• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులు - ప్రాథమిక విధులు - ఆదేశ సూత్రాలు

1. లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, సీఏజీ మొదలైనవారి వేతనాల గురించి ఏ షెడ్యూల్‌లో చేర్చారు?
జ: రెండో షెడ్యూల్
 

2. రాజ్యాంగం రెండో భాగంలో 5 నుంచి 11 నిబంధనలు ఏ విషయానికి సంబంధించినవి?
జ: పౌరసత్వం
 

3. ఏ కారణంగా అయినా అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే, ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దవుతాయి. అప్పుడు కూడా రద్దుకాని నిబంధనలు ఏవి?
జ: 20, 21
 

4. కిందివాటిలో ఏది సత్యం?
1) ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు.
2) ఆస్తి హక్కును 12వ షెడ్యూల్ 300(ఎ) నిబంధనలో చేర్చారు.
జ: 1, 2  సత్యం

 

5. రాజ్యాంగ పరిహార హక్కు రాజ్యాంగంలోని ఏ నిబంధనలో ఉంది?
జ: 32వ
 

6. కార్యనిర్వహణ శాఖను శాసన నిర్మాణ శాఖ నియంత్రించే ప్రభుత్వ విధానాన్ని ఏమంటారు?
జ: పార్లమెంటరీ విధానం
 

7. 'అంటరానితనం నేరం' అని ఎన్నో నిబంధన సూచిస్తుంది?
జ: 17వ
 

8. జీవించే హక్కు ఏ నిబంధన ద్వారా లభిస్తుంది?
జ: 21వ
 

9. కిందివాటిని సరైన వాటితో జతచేయండి.
1. మత స్వాతంత్య్రపు హక్కు                        A) నిబంధన 19 నుంచి 22 వరకు
2. సమానత్వపు హక్కు                               B) నిబంధన 25 నుంచి 28 వరకు
3. స్వాతంత్య్రపు హక్కు                                C) నిబంధన 23, 24
4. పీడనాన్ని నిరోధించే హక్కు                      D) నిబంధన 14 నుంచి 18 వరకు
జ: 1-B, 2-D, 3-A, 4-C

 

10. ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు? ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: 1989లో, 1990, జనవరి 30
 

11. ఓబీసీలకు ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశం కోసం రిజర్వేషన్లు కల్పించడానికి ఆర్టికల్ 15(5) లో ఏ సవరణను, ఏ సంవత్సరంలో చేర్చారు?
జ: 93వ సవరణ - 2005
 

12. కిందివాటిలో ఏది సత్యం?
i) ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి
ii) ప్రాథమిక హక్కులకు కొన్ని పరిమితులుంటాయి
జ: ii మాత్రమే సత్యం
 

13. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఏ నిబంధన సూచిస్తుంది?
జ: 16వ
 

14. కిందివాటిలో ఆర్టికల్ 13 కి సంబంధంలేని అంశాన్ని గుర్తించండి.
ఎ) ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి.
బి) రాజ్యాంగం అమల్లోకి రాకముందు చేసిన చట్టాలు ప్రస్తుతం ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్త్లెతే అవి చెల్లవు.
సి) రాష్ట్రపతి, గవర్నర్లు చేసిన ఆర్డినెన్సులు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే అవి చెల్లవు.
డి) శాసన నిర్మాణ శాఖ చేసిన శాసనాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా ఉంటే అవి చెల్లవు.
జ: ఎ(ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి.)

 

15. కిందివారిలో కేంద్ర కార్యనిర్వహణ శాఖలో సభ్యులు కానివారెవరు?
ఎ) ప్రధాని     బి) రాష్ట్రపతి     సి) ఉప రాష్ట్రపతి     డి) లోక్‌సభ స్పీకర్
జ: డి (లోక్‌సభ స్పీకర్)
 

16. ఓబీసీలకు ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్లకు సంబంధించి అశోక్‌కుమార్ ఠాకూర్  Vs భారత ప్రభుత్వం కేసులో రిజర్వేషన్‌లు సమంజసమే అనే తీర్పు ఏ సంవత్సరంలో వెలువడింది?
జ: 2008
 

17. కిందివాటిలో భారతదేశంలోని ప్రభుత్వ విధానానికి సంబంధించని అంశం ఏది?
ఎ) గణతంత్ర విధానం                                     బి) ద్వంద్వ శాసనసభా విధానం
సి) పార్లమెంటరీ విధానం                                డి) రాజ్యాధినేత ప్రభుత్వాధినేత ఒక్కరే
జ: డి (రాజ్యాధినేత ప్రభుత్వాధినేత ఒక్కరే)
 

18. జమ్మూ కశ్మీర్‌కు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎప్పటి నుంచి వర్తించాయి?
జ: 1954, మే 14
 

19. ఏ నిబంధన ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధను నిషేధిస్తుంది?
జ: 28వ

 

20. ఏ రోజున ప్రాథమిక విధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు?
జ: జనవరి 3
 

21. 'ఆదేశ సూత్రాలు శాసన వ్యవస్థకు కరదీపిక లాంటివి' అన్నదెవరు?
జ: సెతల్వాడ్
 

22. ఏ ప్రధాని పరిపాలనా కాలంలో ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు?

జ: ఇందిరాగాంధీ

 

23. మౌనంగా ఉండే హక్కు కూడా వ్యక్తికి ఉందని ఏ నిబంధన తెలుపుతుంది?
జ: 19(2) (బి)
 

24. 'మరణశిక్షను విధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి రాదు' అని ఏ కేసులో తీర్పు చెప్పారు?
జ: బచన్‌సింగ్ Vs పంజాబ్
 

25. ఆర్టికల్ 19(1)(d) సంచార స్వేచ్ఛకు ఏ రాష్ట్రాల్లో పరిమితులు ఉన్నాయి?
ఎ) జమ్మూ కశ్మీర్                                                               బి) ఈశాన్య రాష్ట్రాలు
సి) ఉగ్రవాదం/ అంటువ్యాధులు వ్యాపించిన చోట                     డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

 

26. 'సమ్మె హక్కు ప్రాథమిక హక్కు కాదు' అని ఏ కేసులో తీర్పు వెలువడింది?
జ: ఆర్.కె. రంగరాజన్ Vs తమిళనాడు
 

27. కింది అంశాలను సరిగా జతచేయండి.
1) పర్యావరణ పరిరక్షణ                                                     A) ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక హక్కు
2) 1993 ఉన్ని కృష్ణన్ Vs ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం                 B) ఉన్నతవిద్య ప్రాథమిక హక్కు
3) ప్రాథమిక విద్య, ప్రాథమిక హక్కు                                   C) ఆర్టికల్ 48(A)
4) 1992 మోహన్‌జైన్ Vs కర్ణాటక ప్రభుత్వం                       D) 2010, ఏప్రిల్ 1
జ: 1-C, 2-A, 3-D, 4-B
 

28. 'ఆదేశ సూత్రాలన్నీ అమలైతే భారతదేశం భూతల స్వర్గమవుతుంది' అన్నదెవరు?
జ: ఎం.పి.చాంగ్ల
 

29. బాల కార్మిక వ్యవస్థను నిషేధించే నిబంధన ఏది?
జ: 24
 

30. కిందివాటిలో ఏది సత్యం?
1) ప్రాథమిక హక్కులు న్యాయ సమ్మతమైనవి
2) ఆదేశ సూత్రాలు న్యాయ సమ్మతమైనవి కావు
జ: 1, 2  సత్యం

 

31. టాడా (TADA)చట్టాన్ని ఎప్పుడు చేశారు?
జ: 1985
 

32. ఆదేశ సూత్రాలను - సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాలు అని మూడు రకాలుగా విభజించిందెవరు?
జ: ఎం.పి.శర్మ
 

33. మహిళలకు ప్రసూతి సౌకర్యాలు (మెటర్నటీ లీవులు) కల్పించాలని సూచించే నిబంధన ఏది?
జ: 42వ
 

34. రాజ్యాంగ పరిహార హక్కును ఆత్మరక్షణ హక్కుగా అభివర్ణించిందెవరు?
జ: బి.ఆర్. అంబేడ్కర్
 

35. సైనిక న్యాయం 'మార్షల్ లా'ను ఏ నిబంధన సూచిస్తుంది?
జ: 34 నిబంధన
 

36. '6 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలకు ప్రాథమిక విద్య కల్పించడం తల్లిదండ్రుల విధి' అనే అంశాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో ప్రాథమిక విధుల్లో చేర్చారు?
జ: 86 సవరణ, 2002
 

37. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని ఏ నిబంధన సూచిస్తోంది?
జ: 39(A) నిబంధన

 

38. ఒక దిగువ కోర్టు తన పరిధిలోకి రాని అంశంపై విచారణ జరుపుతున్నప్పుడు దాన్ని నిలుపు చేయమని హైకోర్టు ఇచ్చే ఉత్తర్వును ఏమంటారు?
జ: కోవారంటో
 

39. ఒక కోర్టు తన పరిధిలోకి రాని అంశంపై విచారణ జరిపి, తీర్పు చెప్పినట్లయితే ఆ తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చే ఉత్తర్వును ఏమంటారు?
జ: సెర్షియోరరి
 

40. 'ఆరేళ్లలోపు పిల్లలకు విద్య, పౌష్టికాహారం అందించాలి' అని సూచించే నిబంధన ఏది?
జ: 45వ
 

41. 'ఆరేళ్ల నుంచి పద్నాలుగేళ్లలోపు బాలబాలికలకు ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు' అని ఏ నిబంధన సూచిస్తుంది?
జ: 21 (A)
 

42. 'ఆర్టికల్ 18 సమానత్వానికి అనుకూలమే, ప్రతికూలం కాదు' అని ఏ సంవత్సరం, ఏ కేసులో తీర్పు వెలువడింది?
జ: 1996 - బాలాజీ రాఘవన్ కేసు
 

43. కిందివాటిలో భారత రాజ్యాంగానికి విరుద్ధమైన (నిషేధించిన) అంశాన్ని గుర్తించండి.
ఎ) ఏదైనా రంగంలో విశిష్ట కృషికి భారతరత్న లాంటి అవార్డు ఇవ్వడం
బి) భారత పౌరులు విదేశీ బిరుదులు స్వీకరించడానికి రాష్ట్రపతి పూర్వ అనుమతి తీసుకోవడం
సి) పౌరులకు, విదేశీయులకు బిరుదులివ్వడం
డి)భారత ప్రభుత్వ ఉద్యోగాల్లోని విదేశీయులు విదేశీ బిరుదులు స్వీకరించడానికి రాష్ట్రపతి పూర్వ అనుమతి తీసుకోవడం
జ: సి (పౌరులకు, విదేశీయులకు బిరుదులివ్వడం)

 

44. గోవధ నిషేధానికి చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఏది?
జ: బిహార్
 

45. ప్రపంచంలో మొదట ఏ దేశ రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలను చేర్చారు?
జ: స్పెయిన్
 

46. ఉపాధి హామీ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
జ: 2005

Posted Date : 16-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌