• facebook
  • whatsapp
  • telegram

విద్యుత్

1. విద్యుదయస్కాంతాన్ని దేనితో తయారు చేస్తారు?
జ‌: మెత్తటి ఇనుము


2. ప్రాథమిక ఘటానికి సంబంధించి సరైంది ఏది?
     ఎ) ధనావేశం జింక్ ఎలక్ట్రోడ్‌కు చేరుతుంది
     బి) రుణావేశం రాగి ఎలక్ట్రోడ్‌కు చేరుతుంది
     సి) రుణావేశం జింక్ ఎలక్ట్రోడ్‌ను చేరుతుంది
     డి) ధనావేశం రాగి ఎలక్ట్రోడ్‌ను, రుణావేశం జింక్ ఎలక్ట్రోడ్‌ను చేరతాయి.

జ‌: డి(ధనావేశం రాగి ఎలక్ట్రోడ్‌ను, రుణావేశం జింక్ ఎలక్ట్రోడ్‌ను చేరతాయి)
 

3. ప్రాథమిక ఘటంలో ఏం జరుగుతుంది?
     ఎ) విద్యుచ్ఛక్తి రసాయనిక శక్తిగా మారుతుంది
     బి) రసాయనశక్తి విద్యుచ్ఛక్తిగా మారుతుంది
     సి) విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది
     డి) రసాయనశక్తి ఉత్పత్తి అవుతుంది

జ‌: బి(రసాయనశక్తి విద్యుచ్ఛక్తిగా మారుతుంది)

 

4. విద్యుత్ ఎలా ప్రవహిస్తుంది?
జ‌: ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్‌కు
 

5. భూమి పొటెన్షియల్ ఎంత?
జ‌: 0 V
 

6. కరెంట్‌కు ప్రమాణం ఏమిటి?
జ‌: ఆంపియర్
 

7. కిందివాటిలో అవాహకానికి ఉదాహరణ ఏది?
     ఎ) మానవచర్మం      బి) లోహాలు       సి) రబ్బర్      డి) ఏదీకాదు

జ‌: సి(రబ్బర్)
 

8. 1 కూలూంబ్ విలువ ఎంత?
జ‌: 6.24 × 1018 ఎలక్ట్రాన్లు/ సెకన్

Posted Date : 14-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌