• facebook
  • whatsapp
  • telegram

హైకోర్టు

మాదిరి ప్రశ్నలు
 

1. అండమాన్, నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి?
ఎ) చెన్నై బి) కోల్‌కతా సి) ఒడిశా డి) గువహటి
జ: (బి)

 

2. కిందివాటిలో ఉమ్మడి హైకోర్టు ఏది?
ఎ) కర్ణాటక బి) రాజస్థాన్ సి) మధ్యప్రదేశ్ డి) పంజాబ్, హరియాణా
జ: (డి)

 

3. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న హైకోర్టుల సంఖ్య ఎంత?
ఎ) 18 బి) 24 సి) 21 డి) 23
జ: (బి)

 

4. హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు?
ఎ) రాష్ట్రపతి బి) ప్రధానమంత్రి సి) సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి డి) ఉపరాష్ట్రపతి
జ: (ఎ)

 

5. హైకోర్టు న్యాయమూర్తుల పదవీవిరమణ వయసు ఎంత?
ఎ) 60 బి) 62 సి) 65 డి) 70
జ: (బి)

 

6. హైకోర్టు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు?
ఎ) గవర్నరు బి) రాష్ట్రపతి సి) స్పీకరు డి) ముఖ్యమంత్రి
జ: (ఎ)

 

7. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత జీతం ఎంత?
ఎ) రూ.1,00,000 బి) రూ.1,50,000 సి) రూ.90,000 డి) రూ.80,000
జ: (సి)

 

8. రిట్లను ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టులు జారీ చేస్తాయి?
ఎ) 32 బి) 226 సి) 228 డి) 326
జ: (బి)

 

9. నిర్బంధించిన వ్యక్తిని న్యాయస్థానంలో హాజరు పరచమని జారీచేసే రిట్ ఏది?
ఎ) మాండమస్ బి) కో వారెంటో సి) హెబియస్ కార్పస్ డి) సెర్షియోరారి
జ: (సి)

 

10. ఒక ప్రభుత్వ అధికారిని తన విధిని నిర్వర్తించమని న్యాయస్థానం జారీచేసే ఆదేశం ఏది?
ఎ) ప్రొహిబిషన్ బి) మాండమస్ సి) కో వారెంటో డి) సెర్షియోరారి
జ: (బి)

 

11. హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏమిటి?
ఎ) వ్యక్తి శరీరాన్ని ప్రవేశపెట్టడం బి) ఆజ్ఞాపించడం సి) ధ్రువీకరించడం డి) నిషేధించడం
జ: (ఎ)

 

12. రాజ్యాంగ విరుద్ధంగా ఉండే చట్టాలు చెల్లవని న్యాయస్థానాలు ప్రకటించే అధికారం ఏది?
ఎ) న్యాయపరిశీలన బి) సమన్యాయం సి) న్యాయసమీక్ష డి) కోర్ట్ ఆఫ్ రికార్డు
జ: (సి)
 

Posted Date : 14-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌