• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగ లక్షణాలు ప్రాథమిక హక్కులు - నిర్దేశక నియమాలు ప్రాథమిక విధులు

1. భారత రాజ్యాంగంలోని సంఖ్యాయుత ప్రకరణలెన్ని? మొత్తం ప్రకరణలెన్ని?
జ‌: 395 - 468
 

2. 1975లో 36 వ రాజ్యాంగ సవరణ ద్వారా 22వ రాష్ట్రంగా ఏర్పాటుచేసిన రాష్ట్రం ఏది?
జ‌: సిక్కిం
 

3. రాజ్యాంగంలోని 15 వ విభాగం ఏ అంశానికి సంబంధించింది?
జ‌: ఎన్నికలు
 

4. కిందివాటిలో ఏది సత్యం?
     1. రాజ్యాంగం 7 వ భాగంలో ABC రాష్ట్రాల గురించి పేర్కొన్నారు
     2. 1956లో 7 వ రాజ్యాంగ సవరణ ద్వారా, 7 వ భాగాన్ని తొలగించారు
జ‌: రెండూ సత్యం

 

5. దేశంలో ఏదైనా ప్రాంతాన్ని గిరిజన ప్రాంతంగా ఏర్పాటుచేయడానికి, ఉన్నదాన్ని తొలగించడానికి ఉత్తర్వులు జారీచేసే అధికారం ఎవరికి ఉంటుంది?
జ‌: రాష్ట్రపతి
 

6. కిందివాటిలో గణతంత్ర రాజ్యానికి విరుద్ధమైందేది?
     1. ప్రభుత్వ పదవులన్నీ ఎన్నికల ద్వారా భర్తీచేయడం
     2. అన్ని ఎన్నికల్లో పోటీచేసే అధికారం పౌరులందరికీ ఉండటం
     3. రాజ్యాధినేత పదవిని కూడా ఎన్నికల ద్వారా భర్తీ చేయడం
     4. రాజ్యాధినేతను వంశపారంపర్యంగా నియమించడం
జ‌: 2
 

7. ట్రైబ్యునళ్ల ఏర్పాటును రాజ్యాంగంలోని ఏ భాగంలో సూచించారు?
జ‌: 14 (ఎ)
 

8. కిందివాటిలో ఏది సత్యం?
   1. దేశంలో 1952 లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగేవరకు తాత్కాలిక పార్లమెంటుగా రాజ్యాంగ పరిషత్ వ్యవహరించింది.
     2. ఈ తాత్కాలిక పార్లమెంటుకు స్పీకర్‌గా జి.వి. మౌలాంకర్ వ్యవహరించారు.
జ‌: 1, 2 రెండూ సత్యం

 

9. రాజ్యాంగంలో ఉన్న 22 భాగాల్లో కింది 4 భాగాల్లో ఏ అంశం గురించి వివరించారో జతపరచండి.
    1) 8 వ భాగం           A) మున్సిపాలిటీలు
    2) 9 వ భాగం           B) కేంద్ర రాష్ట్ర సంబంధాలు
    3) 9 (ఎ) భాగం        C) కేంద్రపాలిత ప్రాంతాలు
    4) 11 వ భాగం          D) పంచాయతీలు
జ‌: 1-C, 2-D, 3-A, 4-B
 

10. భాషాపరంగా అల్ప సంఖ్యాక వర్గాలవారి పిల్లలకు మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధనకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించే నిబంధన ఏది?
జ‌: 350 (ఎ)
 

11. హిందీని రాజ్యభాషగా గుర్తించి, ఆ భాషాభివృద్ధి, వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వం కృషిచేయాలని సూచించిన నిబంధన ఏది? అది ఏ విభాగంలో ఉంది?
జ‌: 351 నిబంధన - XVII భాగం
 

12. 'ఆదేశ సూత్రాల అమలు ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడినట్లు ప్రాథమిక విధులు పాటించడం ప్రజల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది' అని అన్నదెవరు?
జ‌: డి.డి.బసు

 

13. మత్తు పానీయాలు, పదార్థాలను నిషేధించి, ప్రజారోగ్యాన్ని కాపాడాలని సూచించే నిబంధన ఏది?
జ‌: 47 వ నిబంధన
 

14. మత్తు పానీయాలను నిషేధించిన రాష్ట్రం ఏది?
జ‌: గుజరాత్
 

15. కార్యనిర్వహణ శాఖ నుంచి, న్యాయశాఖను వేరు చేయడం ఏ రాష్ట్రాల్లో జరగలేదు?
జ‌: జమ్మూ - కశ్మీర్; నాగాలాండ్
 

16. రాజ్యాంగంలోని కింది భాగాలను, అందులో ఉన్న అంశాలతో జత చేయండి.
1) III వ భాగం 12-35        A) కేంద్ర ప్రభుత్వం
     నిబంధనలు
2) IV వ భాగం 36-51        B) ఆదేశ సూత్రాలు
    నిబంధనలు
3) V వ భాగం 52-151        C) రాష్ట్ర ప్రభుత్వాలు
    నిబంధనలు
4) VI వ భాగం 152-237     D) ప్రాథమిక హక్కులు
    నిబంధనలు
జ‌: 1-D 2-B 3-A 4-C

 

17. 'ప్రాథమిక విధులు అలంకార ప్రాయం' అన్నదెవరు?
జ‌: కె.పి. ముఖర్జీ
 

18. 'సమాన పనికి సమాన వేతనం' చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
జ‌: 1976
 

19. కార్మికులకు న్యాయబద్ధమైన వేతనాలు, పని గంటలు నిర్ణయించాలనే నిబంధన ఏది?
జ‌: 42 వ నిబంధన
 

20. కామన్ సివిల్ కోడ్ అమలవుతోన్న ప్రాంతం ఏది?
జ‌: గోవా
 

21. ఉపరాష్ట్రపతి పదవిని రాజ్యాంగ నిపుణులు ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
జ‌: అమెరికా
 

22. కిందివాటిలో ఏక కేంద్ర విధానానికి విరుద్ధమైన దాన్ని గుర్తించండి.
       ఎ) ఏక పౌరత్వం                   బి) ఏక రాజ్యాంగం
       సి) ద్వంద్వ పౌరత్వం             డి) కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్లను నియమించడం
జ‌: ద్వంద్వ పౌరత్వం
 

23. మన దేశ రాజ్యాంగంలో రాజ్యం నిర్వచనాన్ని గురించి తెలిపే నిబంధనలు ఏవి?
జ‌: 12, 36 రెండు నిబంధనలూ 'రాజ్యం' నిర్వచనాన్ని తెలియజేస్తాయి

 

24. గణతంత్ర విధానం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
జ‌: ఫ్రాన్స్
 

25. భారతదేశంలోని సమాఖ్య విధానానికి సంబంధించిన ఈ వ్యాఖ్యలను, అవి చేసిన వ్యక్తులతో జత చేయండి.
      1) భారతదేశం అర్ధ సమాఖ్య            A) మారిస్ జోన్స్
      2) భారతదేశం మాజీ సమాఖ్య        B) కె.సి.వేర్
      3) భారతదేశం సహకార సమాఖ్య    C) అంబేడ్కర్
      4) భారతదేశం అత్యవసర              D) గ్రాన్‌విల్ ఆస్టిన్
        పరిస్థితిలో ఏక కేంద్రం,
        సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య
జ‌: 1-B, 2-A, 3-D, 4-C
 

26. నీతి ఆయోగ్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటుచేశారు?
జ‌: 2015 జనవరి 1
 

27. కిందివాటిలో ఏది సత్యం?
      1. ఆదేశ సూత్రాలు సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు దోహదపడతాయి.
       2. ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్య స్థాపనకు దోహదపడతాయి.
జ‌: 1, 2 సత్యం

 

28. 'సమాన పనికి, సమాన వేతనం' అన్న దాన్ని రాజ్యాంగంలోని ఏ నిబంధన సూచిస్తుంది?
జ‌: ఆర్టికల్ 39 (డి)
 

29. పారిశ్రామిక నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం ఉండాలని సూచించిన రాజ్యాంగ నిబంధన ఏది?
జ‌: 43 (ఎ) నిబంధన
 

30. కిందివాటిలో సరైంది ఏది?
      1.1935 భారత ప్రభుత్వ చట్టం అమలుకాక ముందు భారత్‌లో ఏక కేంద్ర విధానం ఉంది.
      2.1937 లో భారత ప్రభుత్వ చట్టం 1935 అమలులోకి వచ్చిన నాటి నుంచి సమాఖ్య విధానం ఉంది.
      3. మన దేశంలో అవశిష్టాధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చారు.
      4. రాజ్యాంగంలోని 11 వ నిబంధనలో భారత్‌ను 'యూనియన్ ఆఫ్ స్టేట్స్' అని పేర్కొన్నారు.
జ‌: 3
 

31. మన రాజ్యాంగ రచనలో కింది అంశాలను ఏయే దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించారో జతచేయండి.
      1) అత్యవసర పరిస్థితిలో                 A) ఆస్ట్రేలియా
         ప్రాథమిక హక్కుల రద్దు
      2) జీవించే హక్కు                         B) దక్షిణాఫ్రికా
      3) ఉమ్మడి జాబితా                       C) జపాన్
      4) రాజ్యాంగ సవరణ పద్ధతి            D) జర్మనీ
జ‌: 1-D, 2-C, 3-A, 4-B

 

32. బోనస్ చెల్లింపు చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
జ‌: 1965
 

33. కిందివాటిలో ఏది సత్యం?
      1. ఆంధ్రప్రదేశ్‌లో సారా వ్యతిరేక ఉద్యమ నాయకురాలు దూబగుంట రోశమ్మ.
      2. ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధం విధించిన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు.
జ‌:  1, 2 సత్యం
 

34. ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్ (నల్లబల్ల పథకం) ఎప్పుడు ప్రారంభించారు?
జ‌: 1987
 

35. పూర్వ ప్రాథమిక విద్య ఎన్నేళ్లలోపు పిల్లల కోసం?
జ‌: 6 సంవత్సరాల లోపు
 

36. ఆదేశ సూత్రాలకు సంబంధించిన కింది వ్యాఖ్యలను, అవి చేసినవారితో జతపరచండి.
     1) ఎల్.ఎం.సింఘ్వీ                 A) 'ఆదేశసూత్రాలు పోస్ట్ డేటేడ్ చెక్కుల్లాంటివి'
    2) టి.టి.కృష్ణమాచారి              B) 'ప్రజలకు బాధ్యత వహించే ఏ ప్రభుత్వం ఆదేశ సూత్రాలను విస్మరించదు'
    3) కె.టి. షా                            C) 'ఆదేశ సూత్రాలు ప్రాణంలాంటివి'
    4) అల్లాడి కృష్ణస్వామి             D) 'ఆదేశ సూత్రాలు చెత్తబుట్టకు పరిమితమయ్యే ప్రజల భావోద్వేగాలు'
జ‌: 1-C, 2-D, 3-A, 4-B

 

37. వన్యప్రాణి సంరక్షణా చట్టాన్ని ఎప్పుడు చేశారు?
జ‌: 1972
 

38. ప్రాథమిక విధులను సిఫారసు చేసిన కమిటీ ఏది?
జ‌: స్వరణ్‌సింగ్
 

39. ప్రాథమిక విధులను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఏ కమిటీ సిఫారసు చేసింది?
జ‌: జె.ఎస్.వర్మ
 

40. ప్రాథమిక విధులు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి?
జ‌: 1977
 

41. ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని ఏ భాగంలో, ఏ నిబంధనలో చేర్చారు?
జ‌: IV (ఎ) భాగం; 51 (ఎ) నిబంధనలో
 

42. కింది అంశాలను ఏ రాజ్యాంగ నిబంధన సూచిస్తుందో జత చేయండి.
      1) గోవధ నిషేధం                     A) 49 వ నిబంధన
     2) చారిత్రక కట్టడాలు,               B) 51 వ నిబంధన
          ప్రదేశాలను రక్షించడం
     3) కార్యనిర్వాహక శాఖ నుంచి   C) 48 వ నిబంధన
         న్యాయశాఖను వేరుచేయాలి
     4) అంతర్జాతీయ శాంతిని           D) 50 వ నిబంధన
           పెంపొందించాలి
జ‌: 1-C, 2-A, 3-D, 4-B

 

43. కిందివాటిలో సరికానిదేది?
      1) ఆదేశ సూత్రాలు రాజ్యాంగంలోని 36 నుంచి 51 నిబంధన వరకూ ఉన్నాయి.
     2) సమాన పనికి సమాన వేతనాన్ని అసంఘటిత రంగంలో అమలు చేయలేం.
     3) ఆదేశ సూత్రాలు న్యాయ సమ్మతమైనవి.
     4) ఆదేశ సూత్రాలను ప్రభుత్వ వనరులను బట్టి అమలు చేస్తారు.
జ‌: 3

Posted Date : 14-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌