• facebook
  • whatsapp
  • telegram

ఆంగ్లేయుల కాలం నాటి భారత ఆర్థిక వ్యవస్థ

1. భారతదేశంలో కంపెనీ గుత్త వ్యాపార హక్కులను రద్దుచేసిన చట్టం ఏది?
జ‌: 1813

 

2. భారతదేశంలోని గ్రామీణ పేదరికాన్ని తన రచనలల్లో చూపించిన రచయిత ఎవరు?
జ‌: ప్రేమ్‌చంద్

 

3. భారతదేశంలో ఆంగ్లేయులు బడ్జెట్ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ‌: 1860

 

4. 'భారతీయ వస్త్రాలు మన ఇళ్లలోకి, బీరువాలోకి చివరికి పక్కలోకి కూడా వచ్చి చేరాయి' అని అన్నదెవరు?
జ‌: డేనియల్ డెఫో

 

5. చైనాతో తేయాకు వర్తకంలో కంపెనీ గుత్తాధికారాన్ని రద్దు చేసిన చట్టం ఏది?
జ‌: 1833 చట్టం

 

6. పారిశ్రామిక విప్లవ ఫలితంగా భారతదేశంలో ఏర్పడిన మురికివాడల పరిస్థితులను తన రచనల్లో పేర్కొందెవరు?
జ‌: చార్లెస్ డికెన్స్

 

7. 1834 లో భారతదేశ ఎగుమతుల విలువ ఎంత?
జ‌:15 కోట్లు

 

8. ఆంగ్ల ఆర్థిక విధానాన్ని 'గంగ ఒడ్డున ఉన్న సంపదనంతా పీల్చి, థేమ్స్ నది ఒడ్డున కక్కే స్పాంజి లాంటిది' అని ఎవరు పేర్కొన్నారు?
జ‌: సుమలివాన్

 

9. 1925 - 34 మధ్య భారతదేశ తలసరి ఆదాయం ప్రపంచ దేశాల్లోకెల్లా అతి తక్కువ అని ఎవరు పేర్కొన్నారు?
జ‌: కొలిన్ క్లార్క్

 

10. భారతదేశంలో ఆంగ్లేయుల ఆర్థిక అధికారానికి పునాది వేసిన యుద్ధం ఏది?
జ‌: బక్సార్ యుద్ధం

 

11. కారన్ వాలీస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
జ‌: 1793

 

12. రైత్వారీ పద్ధతిని భారతదేశంలో తొలిసారిగా ఏ ప్రాంతంలో ప్రవేశ పెట్టారు?
జ‌: బారామల్

 

13. వాయవ్య భారతదేశంలో అమలు చేసిన భూమి శిస్తు విధానం ఏది?
జ‌: మహల్వారీ పద్ధతి

 

14. కింది అంశాలను జతపరచండి.
A) వేలం వేసే పద్ధతి        I) కారన్ వాలీస్
B) జమీందారీ పద్ధతి       II) థామస్ మన్రో
C) రైత్వారీ పద్ధతి           III) వారన్ హేస్టింగ్స్
D) మహల్వారీ పద్ధతి      IV) లార్డ్ హేస్టింగ్స్
జ‌: A-III, B-I, C-II, D-IV

 

15. పేష్కష్ అంటే ఏమిటి?
జ‌: జమీందారు చెల్లించే శిస్తు భాగం

 

16. కిందివాటిలో జమీందారు సొంతభూమి ఏది?
1) ఖుద్‌ఖాస్త్ 2) ఖలీసా 3) జమీ 4) మదద్-ఇ-మాష్
జ‌: 1 (ఖుద్‌ఖాస్త్ )

 

17. 'ఆంగ్లేయుల భూమి శిస్తు విధానాల వల్ల బెంగాల్ మూడో వంతు క్రూరమృగాలు సంచరించే అరణ్య సీమగా మారిపోయింది' అని వ్యాఖ్యానించింది ఎవరు?
జ‌: కారన్ వాలీస్

 

18. 'ఆంగ్లేయుల శిస్తు విధానాలు కంపెనీ సంక్షేమానికి తప్ప రైతాంగ సంక్షేమానికి దోహదపడలేదు' అని వ్యాఖ్యానించింది ఎవరు?
జ‌: కార్ల్ మార్క్స్

 

19. పశ్చిమ జమునా కాలువ పునరుద్ధరణ ద్వారా ఢిల్లీకి నీటి వసతి కల్పించిన ఆంగ్లేయుడు ఎవరు?
జ‌: లెఫ్టినెంట్ బ్లేక్

 

20. 1856 నాటి నీటిపారుదల శాఖ డైరక్టర్ జనరల్ ఎవరు?
జ‌: కల్నల్ బేర్ట్‌స్మిత్

 

21. 1847 - 52 మధ్య గోదావరిపై నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో కాటన్‌కు సాయపడిన ఆంధ్రుడు ఎవరు?
జ‌: వీనం వీరన్న

 

22. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించిన గవర్నర్ జనరల్ ఎవరు?
జ‌: డ‌ల్హౌసీ

 

23. వెయ్యి మైళ్ల పొడవైన కాలువలు తవ్వించి, పది లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చింది ఎవరు?
జ‌: రిప్పన్

 

24. 1854 - 55 లో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు?
జ‌: కెప్టెన్ ఓర్

 

25. సూయజ్ కాలువను తెరిచిన సంవత్సరం?
జ‌:1869

 

26. 1870 లో భారతదేశంలో ఆర్థిక వికేంద్రీకరణను ప్రవేశ పెట్టిన ఆంగ్లేయుడు ఎవరు?
జ‌: లార్డ్ మేయో

 

27. సర్ రిచర్డ్ స్ట్రాచీ క్షామ కమిషన్‌ను ఎవరు నియమించారు?
జ‌: లార్డ్ లిట్టన్

 

28. ఏ కమిటీ నివేదిక ప్రకారం భారతదేశంలో ఫామిన్ కోడ్ రూపొందింది?
జ‌: స్ట్రాచీ కమిషన్

 

29. కింది అంశాలను జతపరచండి.
A) కాంప్‌బెల్ క్షామ నివారణ సంఘం        I) సర్ లారెన్స్
B) రిచర్డ్ స్ట్రాచీ క్షామ నివారణ సంఘం      II) లార్డ్ లిట్టన్
C) మెక్ డొనాల్డ్ క్షామ నివారణ సంఘం    III) లార్డ్ కర్జన్
D) జేమ్స్ లయల్ క్షామ నివారణ సంఘం IV) రెండో ఎల్గిన్
జ‌: A-I, B-II, C-III, D-IV

 

30. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారత్‌లో తీవ్ర కరవు సంభవించిన ప్రాంతం ఏది?
జ‌: బెంగాల్‌

 

31. ఇంపీరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్‌ను స్థాపించిన ప్రాంతం?
జ‌: పూసా

 

32. అఖిల భారత ఆహార సమితిని స్థాపించాలని సూచించిన క్షామ కమిటీ ఏది?
జ‌: జాన్ హుడ్‌హెడ్ కమిటీ

 

33. 'ఆంగ్ల పాలననాటి భారత జనాభాలో 4 కోట్లమంది అర్ధాకలితో బతికేవారు' అని పేర్కొన్నది ఎవరు?
జ‌: విలియం హంటర్

 

34. 'స్వయం సంపూర్ణ గ్రామ కవచాన్ని ఉక్కు పట్టాలు తూట్లు పొడిచాయి. వాటి జీవరక్తం కారిపోయింది'. అని అన్నదెవరు?
జ‌: డి.హెచ్. బుకానన్

 

35. 'చేనేత వాళ్ల ఎముకలతో భారత మైదాన సీమలు తెల్లబారాయి' అని వ్యాఖ్యానించింది ఎవరు?
జ‌:విలియం బెంటింక్

 

36. 1853 లో భారతదేశంలో తొలి వస్త్ర మిల్లును ఎక్కడ నెలకొల్పారు?
జ‌: బొంబాయి

 

37. కింది అంశాలను జతపరచండి.
A) తొలి వస్త్ర మిల్లు                            I) 1853
B) తొలి జనపనార మిల్లు                   II) 1855
C) తొలి ఇనుము - ఉక్కు కర్మాగారం III) 1907
D) భారత్ బొగ్గుగనుల్లో పని ప్రారంభం IV) 1845
జ‌: A-I, B-II, C-III, D-IV

 

38. నీల్ దర్పణ్ అనే గ్రంథాన్ని/నాటకాన్ని రచించింది ఎవరు?
జ‌: దీనబంధుమిత్ర

Posted Date : 21-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌