• facebook
  • whatsapp
  • telegram

వృక్షరాజ్య వర్గీకరణ

లక్షల రకాల మొక్కల శాస్త్రీయ విభజన!


జీవరాశుల్లో సంఖ్యాపరంగా అధికంగా ఉండి, జీవావరణ వ్యవస్థకు మూలాధారంగా నిలిచి, మానవులు సహా ఇతర జీవులకు విస్తృత ప్రయోజనాలను మొక్కలు అందిస్తున్నాయి. ఆహారం, ఔషధాలు, వినిమయ వస్తువులతో పాటు పారిశ్రామిక ఉత్పత్తులకు ముడిపదార్థాలను సమకూర్చడంలో అవే కీలకంగా ఉన్నాయి. భూమిపై ఉన్న లక్షల రకాల మొక్కలను వాటి లక్షణాలు, సారూప్యతల ఆధారంగా శాస్త్రవేత్తలు విభజించారు. సరళ వర్గీకరణగా మొదలైన ఈ ప్రక్రియ క్రమంగా సంక్లిష్టంగా మారింది. ఈ అంశంపై పోటీ పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. ఈ వర్గీకరణలో ఉన్న మూలసూత్రాలను, ప్రధాన జాతుల లక్షణాలతో పాటు శైవలాలు, శిలీంధ్రాలు, స్వయం పోషకాలు, పరాన్నజీవులు తదితరాల గురించి తెలుసుకోవాలి.

భూమిపై అత్యధికంగా ఉన్న జీవులు మొక్కలు.  మొక్కలు, వాటి రకాలను సులభంగా అర్థం చేసుకోవడానికి వాటిని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. మొక్కలను ప్రాథమికంగా ౧్శ పుష్పించే మొక్కలు ౨్శ పుష్పించని మొక్కలుగా విభజించారు. పుష్పించని మొక్కల్లో తిరిగి థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అనే విభాగాలున్నాయి. పుష్పించే మొక్కలను వివృతబీజాలు, ఆవృతబీజాలుగా వర్గీకరించారు. ఆవృతబీజాలను తిరిగి ఏకదళబీజాలు, ద్విదళబీజాలుగా వర్గీకరించారు.

మాదిరి ప్రశ్నలు

1. వృక్ష రాజ్యంలో ఏవి ప్రాథమికమైనవి, ఏవి పురోగమించినవి?

ఎ) థాలోఫైటా                            బి) బ్రయోఫైటా   

సి) ఏకదళబీజాలు                     డి) ద్విదళబీజాలు 

ఇ) టెరిడోఫైటా                         ఎఫ్‌) వివృతబీజాలు

1) ఎ, సి    2) బి, ఇ   3)  ఇ, ఎఫ్‌   4) డి, ఎఫ్‌


2. కిందివాటిలో సరైనవాటిని ఎన్నుకోండి.

ఎ) థాలోఫైటా విభాగంలో శైవలాలు, శిలీంధ్రాలను చేర్చారు.

బి) స్వయంపోషిత థాలోఫైటా జీవులు శైవలాలు.

సి) పరపోషిత థాలోఫైటా జీవులు శిలీంధ్రాలు.

1) ఎ, బి   2) ఎ, బి, సి  3)  బి, సి  4) ఎ, సి


3. కిందివాటిలో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) శైవలం, శిలీంధ్రం కలిసి లైకెన్‌ను ఏర్పరుస్తాయి.

బి) రెండు వేర్వేరు జీవులు కలిసి నివసిస్తూ పరస్పరం లాభం పొందడాన్ని సహజీవనం అంటారు.

1) ఎ సరైంది, బి సరైంది కాదు. ఇవి ఒకదాంతో మరొకటి సంబంధం చూపవు.

2) ఎ సరైంది కాదు, బి సరైంది. ఇవి రెండూ   ఒకదాంతో మరొకటి సంబంధం చూపుతాయి.

3)  ఎ, బి లు రెండూ సరైనవి. ఇవి ఒకదాంతో మరొకటి సంబంధం చూపుతాయి.

4) ఎ, బి లు రెండూ సరైనవి కావు.


4. కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.        

ఎ) శైవలం              1) రిక్సియా

బి) శిలీంధ్రం         2) సాల్వీనియా

సి) బ్రయోఫైట్‌      3) సైకస్‌

డి) టెరిడోఫైట్‌      4) స్పైరులీనా

ఇ) వివృతబీజం    5) అగారికస్‌

1) ఎ-1, బి-3, సి-4, డి-2, ఇ-5    

2) ఎ-4, బి-2, సి-3, డి-1, ఇ-5

3)  ఎ-5, బి-4, సి-2, డి-3, ఇ-1     

4) ఎ-4, బి-5, సి-1, డి-2, ఇ-3

5. వృక్ష రాజ్యంలో నిమ్నస్థాయి నుంచి పురోగమించిన స్థాయి వరకు ఉండే జీవుల్లో సరైన వరుస ఏది?

1) ఏకదళబీజం ® శైవలం ® బ్రయోఫైటా ® టెరిడోఫైటా ® వివృతబీజం

2) శైవలం ® బ్రయోఫైటా ® టెరిడోఫైటా ® వివృతబీజం ® ఏకదళబీజం

3)  వివృతబీజం ® బ్రయోఫైటా ® టెరిడోఫైటా ® శైవలం ® ఏకదళబీజం

4) టెరిడోఫైటా ® ఏకదళబీజం ® వివృతబీజం ® శైవలం ® బ్రయోఫైటా


6. శైవలాల ఆర్థిక ప్రాముఖ్యం గురించి కిందివాటిలో సరైన జతలు గుర్తించండి.

1) క్లోరెల్లా             ఎ) జీవఎరువుగా వాడతారు.

2) స్పైరులీనా     బి) అగార్‌అగార్‌సంగ్రహిస్తారు.

3) లామినేరియా సి) అంతరిక్ష ప్రయాణాల్లోవాడతారు.

4) జిలీడియం    డి) అత్యధిక ప్రోటీన్లు లభిస్తాయి.

5) నాస్టాక్‌           ఇ) ఆల్జినిక్‌ఆమ్లం లభిస్తుంది.

1) 1-సి, 2-డి, 3-ఇ, 4-బి, 5-ఎ    

2) 1-ఎ, 2-డి, 3-సి, 4-ఇ, 5-బి

3)  1-బి, 2-సి, 3-డి, 4-ఎ, 5-ఇ    

4) 1-ఇ, 2-బి, 3-సి, 4-డి, 5-ఎ


7. శిలీంధ్రాలకు సంబంధించి కిందివాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి.

ఎ) శిలీంధ్రాలు పూతికాహారులుగా ఉంటాయి.

బి) శిలీంధ్రాలన్నీ స్వయంపోషకాలు.

సి) కొన్ని శిలీంధ్రాలు పరాన్నజీవులుగా ఉంటాయి.

డి) శిలీంధ్రాల్లో ఏవి కూడా ఆహారయోగ్యం కాదు.

ఇ) శిలీంధ్రాల అధ్యయనాన్ని ఫంగాలజీ అంటారు.

1) ఎ, బి, సి          2) బి, సి, డి, ఇ    

3)  బి, డి, ఇ        4) సి, డి, ఇ


8. కిందివాటిలో సరైన జతలు ఎన్ని?

ఈస్ట్‌- కిణ్వ ప్రక్రియకు ఉపయోగపడతాయి.

అగారికస్‌- తినదగిన శిలీంధ్రం.

రైజోపస్‌- బ్రెడ్‌మోల్డ్‌అని పిలుస్తారు.

పెనిసీలియం - యాంటీబయాటిక్‌ను సంగ్రహిస్తారు.

అప్లటాక్సిన్‌- కాలేయ క్యాన్సర్‌ను కలగజేస్తుంది.

1) 2 జతలు       2) 3 జతలు   

3)  4 జతలు       4) 5 జతలు


9. కిందివాటిలో సరైన వాక్యాలను ఎన్నుకోండి.

ఎ) శిలీంధ్రాల కణ కవచం ఖైటిన్‌తో నిర్మితమవుతుంది.

బి) శిలీంధ్రాలు అలైంగికోత్పత్తిలో స్పోరులను    ఏర్పరుస్తాయి.

సి)  శిలీంధ్రాల దేహాన్ని మైసీలియం అంటారు.

డి) శిలీంధ్రం, బ్యాక్టీరియా కలిసి లైకెన్‌ను ఏర్పరుస్తాయి.

1) ఎ, బి  2) ఎ, బి, సి  3)  ఎ, డి  4)  బి, డి


10. బ్రయోఫైటా మొక్కలకు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలను ఎన్నుకోండి.

ఎ) ఈ మొక్కలను వృక్షరాజ్య ఉభయజీవులు అంటారు.

బి) ఇవి తేమ, నీడ ప్రదేశాల్లో పెరుగుతాయి.

సి)  వీటి వేళ్ల లాంటి నిర్మాణాలను ‘రైజాయిడ్స్‌’ అంటారు.

డి)వీటిని సాధారణంగా మాస్‌మొక్కలని పిలుస్తారు.

ఇ) రిక్సియా, మార్కాంషియా మొక్కలు వీటికి   ఉదాహరణ.

1) ఎ, బి, సి        2) బి, సి, డి   

3)  ఎ, బి, సి, డి, ఇ       4) సి, డి, ఇ


11. టెరిడోఫైటా గురించి ఇచ్చిన వాక్యాలను పరిశీలించి, సరైన వాటిని ఎన్నుకోండి.

ఎ) వీటిని నాళికాయుత పుష్పించని మొక్కలు అంటారు.

బి) వీటిలో దారుపోషక కణజాలం ఉంటుంది.

1) ఎ, బి లు సరైనవి కావు. ఇవి రెండూ ఒకదాంతో మరొకటి సంబంధాన్ని చూపవు.

2) ఎ, బి లు సరైనవి. ఇవి రెండూ ఒకదాంతో మరొకటి సంబంధం చూపుతాయి.

3)  ఎ సరైంది, బి సరైంది కాదు.

4) ఎ సరైంది కాదు, బి సరైంది.


12. కింది వాక్యాలను పరిశీలించి, సరైన వాటిని   ఎన్నుకోండి.

ఎ) టెరిడోఫెటా మొక్కలను ‘వృక్షరాజ్య సరీసృపాలు’ అంటారు.

బి) బ్రయోఫైటా, వివృతబీజాల మధ్య టెరిడోఫైటా మొక్కలుంటాయి.

సి) ‘అజొల్లా’ అనే టెరిడోఫైటా మొక్కను వరి పొలాల్లో జీవఎరువుగా వాడతారు.

డి)  నిజమైన మొదటి భూమి మొక్కలు టైరిడోఫైట్లు.

ఇ)మార్సీలియా, సాల్వీనియా, లైకోపోడియం మొక్కలు టెరిడోఫైట్లకు ఉదాహరణ.

1) ఎ, బి, సి, డి, ఇ       2) బి, సి, డి   

3)  సి, డి, ఇ        4) ఎ, డి, ఇ


13. వివృత బీజాలకు సంబంధించి కిందివాటిని సరైన విధంగా జతపరచండి.

1) సైకస్‌           ఎ) కోనిఫెర్‌వృక్షం

2) పైనస్‌          బి) సజీవ శిలాజం

3) అరకేరియా   సి) వృక్షరాజ్యంలో అతిపెద్ద అండం

4) గింకో            డి) క్రిస్‌మస్‌ట్రీ

5) పైన్‌             ఇ) రెజిన్‌లభిస్తుంది

1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ, 5-ఇ     

2) 1-సి, 2-ఇ, 3-డి, 4-బి, 5-ఎ

3)  1-డి, 2-సి, 3-ఇ, 4-బి, 5-ఎ     

4) 1-ఎ, 2-ఇ, 3-సి, 4-డి, 5-బి


14. కిందివాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి.

ఎ) వివృత బీజాలను నగ్న విత్తనాలున్న మొక్కలు అంటారు.

బి) శంకువులు అని పిలిచే పుష్పాల లాంటి నిర్మాణాలు వివృతబీజాల్లో ఏర్పడతాయి.

సి) వివృతబీజాల్లో విత్తనాలు ఫలకవచంతో కప్పి ఉంటాయి.

డి) వివృతబీజాలను తిరిగి ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలుగా వర్గీకరించారు.

1) సి, డి   2) ఎ, బి  3)  ఎ, సి   4) బి, డి


15. కిందివాటిలో ఎన్ని జతలు సరైనవి?

ఆర్కిడ్‌మొక్కలు - పప్పుజాతి మొక్కలు

వరి, గోధుమ - గడ్డిజాతి మొక్కలు

కొబ్బరి, తాటి మొక్కలు - ఏకదళబీజాలు

కంది, పెసర - అతిచిన్న విత్తనాలు

1) 2 జతలు       2) 3 జతలు  

3)  4 జతలు        4) 1 జత


16. కిందివాటిలో సరైన వాటిని గుర్తించండి.


ఎ) ఆవృతబీజాలను ఏకదళబీజాలు, ద్విదళబీజాలుగా విభజించారు.

బి) ద్విదళబీజాల్లో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది.

సి) ఏకదళబీజాల పత్రాల్లో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది.

డి) లెగ్యుమినేసి మొక్కలు ద్విదళబీజాలకు చెందినవి.

1) ఎ, బి, సి        2) బి, సి, డి    

3)  ఎ, బి, సి, డి       4) సి, డి


17. ఏకదళ బీజాలకు సంబంధించి కిందివాటిలో   సరికానివి?

ఎ) వీటిలో పీచు వేరు వ్యవస్థ ఉంటుంది.

బి) పామ్‌జాతి మొక్కలు ఏకదళ బీజాలకు చెందినవి.

సి) విత్తనంలో ఒకే బీజదళం ఉంటుంది.

డి) అరటి, ఉల్లి, వెల్లుల్లి ఏకదళబీజాలకు ఉదాహరణ.

ఇ) మందార, గులాబి ఏకదళబీజాలకు చెందినవి.

1) ఎ, బి, సి    2) బి మాత్రమే   

3) ఇ మాత్రమే   4) సి, డి 


సమాధానాలు

1-1; 2-2; 3-3; 4-4; 5-2; 6-1; 7-3; 8-4; 9-2; 10-3; 11-2; 12-1; 13-2; 14-1; 15-1; 16-3; 17-3.


రచయిత: డాక్టర్‌బి. నరేష్‌

 

Posted Date : 15-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు