• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - ఆర్థిక సంస్కరణలు

1. భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టడానికి మొదటగా చొరవ చూపిన ప్రధాని ఎవరు?
జ: రాజీవ్ గాంధీ

 

2. కిందివాటిలో 1990-91 నాటి భారత ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే సరైన అంశం ఏది?
1) కోశలోటు జీడీపీలో 7.8% నికి చేరింది.
2) భారత ప్రభుత్వ విదేశీ రుణం జీడీపీలో 23% నికి చేరింది.
3) కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 3.9% నికి చేరింది.
4) పైవన్నీ
జ: 4) పైవన్నీ

 

3. 1991 లో భారతదేశంలో ప్రకటించిన రావు-మన్మోహన్ నమూనా ఆర్థిక సంస్కరణల్లో లేని అంశం ఏది?
1) ప్రైవేటీకరణ 2) సరళీకరణ 3) వాణిజ్యీకరణ 4) ప్రపంచీకరణ
జ: సరళీకరణ

 

4. కిందివాటిలో మనదేశంలో అమలైన మొదటి తరం ఆర్థిక సంస్కరణల్లో లేని అంశం ఏది?
1) పారిశ్రామిక రంగ సంస్కరణలు 2) శ్రామిక రంగ సంస్కరణలు
3) విత్తరంగ సంస్కరణలు 4) ప్రభుత్వరంగ సంస్కరణలు
జ: శ్రామిక రంగ సంస్కరణలు

 

5. ఒక దేశం నుంచి మరొక దేశానికి వస్తుసేవలు, మూలధనం స్వేచ్ఛగా తరలడం అనేది కిందివాటిలో దేన్ని సూచిస్తుంది?
1) సరళీకరణ 2) ప్రైవేటీకరణ 3) ప్రపంచీకరణ 4) ప్రపంచ ఏకీకరణ
జ: ప్రపంచీకరణ

 

6. భారతదేశంలో అనుసరిస్తున్న నూతన ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఎవరిని అభివర్ణిస్తారు?
జ: మన్మోహన్ సింగ్

 

7. కిందివాటిలో సరికాని అంశం ఏది?
1) బ్యాంకింగ్ రంగ సంస్కరణలు - నరసింహం కమిటీ
2) పెట్టుబడుల ఉపసంహరణ సిఫారసు కమిటీ - సి. రంగరాజన్
3) బీమా రంగ సంస్కరణలు - మల్హోత్రా కమిటీ
4) పోటీ చట్టం - రాకేష్ మోహన్ కమిటీ
జ: పోటీ చట్టం - రాకేష్ మోహన్ కమిటీ

 

8. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి రిజర్వు చేసిన పరిశ్రమల సంఖ్య?
జ: 3

 

9. భారతదేశంలో ప్రస్తుత ఖాతాలో రూపాయి పూర్తి మార్పిడికి అనుమతించిన సంవత్సరం?
జ: 1994 ఆగస్టు

 

10. కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలో అతిపెద్ద అంశంగా పేర్కొనే అంశం ఏది?
1) సబ్సిడీలు 2)  వడ్డీ చెల్లింపులు 3) రక్షణ వ్యయం 4) రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లు
జ: వడ్డీ చెల్లింపులు

 

11. మనదేశంలో నూతన ఆర్థిక సంస్కరణల కాలంలో విదేశీ రంగానికి సంబంధించి అమలు చేసిన అంశంగా దేన్ని పరిగణిస్తారు?
1) టారిఫ్‌ను పెంచి విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరచడం.
2) ఎక్కువ అంశాలపై పరిమాణాత్మక ఆంక్షలు ఎత్తివేత.
3) వర్తక అంశాలపై పరిమాణాత్మక ఆంక్షలు విధింపు.
4) పైవన్నీ
జ: ఎక్కువ అంశాలపై పరిమాణాత్మక ఆంక్షలు ఎత్తివేత.

 

12. లోటు, రుణ నిర్వహణ అంశాలు ఏ విధానంలో భాగంగా ఉంటాయి?
జ: కోశ విధానం

 

13. భారతదేశంలో వివిధ రంగాలకు సంబంధించి చేసిన చట్టాలు, అవి అమలులోకి వచ్చిన సంవత్సరాల ఆధారంగా సరైన క్రమాన్ని గుర్తించండి.
1) FRBM, MRTP, FERA, FEMA 2) FERA, MRTP, FEMA, FRBM 3) MRTP, FERA, FEMA, FRBM 4) MRTP, FRBM, FERA, FEMA
జ: MRTP, FERA, FEMA, FRBM

 

14. కేంద్ర ప్రభుత్వం 'జాతీయ పెట్టుబడి నిధిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?
జ: 2005 నవంబరు

 

15. 2000-13 మధ్య కాలంలో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందిన రంగాలు వరుసగా .....
జ: సేవలు, నిర్మాణం, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ & సాఫ్ట్‌వేర్.

 

16. UNCTAD ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 2013-15 కాలంలో బహుళజాతి సంస్థలు పెట్టుబడి పెట్టడానికి భారతదేశాన్ని ప్రపంచంలో ఎన్నో ముఖ్యదేశంగా గుర్తించాయి?
జ: 3 వ

 

17. 2000-13 మధ్యకాలంలో ఏ దేశం నుంచి భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అత్యధికంగా వచ్చాయి?
జ: మారిషస్

 

18. కిందివాటిలో భారతదేశంలో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించిన రంగం ఏది?
1) బీమా 2) రక్షణ పరికరాల తయారీ 3) ఎయిర్‌పోర్టులు 4) స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు
జ: ఎయిర్‌పోర్టులు

 

19. 2016 ఫిబ్రవరి 5 నాటికి భారతదేశం వద్ద ఉన్న విదేశీమారక రిజర్వుల మొత్తం ఎంత?
జ: 351.5 బిలియన్ డాలర్లు

 

20. కేంద్ర గణాంక సంస్థ విడుదల చేసిన అంచనాల ప్రకారం 2015-16 లో భారత్‌లో నమోదైన వృద్ధి రేటు ఎంత? (స్థిర ధరల్లో మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి.)
జ: 7.6 శాతం

 

21. కిందివాటిలో ప్రపంచీకరణకు అవసరమైన నిబంధన ఏది?
1) వ్యాపార స్వేచ్ఛ 2) ప్రభుత్వ ప్రోత్సాహం 3) అవస్థాపన సౌకర్యాలు 4) పైవన్నీ
జ: పైవన్నీ

 

22. నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత మొత్తం పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా ఏ విధంగా ఉంది?
1) తగ్గుతోంది 2) పెరుగుతోంది 3) మొదట పెరిగి, తర్వాత తగ్గింది 4) స్థిరంగా ఉంది
జ: పెరుగుతోంది

 

23. సంస్కరణల తర్వాత అమలైన నూతన ఆర్థిక విధానంలో మనదేశం కిందివాటిలో దేనిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది?
1) దిగుమతి ప్రత్యామ్నాయాలపై 2) అంతర్గత వ్యాపారంపై 3) ఎగుమతులను ప్రోత్సహించడంపై 4) బ్యాంకింగ్ రంగంపై
జ: ఎగుమతులను ప్రోత్సహించడంపై

 

24. కింద పేర్కొన్న ఏయే సంవత్సరాల మధ్య భారతదేశంలో వర్తక శేషం అనుకూలంగా ఉంది?
1) 1972-73, 1976-77 2) 1971-72, 1976-77 3) 1972-73, 1975-76 4) 1973-74, 1976-77
జ: 1972-73, 1976-77

 

25. మూలధన ఖాతాలో రూపాయికి పూర్తి మార్పిడి కల్పించడానికి నియమించిన కమిటీ ఏది?
జ: తారాపోర్ కమిటీ

 

26. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి 'రెపో రేటు'ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
జ: 1992

 

27. ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం (FRBM చట్టం) ప్రకారం రెవెన్యూ, కోశలోటులను అంతిమంగా ఎంత శాతానికి పరిమితం చేయాలి?
జ: 0%, 3%

 

28. భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన పరిణామాల్లో సరైంది ఏది?
1) విదేశీ వ్యాపారంలో భారత్ వాటా పెరిగింది. 2) వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గాయి. 3) వృద్ధి రేటు పెరిగింది. 4) పైవన్నీ
జ: పైవన్నీ

 

29. 2016 సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన వ్యాపార అనుకూల సూచిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
జ: 130

 

30. 2014 నాటికి ప్రపంచ సేవల ఎగుమతుల్లో భారతదేశ సేవల ఎగుమతుల వాటా ఎంత శాతం?
జ: 3.2%

 

31. భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో విద్యపై కనీసం 6 శాతం నిధులు ఖర్చు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది?
జ: కొఠారీ కమిటీ

 

32. 1991-92 నుంచి 2014-15 నాటికి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సేకరించిన మొత్తం నిధులు ఎంత?
జ: రూ.1,79,625 కోట్లు

 

33. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు సంబంధించి కిందివాటిలో సరైన వ్యాఖ్య ఏది?
ఎ) సంస్కరణలకు ముందు వృద్ధిరేటు తక్కువగా, పేదరికం తగ్గుదల రేటు ఎక్కువగా ఉంది.
బి) సంస్కరణల తర్వాత వృద్ధిరేటు ఎక్కువగా, పేదరికం తగ్గుదల రేటు తక్కువగా ఉంది.
సి) సంస్కరణల తర్వాత ఆదాయ అసమానతలు తగ్గాయి.
డి) సంస్కరణల తర్వాత ఉపాధి వృద్ధిరేటు తగ్గింది.
1) ఎ, బి, సి, డి సరైనవి
2) ఎ, బి, డి మాత్రమే సరైనవి
3) ఎ, బి, సి మాత్రమే సరైనవి
4) ఎ, సి, డి మాత్రమే సరైనవి
జ: ఎ, బి, డి మాత్రమే సరైనవి

 

34. నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని కల్పించడాన్ని ఏమంటారు?
జ: సరళీకరణ

 

35. 1991 కి ముందు భారత ఆర్థిక వ్యవస్థ లక్షణం కానిది ఏది?
1) లైసెన్స్‌రాజ్ వ్యవస్థ ఎక్కువగా ఉంది.
2) ప్రభుత్వరంగం బలోపేతమవుతూ వచ్చింది.
3) విదేశీ పెట్టుబడులు స్వేచ్ఛగా తరలివచ్చేవి.
4) ప్రభుత్వ రంగ సంస్థలు అసమర్థతతో పని చేయడం.
జ: విదేశీ పెట్టుబడులు స్వేచ్ఛగా తరలివచ్చేవి.

 

36. "The Age of Discontinuity" అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
జ: పీటర్ డ్రక్కర్

 

37. 2016-17 కేంద్ర బడ్జెట్‌లో అంచనా వేసిన విత్త లోటు (జీడీపీలో) ఎంత శాతం?
జ: 3.5 శాతం

 

38. 2014 నాటికి ప్రపంచంలోని వస్తుసేవల మొత్తం ఎగుమతుల్లో భారత్ వాటా ఎంత?
జ: 1.7%

 

39. 2014-15 లో స్థూల దేశీయోత్పత్తిలో వాస్తవంగా నమోదైన రెవెన్యూ లోటు ఎంత శాతం?
జ: 2.9%

 

40. 2016-17 కేంద్ర బడ్జెట్‌లో రెవెన్యూ లోటు అంచనా ఎంత శాతం?
జ: 2.3 శాతం

Posted Date : 23-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌