• facebook
  • whatsapp
  • telegram

ప్రదర్శన కళారూపాలు

మాదిరి ప్రశ్నలు

 

1. 'పేరిణీ' నృత్యకళా సంప్రదాయాన్ని పునరుద్ధరించిన నాట్యకారుడు ఎవరు?
జ: నటరాజ రామకృష్ణ
 

2. భామా కలాపం/గొల్ల కలాపం రూపకాలకు మాతృక?
జ: కూచిపూడి
 

3. పాండవుల వారసులుగా ప్రసిద్ధిగాంచిన గోండులు ప్రదర్శించే నృత్య రూపం?
జ: దండారియా నృత్యం
 

4. 'సింధీలు' అనే తెగ ఆచరించే నృత్యరీతి?
జ: ఢమాల్ నృత్యం
 

5. 'రాస్‌లీలా'ను పోలిన గిరిజన నృత్యం?
జ: మాధురీ నృత్యం
 

6. తెలంగాణలో దసరా, పీర్ల పండగ సందర్భాల్లో ప్రదర్శించే నృత్య రూపం?
జ: పులి వేషం

 

7. 'కాముని ఆట' నృత్య కళారూపంలో మిళితమైన మరో నృత్య విశేషం?
జ: కోలాటం
 

8. 'కోలాటం' అనే నృత్య కళారూపం ఏ రాష్ట్రంలో ఆవిర్భవించిందని భావిస్తున్నారు?
జ: తమిళనాడు
 

9. 'తోలుబొమ్మలాట'లో దుష్ట పాత్రలకు ఏ జంతువు చర్మాన్ని ఉపయోగిస్తారు?
జ: మేక చర్మం
 

10. 'బుట్టబొమ్మలాట'లోని బొమ్మలను దేంతో తయారు చేస్తారు?
జ: పేడ
 

11. పనీ పాట లేకుండా గాలి తిరుగుడు తిరిగేవారిని ఏమంటారు?
జ: సోలిగాడు
 

12. పగటి వేషాలు/వేషగాళ్లకు మరో పేరు?
జ: బహురూపులు
 

13. 'ఆకాశంలో అప్సరసల్లా ఆడుతున్నారంటూ' పాల్కురికి సోమన తన రచనల్లో ఎవరిని ప్రస్తావించాడు?
జ: దొమ్మరిసానులు
 

14. బ్రాహ్మణులను మాత్రమే యాచించి, ఇంద్రజాలం లాంటి ప్రదర్శనలు చేసేవారు?
జ: విప్రవినోదులు

 

15. పద్మశాలీలను మాత్రమే యాచించి ప్రదర్శనలను ఇచ్చేవారు?
జ: సాధనాశూరులు
 

తెలంగాణ కళలపై గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

 

1. తెలంగాణలో విస్తృతంగా ప్రదర్శించే యక్షగానం యొక్క మరో రూపం?  (AMVI Exam-2015)
జ: చిందు భాగవతం
 

2. 'జమిడిక' అనేది దేనికి సంబంధించింది?  (AMVI Exam-2015)
జ: వాయిద్య పరికరం
 

3. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కె.లక్ష్మాగౌడ్ ఏ రంగానికి చెందినవారు? (Tecnician, Gr-II)
జ: చిత్రలేఖనం
 

4. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ దేనికి ప్రసిద్ధి చెందింది? (Technician, Gr-II)
జ: హస్తకళలు, చిత్రలేఖనం
 

5. బతుకమ్మ సంబురాల్లోని మొదటి రోజును ఏమంటారు? (Managers HMWSSB-2015)
జ: ఎంగిలిపూలు
 

6. కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం?  (AEE, 2015)
జ: పేరిణీ నృత్యం

 

7. బతుకమ్మలో ప్రధానంగా ఏ పువ్వును ఉపయోగిస్తారు? (AEE, 2015)
జ: గునుగు
 

8. 'రంగం' అనే భవిష్యవాణి దేంతో ముడిపడి ఉంది? (AEE, 2015)
జ: సికింద్రాబాద్ బోనాలు
 

9. 'బాలసంతులు' ఒక (AEE, 2015)
జ: కుల సమూహం
 

10. బతుకమ్మ చివరి రోజును ఏమంటారు? (AEE, 2015)
జ: సద్దుల బతుకమ్మ
 

11. 'గుస్సాడీ' నాట్యం తెలంగాణలోని ఏ జిల్లాలో ప్రాచుర్యంలో ఉంది? (AFA Exam)
జ: ఆదిలాబాద్
 

12. ప్రసిద్ధ ఒగ్గుకథ కళాకారుడు/కళాకారిణి పేరు? (AFA Exam)
జ: చుక్క సత్తయ్య

Posted Date : 12-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు