• facebook
  • whatsapp
  • telegram

అరచేతిలో పెడితే కరిగిపోయే గాలియం!

మూలకాల వర్గీకరణ

 


సజాతి పరమాణువులతో మూలకం ఏర్పడుతుంది.  ప్రతి మూలకం ప్రత్యేకమే. కానీ కొన్నింటిలో సారూప్యతలు ఉంటాయి. వాటి ఆధారంగానే మూలకాలను సమూహాలుగా, రసాయన కుటుంబాలుగా వర్గీకరించారు. ఆ విశిష్ట లక్షణాల వల్లే లోహ, అలోహాలు ఏర్పడ తాయి. సహజ, కృత్రిమ మూలకాలు, వాటి లభ్యత, స్వరూప స్వభావాలు, ప్రదర్శించే ధర్మాలు, ఉపయోగాల గురించి పరీక్షార్థులకు  ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. మూలకాల ఆవర్తన పట్టిక, సంబంధిత శాస్త్రవేత్తల వివరాలపై తగిన అవగాహన పెంచుకోవాలి.   ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

1.    18వ శతాబ్దం చివరి నాటికి లెవోఇజర్‌ కాలంలో కనుక్కున్న మూలకాల సంఖ్య? 

1) 13    2) 12    3) 11    4) 14

 

2.     ఒకే రసాయన ధర్మాలున్న మూడేసి మూలకాలను త్రికాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త?

1) డాబరీనర్‌     2) న్యూలాండ్స్‌ 

3) మెండలీవ్‌     4) మోస్లే 

 

3.     మూలకాలను వాటి పరమాణు భారాలు పెరిగే క్రమంలో అమర్చగా ప్రతి ఎనిమిదో మూలకం మొదటి మూలక ధర్మాలను పోలి ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? 

1) కొర్టాయిస్‌     2) న్యూలాండ్స్‌ 

3) మెండలీవ్‌     4) డాబరీనర్‌ 

 

4.     తెలియని మూలకాల కోసం ఖాళీలను ఉంచి ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్‌ అని పిలిచిన శాస్త్రవేత్త? 

1) మోస్లే     2) మెండలీవ్‌ 

3) న్యూలాండ్స్‌     4) డాబరీనర్‌  

 

5.     ‘మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు’ అని అన్నదెవరు? 

1) న్యూలాండ్స్‌     2) కొర్టాయిస్‌ 

3) మెండలీవ్‌     4) మోస్లే 

 

6.     ఆవర్తన పట్టికలో అతిపెద్ద పీరియడ్లు 6, 7లలో ఉండే మూలకాల సంఖ్య? 

1) 18     2) 8     3) 32     4) 34

 

7.     ఆవర్తన పట్టికలో 118వ మూలకం పేరు గుర్తించండి. 

1) Fi    2) Mc     3) Ts     4) Og

 

8. ' s' ఆర్బిటాల్‌లో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్య? 

1) 6     2) 2     3) 10      4) 14 

 

9.     గనుల నుంచి తవ్వి తీసిన లోహాల ద్వారా రాబట్టే మూలకాలను ఏవిధంగా పిలుస్తారు? 

1) హాలోజన్లు        2) చాల్కోజన్లు 

3) జడవాయువులు     4) పరివర్తన మూలకాలు 

 

10. సముద్ర లవణాల నుంచి సేకరించిన మూలకాలను ఏమని పిలుస్తారు? 

1) పరివర్తన మూలకాలు     2) హాలోజన్లు 

3) చాల్కోజన్లు     4) జడవాయువులు 

 

11. మానవుడు కనుక్కున్న మొదటి కృత్రిమ మూలకం ఏది? 

1) ఆర్సెనిక్‌     2) ప్లంబం 

3) మెండలీవియం     4) టెక్నీషియం 

 

12. కిందివాటిలో క్షార లోహాలను గుర్తించండి. 

1) Mg, Al    2) Fe, Ca     3) Na, K    4) Pt, Au

 

13. సల్ఫర్‌ పరమాణుకతను గుర్తించండి. 

1) 2     2) 8     3) 4     4) 3 

 

14. భూమిలో అధికంగా లభించే మూలకం? 

1) ఆక్సిజన్‌      2) సిలికాన్‌     3) ఇనుము      4) సోడియం 

 

15. గాలిలో అధిక మొత్తంలో లభించే వాయువు? 

1) ఆక్సిజన్‌                    2) నైట్రోజన్‌ 

3) కార్బన్‌ డయాక్సైడ్‌     4) ఆర్గాన్‌ 

 

16. మానవ శరీరంలో అధికంగా ఉండే లోహమూలకం? 

1) ఫాస్ఫరస్‌     2) ఐరన్‌     3) ఆక్సిజన్‌      4) కాల్షియం 

 

17. మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం? 

1) ఆక్సిజన్‌    2) ఐరన్‌    3) కార్బన్‌    4) హైడ్రోజన్‌ 

 

18. పదార్థాలను సన్నని పొడవైన తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని ఏమంటారు? 

1) ద్యుతి గుణం       2) ధ్వని గుణం 

3) స్థరనీయత         4) తాంతవత

 

19. పదార్థాలను చదునైన పలుచని రేకులుగా మార్చగలిగే ధర్మం? 

1) ధ్వని గుణం     2) ద్యుతి గుణం 

3) స్థరనీయత     4) తాంతవత 

 

20. పదార్థాలను కోసినప్పుడు అంచుల వద్ద మెరిసే ధర్మం?

1) ధ్వని గుణం     2) ద్యుతి గుణం 

3) తాంతవత     4) స్థరనీయత 

 

21. అధిక పరమాణు పరిమాణం ఉన్న మూలకం? 

1) పొటాషియం     2) సోడియం 

3) ఫ్రాన్షియం     4) సీజియం 

 

22. కాంతి విద్యుత్‌ ఘటాల్లో ఉపయోగించే మూలకం? 

1) సీజియం     2) సిలికాన్‌ 

3) జెర్మేనియం     4) ఆర్సెనిక్‌ 

 

23. ట్రాన్సిస్టర్‌ డయోడ్‌లలో ఉపయోగించే అర్ధవాహకం ఏది? 

1) సిలికాన్‌     2) జెర్మేనియం 

3) బిస్మత్‌     4) యాంటీమొని 

 

24. 30°C వద్ద ద్రవస్థితిలో లభించే లోహం? 

1) ఫ్రాన్షియం     2) ఆస్మియం 

3) రుబీడియం     4) సిలికాన్‌ 

 

25. అత్యధిక ఆక్సీకరణ స్థితి ఉన్న మూలకాన్ని గుర్తించండి. 

1) సిలికాన్‌     2) రుబీడియం     

3) ఆస్మియం     4) ఫ్రాన్షియం 

 

26. లోహాలన్నింటిలో కఠినమైన లోహాన్ని గుర్తించండి. 

1) సోడియం     2) కాపర్‌     3) ఆరమ్‌     4) టంగ్‌స్టన్‌


27. ఫ్లోరోసెంట్‌ బల్బులో నింపే వాయువును గుర్తించండి.

1) ఫాస్ఫరస్‌ ఆవిరి     2) నైట్రోజన్‌ ఆవిరి 

3) మెర్క్యురీ ఆవిరి     4) నియాన్‌ ఆవిరి 

 

28. ఎలక్ట్రోప్లేటింగ్, చర్మశుద్ధిలో ఉపయోగించే మూలకం?

1) కోబాల్ట్‌     2) క్రోమియం     3) టంగ్‌స్టన్‌     4) కాపర్‌ 

 

29. అయస్కాంత పదార్థాల తయారీలో ఉపయోగించే మూలకం?

1) నికెల్‌   2) జింక్‌   3) కోబాల్ట్‌   4) కాపర్‌ 

 

30. నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరక మూలకం?

1) కోబాల్ట్‌      2) క్రోమియం     3) జింక్‌      4) నికెల్‌ 

 

31. ఆవర్తన పట్టికలో గ్రూపులో పై నుంచి కిందకు వెళ్లే కొద్దీ ఎలక్ట్రాన్‌ ఎఫినిటీ విలువ?

1) పెరుగుతుంది     2) తగ్గుతుంది 

3) కనిష్ఠం               4) మారదు

 

32. ఆవర్తన పట్టికలో పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి వెళ్లే కొద్దీ రుణ విద్యుదాత్మకత విలువ?

1) తగ్గుతుంది     2) పెరుగుతుంది 

3) కనిష్ఠం           4) మారదు  

 

33. కిందివాటిలో ద్వి స్వభావం (ఆమ్ల - క్షార) ఉండే ఆక్సైడ్‌ను గుర్తించండి. 

1) Na2O      2) P2O5      3) N2O2       4) Al2O3

 

34. కిందివాటిలో రేడియోధార్మిక మూలకాన్ని గుర్తించండి. 

1) బ్రోమిన్‌     2) ఆస్టాటిన్‌      3) అయోడిన్‌     4) ఫ్లోరిన్‌ 

 

35. ‘లోహాలకు రాజు’ అని ఏ లోహాన్ని పిలుస్తారు?  

1) మెర్క్యురీ     2) ప్లాటినం     3) బంగారం    4) వెండి 

 

36. ‘మూలకాల రాజు’గా ఏ మూలకాన్ని పిలుస్తారు? 

1) హైడ్రోజన్‌         2) నైట్రోజన్‌ 

3) సిలికాన్‌          4) కార్బన్‌ 

 

37. అరచేతిలో పెట్టుకుంటే కరిగిపోయే మూలకాన్ని గుర్తించండి. 

1) బ్రోమిన్‌                2) గాలియం 

3) టైటానియం        4) ఆస్టాటిన్‌ 

 

38. కిందివాటిలో ఏ మూలకాన్ని మండిస్తే యాపిల్‌ పచ్చరంగులోకి మారుతుంది? 

1) కాల్షియం      2) స్ట్రాన్షియం     3) రేడియం     4) బేరియం 

 

39. మూలకం అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? 

1) చార్లెస్‌     2) బాయిల్‌      3) ప్రాస్ట్‌     4) లెవోఇజర్‌ 

 

40. మెండలీవ్‌ ఆవర్తన పట్టికలో సరైన స్థానంలో లేని మూలకం ఏది?

1) నైట్రోజన్‌     2) ఆక్సిజన్‌ 

3) హైడ్రోజన్‌     4) కార్బన్‌ 

 

41. 101 మూలకానికి మెండలీవ్‌ పేరును సూచించారు. దాని పేరేంటి? 

1) లారెన్షియం     2) మెండలీవియం 

3) నాబీలియం     4) బోరియం 

 

42. మూలకాలకు మొదటిసారిగా సంకేతాలను సూచించిన శాస్త్రవేత్త? 

1) రాబర్ట్‌ బాయిల్‌     2) లెవోఇజర్‌ 

3) జోసఫ్‌ ప్రాస్ట్‌     4) జాన్‌ బెర్జీలియస్‌ 

 

43. కిందివాటిలో నికోజెన్స్‌ అని పిలిచే గ్రూపును గుర్తించండి. 

1) 13వ      2) 14వ      3) 15వ      4) 18వ  

 

44. సీరియం నుంచి ల్యుటీషియం వరకు ఉండే లాంథనైడ్‌ల్లోని మూలకాల సంఖ్య? 

1) 16    2) 14    3) 32    4) 18 

 

45. తాగునీటిని స్టెరిలైజ్‌ చేయడానికి ఉపయోగించే మూలకం? 

1) ఫ్లోరిన్‌      2) సల్ఫర్‌      3) క్లోరిన్‌     4) కార్బన్‌ 

 

46. ‘రెడ్‌ లిక్విడ్‌’గా ఏ మూలకాన్ని పిలుస్తారు?  

1) అయోడిన్‌     2) బ్రోమిన్‌     3) కాపర్‌     4) ఐరన్‌ 

 

47. రెండో అధిక కాటనేషన్‌ ధర్మం ఉన్న మూలకం? 

1) సిలికాన్‌    2) జెర్మేనియం    3) బిస్మత్‌     4) ఆర్సెనిక్‌ 

 

48. క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే మూలకం? 

1) బెరీలియం     2) స్ట్రాన్షియం 

3) రెడాన్‌            4) రేడియం  

 

49. అధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం? 

1) క్లోరిన్‌ 2) ఫ్లోరిన్‌ 3) బ్రోమిన్‌ 4) అయోడిన్‌ 

 

50. నైటెన్‌ వాయువుగా పిలిచే మూలకాన్ని గుర్తించండి. 

1) క్రిప్టాన్‌     2) గ్జినాన్‌     3) నియాన్‌     4) రెడాన్‌ 

 

51. కిందివాటిలో సున్నా గ్రూపు మూలకాలు అని వేటిని పిలుస్తారు?

1) అంతర పరివర్తన మూలకాలు     2) పరివర్తన మూలకాలు 

3) ప్రాతినిధ్య మూలకాలు      4) జడవాయువులు

 

52. ఏ మూలకాల సాధారణ బాహ్య ఎలక్ట్రాన్‌ విన్యాసం ns2np6 గా ఉంటుంది?

1) జడవాయువులు         2) ప్రాతినిధ్య మూలకాలు

3) పరివర్తన మూలకాలు  4) అంతరపరివర్తన మూలకాలు 

 

53. ఆవర్తన పట్టికలో 56 మూలకాలను అమర్చి 7 గ్రూపులుగా విభజించిన వర్గీకరణ?

1) మెండలీవ్‌ వర్గీకరణ      2) న్యూలాండ్స్‌ వర్గీకరణ

3) డాబరీనర్‌ వర్గీకరణ        4) డీచాన్‌ కొర్టాయిస్‌ వర్గీకరణ

 

54. p ఆర్బిటాల్‌లో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్యను గుర్తించండి.

1) 10     2) 14     3) 6     4) 2

 

55. మానవుడి శరీరంలో ఉన్న ఫాస్ఫరస్‌ శాతం ఎంత?

1) 3%    2) 10%   3) 1.5%  4) 1%

 

56. మెగ్నీషియంతో కర్ణ సంబంధం ఉన్న మూలకాన్ని గుర్తించండి.

1) లిథియం      2) సోడియం       

3) పొటాషియం      4) సీజియం

 

57. నీటిలో నిల్వ చేసే అలోహ మూలకాన్ని గుర్తించండి.

1) ఎర్ర ఫాస్ఫరస్‌      2) తెల్ల ఫాస్ఫరస్‌ 

3) సోడియం      4) సల్ఫర్‌

 

58. ఆక్సిజన్, ఎసిటిలీన్‌ వాయువులు కలిసి ఆక్సీ ఎసిటిలీన్‌ జ్వాలను ఇస్తాయి. దీని ఉష్ణోగ్రతను గుర్తించండి.

1) 2300°C       2) 5500°C  

3) 3300°C       4) 4300°C

 

 

సమాధానాలు

13; 21; 32; 42; 54; 63; 74; 82; 92; 103; 114; 123; 132; 141; 152; 164; 171; 184; 193; 202; 213; 221;  232; 241; 253; 264; 273; 282; 293; 304; 312; 321; 334; 342; 353; 364; 372; 384; 392; 403; 412; 424; 433; 442; 453; 462; 471; 484; 492; 504; 514; 521; 532; 543; 554; 561; 572; 583.


 



 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 07-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌