• facebook
  • whatsapp
  • telegram

వ్యర్థాలను వడగట్టి.. వెలుపలకు వెళ్లగొట్టి!

విసర్జక వ్యవస్థ (మూత్రపిండాలు)

 

 

అనవసరంగా పోగయ్యే వ్యర్థ పదార్థాలను వడగట్టి, వెలుపలకు వెళ్లగొట్టి శరీర సమతాస్థితిని మూత్రపిండాలు కాపాడతాయి. రక్తపోటు నియంత్రణను, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రభావితం చేసే రసాయనాలను అందిస్తాయి. ఈ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనిషి ఆరోగ్య రక్షణలో అత్యంత కీలకమైన ఈ మూత్రపిండాల నిర్మాణం, పనితీరు, వాటిలో లోపాల వల్ల  తలెత్తే ఇబ్బందులు, వ్యాధులు తదితర అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 
 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

1. మూత్రపిండాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి?

ఎ) లవణాలు, నీటిని నియంత్రిస్తాయి.

బి) వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి.

సి) వాయు వినిమయం ద్వారా రక్తాన్ని శుభ్రపరుస్తాయి.

1) ఎ, బి  2) బి, సి  3) ఎ, సి  4) ఎ, బి, సి


2. కిందివాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి.

ఎ) మూత్రపిండాలు రక్తాన్ని వడపోస్తాయి.

బి) మూత్రపిండాలు నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి.

సి) మూత్రపిండాలు విటమిన్‌ - డి తయారీకి తోడ్పడుతాయి.

డి) మూత్రపిండాల్లో రక్తం ఉత్పత్తవుతుంది.

1) ఎ, బి 2) బి, సి  3) ఎ, డి  4) డి మాత్రమే


3. నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?

ఎ) అమ్మోనియాను విసర్జించే జీవులను అమ్మోనోటలిక్‌ అంటారు.

బి) యూరియాను విసర్జించే జంతువులను యూరియోటెలిక్‌ అంటారు.

సి) యూరికామ్లాన్ని విసర్జించే జీవులను యూరికోటెలిక్‌ అంటారు.

1) ఎ, బి  2) బి, సి  3) ఎ, సి  4) ఎ, బి, సి


4. కిందివాటిని జతపరచండి.

ఎ) అమ్మోనియా 1) సాలీడు
బి) యూరియా 2) చేపలు
సి) యూరికామ్లం 3) ఉభయ జీవులు
డి) గ్వానైన్‌ 4) పక్షులు

1) ఎ-2, బి-3, సి-4, డి-1 2) ఎ-3, బి-2, సి-4, డి-1

3) ఎ-4, బి-2, సి-1, డి-3 4) ఎ-2, బి-1, సి-4, డి-3


5.  నత్రజని సంబంధ వ్యర్థాలకు సంబంధించి కిందివాటిలో ఎన్ని జతలు సరైనవి?

ఎ) అస్థిచేపలు - అమ్మోనియా

బి) కప్పలు - యూరియా

సి) టాడ్‌పోల్‌ లార్వా - యూరికామ్లం

డి) పక్షులు - యూరికామ్లం

ఇ) రొయ్య, నత్త - యూరియా

1) 4      2) 3      3) 5      4) 2


6.  కిందివాటిలో అమ్మోనియాను విసర్జించని జీవులు ఏవి?

ఎ) హైడ్రా         బి) కప్ప టాడ్‌పోల్‌ లార్వా  

సి) సాలమాండర్‌    డి) రొయ్య   

ఇ) తాబేలు       ఎఫ్‌) మృదులాస్థి చేపలు  

జి) సాలీడు       హెచ్‌) క్షీరదాలు

1) ఎ, బి, సి, ఇ, ఎఫ్‌   2) ఎ, సి, డి, ఇ, ఎఫ్, జి, 

3) ఇ, ఎఫ్, జి, హెచ్‌   4) సి, డి, ఇ, ఎఫ్, జి


7. కిందివాటిలో సరైనవి గుర్తించండి.

ఎ) అమ్మోనియా ఎక్కువ విషపూరితం కాబట్టి నీటిలో ఉండే జీవులు దీన్ని విసర్జిస్తాయి.

బి) యూరికామ్లం తక్కువ విషపూరితం కాబట్టి నీరు తాగని జంతువులు దీన్ని విసర్జిస్తాయి.

1) ఎ, బి సరైనవి. ఇవి రెండూ ఒకే వ్యవస్థకు సంబంధించినవి.

2) ఎ సరైంది, బి సరైంది కాదు. ఈ రెండు ఒకే అంశానికి సంబంధించినవి కావు.

3) ఎ సరైంది కాదు, బి సరైంది. ఈ రెండు వేర్వేరు అంశాలు.

4) ఎ, బి సరైనవి కావు.


8. వివిధ జీవుల్లో విసర్జక అవయవాలకు సంబంధించి కింది జతలను సరిగా అమర్చండి.

ఎ) బద్దెపురుగులు 1) మూత్రపిండాలు
బి) గుండ్రటి పురుగులు 2) జ్వాలా కణాలు
సి) క్రస్టేషియన్‌లు 3) రెన్నెట్‌ కణాలు
డి) కీటకాలు 4) హరిత గ్రంథులు
ఇ) క్షీరదాలు 5) మాల్ఫీజియన్‌ నాళాలు

1) ఎ-1, బి-3, సి-2, డి-4, ఇ-5      2) ఎ-2, బి-4, సి-3, డి-5, ఇ-2

3) ఎ-4, బి-2, సి-3, డి-5, ఇ-1      4) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1


9. కిందివాక్యాల్లో సరైనవాటిని గుర్తించండి.

ఎ) మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి మలినాలను మూత్రరూపంలో బయటకు పంపుతాయి.

బి) ఊపిరితిత్తులు కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విసర్జిస్తాయి.

సి) చర్మం వ్యర్థాలను చెమట రూపంలో బయటకు పంపుతుంది.

డి) పెద్ద పేగు జీర్ణం కాని పదార్థాలను విసర్జిస్తుంది.

1) ఎ, బి, సి 2) బి, సి 3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి


10. మూత్రపిండాలకు సంబంధించి కింది వాక్యాల్లో ఎన్ని సరైనవి?

ఎ) మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి.

బి) ఎడమ మూత్రపిండం కంటే కుడి మూత్రపిండం చిన్నది.

సి) మూత్రనాళాలు మూత్రపిండాల నుంచి మూత్రాన్ని మూత్రాశయానికి తీసుకువస్తాయి.

డి) మూత్రపిండాలు వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి.

ఇ) వృక్కధమని మూత్రపిండానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది.

1) 3 వాక్యాలు       2) 4 వాక్యాలు  

3) 5 వాక్యాలు      4) 2 వాక్యాలు


11. నెఫ్రాన్లకు సంబంధించి కిందివాటిలో సరైన జతలను గుర్తించండి.

ఎ) మూత్రపిండాల నిర్మాణాత్మక ప్రమాణాలు - నెఫ్రాన్లు.

బి) రక్తం వడపోత - గ్లోమెరులస్‌ ద్వారా జరుగుతుంది.

సి) గ్లోమెరులస్‌ - ప్రాథమిక మూత్రం ఏర్పడుతుంది.

డి) హెన్లీ శిక్యం - పదార్థాల పునఃశోషణ జరుగుతుంది.

ఇ) సంగ్రహణ నాళం - మూత్రం సంగ్రహించబడుతుంది.

1) ఎ, బి, సి       2) ఎ, బి, సి, డి, ఇ  

3) బి, సి, డి       4) సి, డి, ఇ


12. కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.

ఎ) మూత్రపిండాలు, వాటి వ్యాధుల అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటారు.

బి) మూత్రాశయం, మూత్రనాళాల అధ్యయనాన్ని యూరాలజీ అంటారు.

సి) యూరాలజీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి కూడా తెలియజేస్తుంది.

1) ఎ, బి  2) ఎ, సి  3) ఎ, బి, సి  4) బి, సి


13. మూత్రపిండాల్లో జరిగే కింది చర్యలకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి.

ఎ) నెఫ్రాన్‌లో నీటి పునఃశోషణానికి కారణమయ్యే హార్మోన్‌ వాసోప్రెస్సిన్‌.

బి) నెఫ్రాన్‌లలో రోజుకు 190 లీటర్ల మూత్రం వడపోత జరుగుతుంది.

సి) నెఫ్రాన్‌లో రోజుకు 190 లీటర్ల రక్తం వడపోత జరుగుతుంది.

డి) రెండు మూత్రపిండాలు సరాసరి రోజుకు 1.5 లీటర్ల మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి.

ఇ) మూత్రపిండాలు సరాసరి రోజుకు 15 లీటర్ల మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి.

1) బి, ఇ  2) ఎ, బి  3) సి, డి  4)  ఎ, బి, సి


14. కిందివాటిలో సరైనవి గుర్తించండి.

ఎ) ఆల్కహాల్, టీ, కాఫీ లాంటి వాటిని డైయూరిటిక్స్‌ అంటారు.

బి) డైయూరిటిక్స్‌ వల్ల మూత్రం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.

1) ఎ, బి సరైనవి. ఎ వాక్యం బితో సంబంధం చూపుతుంది.

2) ఎ, బి సరైనవి కావు. ఎ వాక్యం బి తో సంబంధం చూపదు.

3) ఎ సరైంది, బి సరైంది కాదు. ఎ వాక్యం బి తో సంబంధం చూపదు.

4) బి సరైంది, ఎ సరైంది కాదు. బి వాక్యం ఎ తో సంబంధం కలిగి ఉంటుంది.


15. కింది జతల్లో సరైన వాటిని ఎన్నుకోండి.

ఎ) గ్లైకోసూరియా - మూత్రంలో గ్లూకోజ్‌ ఉండటం.

బి) హిమటూరియా - మూత్రంలో రక్తం ఉండటం.

సి) కీటోన్యూరియా - మూత్రంలో ఖైటిన్‌ ఉండటం.

డి) ఆల్బిన్యూరియా - మూత్రంలో అబ్‌సైసిక్‌ ఆమ్లం ఉండటం.

1) ఎ, బి 2) బి, సి  3) సి, డి  4) ఎ మాత్రమే


16. కింది జతలను సరైన విధానంలో అమర్చండి.

ఎ) అన్యూరియా 1) మూత్రం నలుపు రంగులో ఉండటం
బి) ఆల్‌కాప్టో న్యూరియా 2) మూత్రవిసర్జనలోనొప్పి
సి) పైయూరియా 3) రక్తంలో ఎక్కువ యూరియా ఉండటం
డి) యూరిమియా 4) మూత్రంలో చీము ఉండటం
ఇ) డైసూరియా 5) మూత్రం  ఏర్పడకపోవడం

1) ఎ-1, బి-3, సి-2, డి-5, ఇ-4      2) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5

3) ఎ-5, బి-1, సి-4, డి-3, ఇ-2     4) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5


17. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాలు గుర్తించండి.    

ఎ) రక్తాన్ని కృత్రిమంగా వడపోయడాన్ని హీమోడయాలసిస్‌ అంటారు.

బి) డయాలసిస్‌ యంత్రాన్ని కృత్రిమ మూత్రపిండం అంటారు.

సి) రక్తాన్ని శుభ్రపరిచి నీటిని తగ్గించడాన్ని పెరిటోనియల్‌ డయాలసిస్‌ అంటారు.

డి) రక్తంలో నత్రజని సంబంధ వ్యర్థాలు పెరిగినప్పుడు డయాలసిస్‌ అవసరమవుతుంది.

1) ఎ, బి, డి  2) బి, సి, డి 3) ఎ, బి, సి  4) సి, డి


18. కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.

ఎ) మూత్రంలో ఎక్కువ పైత్యరస వర్ణకాలు ఉండటం కామెర్ల వ్యాధి లక్షణం.

బి) పక్షులు, పాములు, మొసళ్ల లాంటి వాటిలో మూత్రాశయం ఉండదు.

సి) రక్తం వడపోసిన తర్వాత ప్రాథమిక మూత్రం ఏర్పడుతుంది.

డి) ప్రాథమిక మూత్రం నుంచి నీటి పునఃశోషణానికి కారణం యాంటీ డైయూరిటిక్‌ హార్మోన్‌.

1) ఎ, బి, సి, డి 2) బి, సి 3) సి, డి 4) ఎ, సి


19. మూత్రపిండంలోని రాళ్లు ఏ రసాయన పదార్థాలతో ఏర్పడతాయి?

ఎ) కాల్షియం కార్బొనేట్‌  బి) కాల్షియం ఆక్సలేట్‌

సి) యూరిక్‌ ఆమ్లం    డి) మెగ్నీషియం కార్బొనేట్‌

ఇ) సోడియం ఆక్సలేట్‌  ఎఫ్‌) యూరియా   

జి) క్రియాటిన్‌

1) ఎ, బి, సి      2) బి, సి, డి, జి  

3) బి, సి, ఇ      4) ఎ, డి, ఇ, ఎఫ్, జి


20. కిందివాటిలో మూత్రపిండాల ప్రత్యేక విధులను తెలిపే వాక్యాలు ఏవి?    

ఎ) మూత్రపిండాలు ఎరిథ్రోపాయిటిన్‌ అనే ప్రొటీన్‌ను స్రవించి ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి.

బి) మూత్రపిండాలు రెనిన్‌ అనే హార్మోన్‌ను స్రవించి రక్తపీడనాన్ని నియంత్రిస్తాయి.

సి) శరీర ద్రవాల్లో pH ను నియంత్రిస్తాయి.

1) ఎ, బి, సి  2) బి, సి  3) ఎ, సి  4) బి మాత్రమే


21. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

ఎ) శరీరంలో ఎక్కువైన అమైనో ఆమ్లాలు నిల్వ ఉంటాయి.

బి) రక్తకేశనాళికలు కలిసి గ్లోమెరులస్‌ను ఏర్పరుస్తాయి.

సి) మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణం యూరోక్రోమ్‌

1) ఎ     2) బి     3) ఎ, బి    4) ఎ, సి

 


సమాధానాలు

1-1, 2-4; 3-4; 4-1; 5-4; 6-3; 7-1; 8-4; 9-4; 10-3; 11-2; 12-3; 13-1; 14-1; 15-1; 16-3; 17-1; 18-1; 19-3; 20-1; 21-1.
 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 04-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌