• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - పరిశ్రమలు

1. ఎక్కువ మంది శ్రామికులకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ?
జ: నూలు వస్త్ర పరిశ్రమ

 

2. దేశంలో నూలు మిల్లులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
జ: తమిళనాడు

 

3. దేశంలో మొదటి పట్టు వస్త్ర పరిశ్రమను ఎక్కడ స్థాపించారు?
జ: హౌరా

 

4. దేశంలో మొదటి అధునాతన నూలు వస్త్ర పరిశ్రమను ఏ సంవత్సరంలో, ఎక్కడ స్థాపించారు?
: 1854, బొంబాయి

 

5. జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
జ: పశ్చిమ్ బంగ

 

6. పంచదార మిల్లులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి?
: ఉత్తర్ ప్రదేశ్

 

7. దేశంలో మొదటి ఉన్ని వస్త్ర పరిశ్రమను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు?
జ: కాన్పూర్

 

8. దేశంలో తోళ్ల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన నగరం?
     1) ఆగ్రా        2) కాన్పూర్        3) చెన్నై        4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

9. దేశంలో మొదట ఏ ప్రాంతంలో కృత్రిమ రబ్బరును తయారు చేశారు?
జ: బరేలి

 

10. 'బంగారు పీచు' అని దేన్ని పిలుస్తారు?
జ: జనపనార

 

11. 1981లో నేషనల్ న్యూస్‌ప్రింట్ కర్మాగారాన్ని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు?
జ: నేపానగర్

 

12. దేశంలో మొదటి ఇనుము - ఉక్కు కర్మాగారాన్ని (1870) ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: కుల్టీ

 

13. బర్నపూర్ వద్ద 'ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ'ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ: 1919

 

14. భద్రావతి ఇనుము - ఉక్కు కర్మాగారానికి ఇనుప ధాతువును ఏ గనుల నుంచి సేకరిస్తున్నారు?
జ: కెమ్మనగండి గనులు

Posted Date : 17-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌