపార సూచీ (2016) కు సంబంధించి వాస్తవం ఏది?
     i) ఈ సూచీలో భారత్‌ది మొదటి స్థానం
     ii) ఈ సూచీలో మొదటి స్థానం ఇండోనేషియాది
     iii) ఈ సూచీలో భారత్ రెండో స్థానంలో ఉంది
జ‌: ii, iii

 

3. ప్రపంచ రిటైల్ అభివృద్ధి సూచీ - 2016లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
జ‌: 2

 

4. ప్రపంచ అవినీతి సూచీ - 2016లో వాస్తవాలు ఏవి?
    i) ఈ సూచీలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది
    ii) భారత్‌ది 79వ స్థానం
జ‌: i, ii

 

5. వరల్డ్ సర్వీస్ లొకేషన్ సూచీ - 2016లో భారత్ స్థానం ఎంత?
జ‌: 1

 

6. జెండర్ గ్యాప్ ఇండెక్స్ - 2016లో భారత్ స్థానం ఎంత?
జ‌: 87

 

7. సమ న్యాయ సూచిక - 2016లో భారత్ పొందిన స్థానం ఎంత?
జ‌: 66

 

8. కనీస అవసరాల దృక్పథాన్ని ప్రవేశపెట్టిన సంస్థ ఏది?
జ‌: ILO

 

9. భారతదేశం విదేశీ పెట్టుబడుల సూచీ - 2016లో సాధించిన స్థానం ఎంత?
జ‌: 10

 

10. ప్రపంచ పోటీతత్వ సూచీ - 2016లో భారత్ సాధించిన స్థానం ఎంత?
జ‌: 39

 

11. గుడ్ కంట్రీ ఇండెక్స్ - 2015లో భారత్ పొందిన స్థానం ఎంత?
జ‌: 70

 

12. ప్రపంచ మానవ పెట్టుబడి సూచీ (2016)లో భారత్ స్థానం ఎంత?
జ‌: 105

 

13. ప్రపంచ ఆకలి సూచీ - 2016 కు సంబంధించిన అంశం ఏది
    i) మొదటి స్థానంలో ఉన్న దేశం అర్జెంటీనా
    ii) రెండో స్థానంలో బోస్నియా - హిర్జగోవినా ఉంది
    iii) మూడో స్థానంలో స్విస్
    iv) భారత్ 97వ స్థానంలో ఉంది
జ‌: i, ii, iii, iv

 

14. FDI-2016 సూచీకి సంబంధించి మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలను వరుసగా అమర్చండి.
      i) అమెరికా        ii) హాంకాంగ్         iii) చైనా
జ‌: i, ii, iii

 

15. ప్రపంచ సేవా కేంద్ర సూచీ - 2016లో మొదటి మూడు దేశాలను క్రమంలో అమర్చండి.
        i) భారత్               ii) చైనా             iii) మలేషియా
జ‌: i, ii, iii

 

16. ప్రపంచ పోటీ సూచీ - 2016 కి సంబంధించి సరైనవి ఏవి?
     i) అమెరికా మొదటి స్థానంలో ఉంది
     ii) హాంకాంగ్ రెండో స్థానంలో ఉంది
     iii) భారత్ 39వ స్థానంలో నిలిచింది
జ‌: iii

 

17. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ - 2016లో వాస్తవ అంశాలు ఏవి?
       i) స్విస్ మొదటి స్థానంలో ఉంది
      ii) స్వీడన్ రెండో స్థానంలో ఉంది
      iii) భారత్ అరవై ఆరో స్థానంలో నిలిచింది
జ‌: i, ii, iii

 

18. ప్రపంచ శాంతి సూచీ - 2016లో భారత్ స్థానం ఎంత?
జ‌: 141

 

19. ప్రపంచ శాంతి సూచీలో మొదటి స్థానం పొందిన దేశం ఏది?
జ‌: డెన్మార్క్

 

20. గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ - 2016లో భారత్ స్థానం ఎంత?
జ‌: 4

 

21. గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్ ఇండెక్స్ - 2016 కు సంబంధించిన వాస్తవాలు ఏవి?
       i) స్విస్ ప్రథమ స్థానంలో ఉంది
      ii) సింగపూర్ రెండో స్థానంలో ఉంది
      iii) సింగపూర్ మూడో స్థానంలో ఉంది
      iv) భారత్ ఎనభై తొమ్మిదో స్థానంలో ఉంది
జ‌: i, ii, iv

 

22. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ - 2016 కి సంబంధించి సరైనవి ఏవి?
      i) భారత్ ముప్ఫైతొమ్మిదో స్థానంలో ఉంది
     ii) అమెరికా మొదటి స్థానంలో ఉంది
     iii) యునైటెడ్ కింగ్‌డమ్ రెండో స్థానంలో ఉంది
జ‌: i, ii, iii

 

23. లాజిస్టిక్ పర్‌ఫార్మెన్స్ సూచీ - 2016లో ఇండియా స్థానం ఎంత?
జ‌: 35

 

24. భారతదేశం కింది ఏ సూచీలో 110వ స్థానం పొందింది?
      1) సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్ ఇండెక్స్ - 2016
      2) వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ - 2016
      3) వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ - 2016
      4) వరల్డ్ రిస్క్ ఇండెక్స్ - 2016
జ‌: 1 (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్ ఇండెక్స్ - 2016)

 

25. లాజిస్టిక్ పర్‌ఫార్మెన్స్ సూచీలో మొదటి స్థానం పొందిన దేశం ఏది?
జ‌: జర్మనీ

 

26. ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా సూచీ - 2016లో భారత్ స్థానం ఎంత?
జ‌: 112

 

27. ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా సూచీ - 2016లో మొదటి స్థానాలు పొందిన దేశాలు ఏవి?
జ‌: హాంకాంగ్, సింగపూర్, న్యూజిలాండ్

 

28. కింది వాటిలో వాస్తవం ఏది?
      i) PQLI-1979            ii) HDR-1990
     iii) GDI-1995            iv) GII-2010
జ‌: i, ii, iii, iv

 

29. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ - 2016లో భారత్ పొందిన స్థానం ఎంత?
జ‌: 133

 

30. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ - 2016లో మొదటి స్థానం పొందిన దేశమేది?
జ‌: ఫిన్లాండ్

 

31. సమ్మిళిత అభివృద్ధి సూచీ - 2017లో భారత్ స్థానం ఎంత?
జ‌: 60

 

32. W-10 రిపోర్ట్ - 2016 కు సంబంధించిన వాస్తవాలేవి?
     i) అమెరికా మొదటి స్థానంలో ఉంది
     ii) చైనా రెండో స్థానంలో ఉంది
     iii) భారత్ ఏడో స్థానంలో ఉంది
జ‌: i, ii, iii

 

33. వరల్డ్ రిస్క్ సూచీ - 2016లో భారత్ స్థానం?
జ‌: 77

 

34. సమ న్యాయ సూచీ - 2016 కు సంబంధించి వాస్తవాలేవి?
i) 1వ స్థానం - డెన్మార్క్ ii) భారత్ - 66వ స్థానం iii) 2వ స్థానం - నార్వే
జ‌: i, ii, iii

 

35. జెండర్ గ్యాప్ సూచీ - 2016లో మొదటి స్థానం పొందిన దేశమేది?
జ‌: ఐస్‌లాండ్

 

36. నికర ఆర్థిక సంక్షేమ సూచీని ఆర్థిక సంక్షేమ కొలతగా మార్చింది ఎవరు?
      i) విలియం నర్థవుస్       ii) జెమ్స్‌టోబిన్         iii) మోరిస్
జ‌: i, ii

 

37. కిందివాటిలో భారత్‌కు సంబంధించిన వాస్తవాలేవి?
      i) ఆకలి సూచీ - 97వ స్థానం          ii) శాంతి సూచీ - 141వ స్థానం
జ‌: i, ii

 

38. కింది వాటిలో ఏది వాస్తవం?
      i) HPI-Iని 1997లో ప్రవేశపెట్టారు.
      ii) HPI-II ని 1998లో ప్రవేశపెట్టారు.
     iii) MPI ని 2010లో ప్రవేశపెట్టారు
జ‌: i, ii, iii

 

39. వరల్డ్ బ్యాంక్ ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్ రిపోర్టు - 2017లో మహిళా కార్మిక శక్తి అంశాల్లో భారత్ స్థానమెంత?
జ‌: 120

 

40. గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2017లో ముంబయి నగర స్థానమెంత?
జ‌: 24

 

41. ఫోర్బ్స్ - 10 గ్లోబల్ కన్స్యూమర్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీల జాబితాలో నిలిచిన భారత కంపెనీ పేరేమిటి? స్థానమెంత?
జ‌: HDFC , 7

 

42. నాలుగో గ్లోబల్ పవర్స్ ఆఫ్ లగ్జరీ గూడ్స్ నివేదికలో ఉన్న భారత కంపెనీలు ఏవి?
     i) గీతాంజలి జెమ్స్      ii) టైటాన్        iii) పీసీ జ్యువెలర్స్
జ‌: i, ii, iii

 

43. ప్రపంచ సంతోష సూచీ - 2016 కు సంబంధించి సరైన అంశాలు ఏవి?
      i) భారత్ 118వ స్థానంలో ఉంది
     ii) డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది
జ‌: i, ii

 

44. మానవాభివృద్ధి సూచీలో లింగ అసమానత సూచీని (GII-2010) ఏ సూచికల స్థానంలో ప్రవేశ పెట్టారు?
       i) లింగ సంబంధ అభివృద్ధి సూచీ (GDI)
      ii) లింగ సాధికారిత సూచీ (GEM)
      iii) కనీస అవసరాల వ్యూహం
జ‌: i, ii

 

45. మహిళా సాధికారత సూచీలో పరిగణనలోకి తీసుకునే అంశాలు ఏవి?
      i) మహిళా ఆర్థిక భాగస్వామ్యం
     ii) మహిళా రాజకీయ భాగస్వామ్యం
    iii) మహిళలకు ఆర్థిక వనరులపై ఆధిక్యత
    iv) మహిళలకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు
జ‌: i, ii,iii

 

46. MPIకి సంబంధించిన వాస్తవాలు ఏవి?
      i) HPI స్థానంలో MPI ని ప్రవేశపెట్టారు
     ii) MPI ని లెక్కించడానికి ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణ స్థాయి అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు
జ‌: i, ii

 

47. GDI ని ఏ సంవత్సరం నుంచి లెక్కిస్తున్నారు?
జ‌: 1995

Posted Date : 21-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌