• facebook
  • whatsapp
  • telegram

స్థానిక స్వపరిపాలనా సంస్థలు

మాదిరి ప్రశ్నలు

1. జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని (NESS) ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1953
 

2. స్థానిక ప్రభుత్వాలు ఏ జాబితాలో ఉంటాయి?
జ: రాష్ట్ర జాబితా
 

3. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎక్కడ ఏర్పాటుచేశారు?
జ: మద్రాసు
 

4. స్థానిక సంస్థలకు సంబంధించిన మొదటి తీర్మానం?
జ: మేయో తీర్మానం
 

5. స్థానిక స్వపరిపాలనను ఒక రాష్ట్ర అంశంగా ఏ చట్టంలో ప్రకటించారు?
జ: భారత ప్రభుత్వ చట్టం - 1935
 

6. కిందివాటిని జతపరచండి.
1) సామాజిక అభివృద్ధి పథకం                ఎ) 1959, అక్టోబరు 2

2) జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం         బి) 1993, ఏప్రిల్ 24

3) పంచాయతీ రాజ్ వ్యవస్థ                  సి) 1952, అక్టోబరు 2

4) నూతన పంచాయతీ రాజ్ వ్యవస్థ           డి) 1953, అక్టోబరు 2

జ: 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
 

7. కిందివాటిలో పంచాయతీ రాజ్ వ్యవస్థ వర్తించని రాష్ట్రం?
1) కేరళ          2) అసోం          3) నాగాలాండ్        4) త్రిపుర
జ: 3 (నాగాలాండ్)
 

8. పంచాయతీ రాజ్ సంస్థలకు ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసిన కమిటీ?
జ: బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ
 

9. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన గ్రామ పంచాయతీల ఏర్పాటును సూచిస్తుంది?
జ: 40వ ప్రకరణ
 

10. మన రాష్ట్రంలో అమల్లో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ
జ: గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్

 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? (గ్రూప్ 4, 1996)
జ: పంచాయతీలు
 

2. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ చేసిన సిఫారసు? (గ్రూప్ 4, 1998)
జ: గ్రామ పంచాయతీలను సృష్టించడం
 

3. భారత స్థానిక స్వపరిపాలనా పితామహుడు (వీఆర్‌వో, 2014)
జ: లార్డ్ రిప్పన్
 

4. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించారు? (వీఆర్‌వో, 2014)
జ: 73వ
 

5. పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో ఉన్న అంశాలపై కార్యక్రమాలు చేపట్టే అధికారం ఉంటుంది. అయితే కిందివాటిలో దీనిలో భాగం కానిది? (గ్రూప్ 2, 2016 టీఎస్‌పీఎస్సీ)
జ: అగ్నిమాపక సేవలు
 

6. భారత్‌లో మొదటిసారి పంచాయతీ రాజ్ సంస్థలను ఎప్పుడు ప్రారంభించారు? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: 1959, అక్టోబరు 2
 

7. అశోక్ మెహతా కమిటీ కిందివాటిలో దేన్ని సిఫారసు చేసింది? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: రెండంచెల వ్యవస్థ
 

8. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో ఎన్ని విషయాలను తెలియజేశారు? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: 29
 

9. సాముదాయక అభివృద్ధి కార్యక్రమ అధ్యయనం కోసం నియమించిన కమిటీ? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ
 

10. స్వతంత్ర భారతదేశంలో సాముదాయక అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించినవారు? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: ఎస్.కె. డే

Posted Date : 16-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌