• facebook
  • whatsapp
  • telegram

సుప్రీంకోర్టు

మాదిరి ప్రశ్నలు

 

1. భారతదేశంలో ఏ చట్టం ద్వారా ఫెడరల్‌కోర్టును ఏర్పాటు చేశారు?
జ: 1935

 

2. సుప్రీంకోర్టు ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
జ: 1950, జనవరి 28

 

3. భారత్‌దేశంలో ఎలాంటి న్యాయవ్యవస్థ అమల్లో ఉంది?
జ: ఏకీకృత స్వతంత్ర న్యాయవ్యవస్థ

 

4. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
జ: 1 + 7

 

5. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
జ: 1 + 30

 

6. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవ్వడానికి కావాల్సిన కనిష్ఠ వయసు ఎన్నేళ్లు?
జ: నిర్ధారించలేదు

 

7. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయసు ఎంత?
జ: 65 సంవత్సరాలు

 

8. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత జీతం ఎంత?
జ: రూ. లక్ష

 

9. రెండు రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను విచారించే అధికారం ఎవరికి ఉంటుంది?
జ: సుప్రీంకోర్టు

 

10. రిట్లను జారీచేసే అధికారం సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ అధికార పరిధిలోకి వస్తుంది?
జ: స్వతస్సిద్ధ

 

11. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వివాదాలు పరిష్కరించేది ఎవరు?
జ: సుప్రీంకోర్టు

 

12. భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టును సలహా కోరవచ్చు?
జ: 143

 

13. భారత పార్లమెంట్ రూపొందించిన చట్టం రాజ్యాంగ బద్ధంగా ఉందా లేదా అని చెప్పే అధికారం ఎవరికి ఉంది?
జ: సుప్రీంకోర్టు

 

14. భారత రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్యాత ఎవరు?
జ: సుప్రీంకోర్టు

 

15. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రింకోర్టు ఏ ప్రకరణ (ఆర్టికల్) ప్రకారం రిట్లను జారీ చేస్తుంది?
జ: 32

 

16. భారతదేశ మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
జ: హెచ్‌జే కానియా

Posted Date : 16-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌