• facebook
  • whatsapp
  • telegram

శాసన నిర్మాణ శాఖ

మాదిరి ప్రశ్నలు

 

1. రాష్ట్ర శాసనమండలిని ఎవరు రద్దు చేయవచ్చు?

ఎ) గవర్నర్ బి) ముఖ్యమంత్రి సి) రాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల ఆమోదం, పార్లమెంటు ఆమోదం డి) రాష్ట్రపతి
జ: (సి)

 

2. కిందివాటిలో శాసనమండలి లేని రాష్ట్రం ఏది?
ఎ) రాజస్థాన్ బి) మహారాష్ట్ర సి) కర్ణాటక డి) బిహార్
జ: (ఎ)

 

3. రాష్ట్ర శాసనశాఖ అంటే ఏది?
ఎ) విధాన సభ బి) విధాన పరిషత్ సి) విధాన సభ + విధాన పరిషత్ డి) గవర్నర్ + విధాన సభ + విధాన పరిషత్
జ: (డి)

 

4. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఏకసభా విధానం అమల్లో ఉంది?
ఎ) 20 బి) 21 సి) 22 డి) 29
జ: (సి)

 

5. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ద్విసభా విధానం అమల్లో ఉంది?
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8
జ: (సి)

 

6. తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య ఎంత?
ఎ) 116 బి) 117 సి) 118 డి) 119
జ: (డి)

 

7. రాష్ట్ర శాసనశాఖ ఏ అంశాలపై చట్టాలు చేయవచ్చు?
ఎ) కేంద్ర జాబితా బి) రాష్ట్ర జాబితా సి) ఉమ్మడి జాబితా డి) రాష్ట్ర జాబితా + ఉమ్మడి జాబితా
జ: (డి)

 

8. రాష్ట్ర శాసనశాఖలో సభ్యుల సంఖ్య ఎంతకు మించరాదు?
ఎ) 400 బి) 200 సి) 500 డి) 600
జ: (సి)

 

9. రాష్ట్ర విధానసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) ఎంతమందిని విధాన పరిషత్‌కు ఎన్నుకుంటారు?
ఎ) 1/4వ వంతు బి) 1/3వ వంతు సి) 1/12వ వంతు డి) 1/6వ వంతు
జ: (బి)

 

10. ఆర్థిక బిల్లులను మొదట ఎక్కడ ప్రవేశపెట్టాలి?
ఎ) విధానపరిషత్‌లో మాత్రమే బి) విధానసభ లేదా విధానపరిషత్ సి) ఏదీకాదు డి) విధానసభలో మాత్రమే
జ: (డి)

 

11. గవర్నర్ ఎంతమంది ఆంగ్లో-ఇండియన్‌లను విధాన సభకు నామినేట్ చేస్తారు?
ఎ) 1 బి) 2 సి) 1/6వ వంతు డి) 1/12వ వంతు
జ: (ఎ)

 

12. విధానపరిషత్ సభ్యుల పదవీ కాలం ఎన్నేళ్లు?
ఎ) 5 బి) 6 సి) 7 డి) చెప్పలేం
జ: (బి)

 

13. ఒక బిల్లు ఆర్థిక బిల్లా, సాధారణ బిల్లా అని నిర్ధారించే అధికారం ఎవరికి ఉంది?
ఎ) గవర్నర్ బి) ముఖ్యమంత్రి సి) స్పీకర్ డి) ఛైర్మన్
జ: (సి)

 

14. గవర్నర్ విధాన పరిషత్‌కు ఎంత మందిని నామినేట్ చేస్తారు?
ఎ) 1/2వ వంతు బి) 1/6వ వంతు సి) 1/12వ వంతు డి) 1/4వ వంతు
జ: (బి)

 

15. విధానసభ ఒక సమావేశానికి, మరో సమావేశానికి మధ్య వ్యవధి ఎన్ని నెలలకు మించరాదు?
ఎ) 3 బి) 6 సి) 4 డి) 8
జ: (బి)

 

16. విధాన పరిషత్ ఆర్థిక బిల్లులను ఎంతకాలం లోపల ఆమోదించాలి?
ఎ) 7 రోజులు బి) 14 రోజులు సి) 24 రోజులు డి) 28 రోజులు
జ: (బి)

 

17. ఉమ్మడి జాబితాలోని అంశంపై కేంద్రం, రాష్ట్రం రెండూ చట్టం చేసినప్పుడు, కేంద్రం చట్టానికి రాష్ట్ర చట్టం వ్యతిరేకంగా ఉంటే ఏ చట్టం చెల్లుబాటు అవుతుంది?
ఎ) రాష్ట్ర చట్టం బి) కేంద్ర చట్టం సి) రెండూ డి) ఏదీకాదు
జ: (బి)

Posted Date : 14-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌