• facebook
  • whatsapp
  • telegram

విలువైన హక్కుల రక్షణకు విశిష్ట ఆజ్ఞలు!

ప్రాథమిక హక్కులు

 

భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ ప్రాథమిక హక్కులను కల్పించింది. వాటికి న్యాయపరమైన భద్రత కోసం ‘రిట్స్‌’ పేరుతో అయిదు రకాల ప్రత్యేక ఆదేశాలను ఇచ్చే అధికారాన్ని ఉన్నత న్యాయస్థానాలకు అందించింది. భిన్న ప్రయోజనాలు, విభిన్న పరిస్థితులకు అనుగుణంగా జారీ అయ్యే ఆ రిట్ల గురించి అభ్యర్థులకు పూర్తి అవగాహన ఉండాలి. ప్రజల విలువైన హక్కుల రక్షణకు కోర్టులు చేసిన విశిష్ట ఆజ్ఞలకు సంబంధించిన ముఖ్యమైన కేసుల వివరాలను కూడా తెలుసుకోవాలి.

 


1.    జాతీయఅత్యవసర పరిస్థితి సమయంలో హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను తాత్కాలికంగా రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది?

1) ఎ.డి.ఎం.జబల్‌పుర్‌ Vs శుక్లా కేసు, 1976

2) జగ్జీత్‌ సింగ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 1965

3) ఎస్‌.ఆర్‌.బొమ్మై Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 1994

4) ఇస్మాయిల్‌ ఫరూకీ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 1994


2.     ఒక ప్రభుత్వ అధికారిని ‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని ఏమని పేర్కొంటారు?

1) హెబియస్‌ కార్పస్‌           2) సెర్షియోరరీ

3) మాండమస్‌           4) కోవారంటో


3.     మాండమస్‌ రిట్‌ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయడానికి వీల్లేదు?

1) ప్రైవేట్‌ వ్యక్తులు    2) రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్‌లు

3) విచక్షణతో కూడిన విధుల విషయంలో    4) పైవన్నీ 


4.     మాండమస్‌ రిట్‌ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయవచ్చు?

1) కార్పొరేషన్‌       2) ట్రైబ్యునళ్లు

3) ప్రభుత్వ అధికారి       4) పైవన్నీ


5.     మాండమస్‌ రిట్‌కు సంబంధించి సరైంది?

ఎ) ఈ రిట్‌ను అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీ చేస్తారు.

బి) దీన్ని జారీ చేయడమనేది కోర్టుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

సి) ప్రభుత్వ అధికారులు వారు నిర్వర్తించే విధుల్లో తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన వాటికి మాత్రమే ఈ రిట్‌ను జారీ చేస్తారు.

డి) దీని స్వభావం డైరెక్ట్స్‌ యాక్టివ్‌.

1) ఎ, సి, డి       2) ఎ, బి, సి, డి

3) ఎ, బి, సి      4) ఎ, బి, డి 


6.     దిగువ న్యాయస్థానం విచారిస్తున్న కేసును నిలిపివేయమని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్‌ను ఏమంటారు?

1) ప్రొహిబిషన్‌        2) సెర్షియోరరీ

3) కోవారంటో        4) మాండమస్‌


7.     ప్రొహిబిషన్‌ రిట్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడమే ఈ రిట్‌ ఉద్దేశం.

బి) దీన్ని న్యాయసంస్థలపై జారీ చేస్తారు.

సి) ఈ రిట్‌ స్వభావం ఇన్‌యాక్టివ్‌.    డి) ప్రొహిబిషన్‌ అంటే ప్రతిసేద/నిలుపుదల అని అర్థం.

1) ఎ, బి, డి       2) ఎ, బి, సి  

3) ఎ, బి, సి, డి       4) ఎ, సి, డి 


8.     సెర్షయోరరీ రిట్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) దిగువ న్యాయస్థానం నిలిపివేసిన విచారణను ఉన్నత న్యాయస్థానానికి లేదా పక్క న్యాయ  స్థానానికి బదిలీ చేయమని జారీ చేసే ఆదేశం.

బి) సెర్షియోరరీ అంటే ధ్రువీకరించడం అని అర్థం.

సి) దిగువ న్యాయస్థానాలు తమ పరిధిని అతిక్రమించకుండా నియంత్రించడమే దీని లక్ష్యం.

డి) ఈ రిట్‌ను శాసనసంస్థలపై కూడా జారీ చేయవచ్చు.

1) ఎ, బి, సి       2) ఎ, బి, సి, డి   

3) ఎ, సి, డి       4) ఎ, బి, డి 


9.     సెర్షియోరరీ రిట్‌ను వేటిపై జారీ చేయడానికి వీల్లేదు?

1) న్యాయపరమైన సంస్థలు (Judicial Body)

2) అర్ధన్యాయ సంస్థలు (Quasi Judiciary Authorities)

3) ప్రైవేటు సంస్థలు (Private Individuals)

4) పరిపాలనాపరమైన సంస్థలు (Administrative Authorites)


10. ఏ సంవత్సరం తర్వాత నుంచి సెర్షియోరరీ రిట్‌ను అడ్మినిస్ట్రేటివ్‌ అథారిటీస్‌పై జారీ చేస్తున్నారు?

1) 1991  2) 1987  3) 1981  4) 1976


11.     న్యాయస్థానాలు, న్యాయస్థానాలపైనే జారీ చేసే రిట్స్‌? 

1) హెబియస్‌ కార్పస్, సెర్షియోరరీ    2) మాండమస్, ప్రొహిబిషన్‌

3) కోవారంటో, సెర్షియోరరీ           4) ప్రొహిబిషన్, సెర్షియోరరీ


12. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఎవరైనా వ్యక్తి అధికారాన్ని చెలాయిస్తుంటే ‘నీవు ఏ అధికారంతో ఆ పని చేస్తున్నావు’ అని ప్రశ్నిస్తూ న్యాయస్థానం జారీ చేసే రిట్‌ను ఏమంటారు?

1) మాండమస్‌      2) కోవారంటో   

3) ప్రొహిబిషన్‌      4) హెబియస్‌ కార్పస్‌


13. ఆస్తికి సంబంధించిన వివాదాల్లో యథాస్థితిని అమలుచేయడానికి న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని ఏమంటారు?

1) ఇంజంక్షన్‌ (Injunction)         2) జురిస్‌ప్రుడెన్స్‌ (Jurisprudence)

3) ప్రివెంటివ్‌ (Preventive)  4) ఫోర్బిడ్‌ (Forbid)


14. కింద పేర్కొన్న అంశాల్లో సరైంది?

ఎ) సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం మాత్రమే రిట్స్‌ జారీ చేస్తుంది.

బి) హైకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం మాత్రమే కాకుండా, ఇతర చట్టబద్ధ హక్కుల రక్షణకు కూడా రిట్స్‌ జారీ చేస్తుంది.

సి) రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టు రిట్స్‌ జారీ చేస్తుంది.

డి) రిట్స్‌కు సంబంధించిన పదాలన్నీ గ్రీకు భాషా పదాలే.

1) ఎ, బి, సి, డి        2) ఎ, సి, డి    

3) ఎ, బి, సి        4) ఎ, బి, డి 


15. ఆర్టికల్‌ 33 ప్రకారం ఎవరి ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తూ భారత పార్లమెంటు చట్టాలను రూపొందించగలదు?

ఎ) ఆర్టికల్‌ 33(A) ప్రకారం కేంద్ర బలగాల్లో పనిచేసేవారికి

బి) ఆర్టికల్‌ 33(B) ప్రకారం శాంతి భద్రతల రక్షణ కోసం వినియోగించే దళాలకు

సి) ఆర్టికల్‌ 33(C) ప్రకారం రహస్య గూఢచార సంస్థల్లో పనిచేసేవారికి

డి) ఆర్టికల్‌ 33(D) ప్రకారం రక్షణకు సంబంధించి కమ్యూనికేషన్‌ రంగంలో పనిచేసేవారికి

1) ఎ, బి, సి    2) ఎ, బి, సి, డి

3) ఎ, సి, డి    4) ఎ, బి, డి


16. కిందివాటిలో భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలకు సంబంధించి సరికానిది?    

1) ది ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ యాక్ట్, 1951     2) ది నేవీ ఫోర్స్‌ యాక్ట్, 1950

3) ది పోలీస్‌ ఫోర్స్‌ యాక్ట్, 1966     4) ది ఎయిర్‌ఫోర్స్‌ యాక్ట్, 1950


17. కిందివాటిలో భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలకు సంబంధించి సరికానిది?

1) నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ యాక్ట్, 2008

2) ది ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ యాక్ట్, 1950

3) మోటారు వాహనాల చట్టం, 1991

4) పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986


18. సైనిక శాసనం (Marshal Law) అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితుల గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 33      2) ఆర్టికల్‌ 34   

3) ఆర్టికల్‌ 35       4) ఆర్టికల్‌ 35(A)


19. సైనికదళాలకు అనుబంధంగా ఉండే డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్, వంటశాలల్లో పనిచేసేవారు, క్షురకులు, ఇస్త్రీ చేసేవారు కూడా సైనికుల కిందికే వస్తారని, వారికి కూడా సైనిక నిబంధనలే వర్తిస్తాయని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది?

1) ఒ.కె.ఎ.నాయర్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) రఘువీర్‌ సింగ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) దర్శీ అండాల్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) బిర్సా ముండా Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు


20. ప్రాథమిక హక్కులకు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవి కావు అంటే అపరిమితమైనవి కావు.

బి) ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణను కలిగి ఉంటాయి.

సి) ప్రాథమిక హక్కులన్నీ సార్వత్రికమైనవి.

డి) ప్రభుత్వం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించగలదు.

1) ఎ, బి, సి, డి       2) ఎ, బి, సి   

3) ఎ, బి, డి       4) ఎ, సి, డి 


21. ప్రాథమిక హక్కులకు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) భారత్‌లో ఉండే విదేశీయులకు ఆర్టికల్‌ 15, 16, 19, 29, 30లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు వర్తించవు.

బి) ఆర్టికల్‌ 14, 15, 16, 20, 21లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు నకారాత్మకమైనవి (నెగెటివ్‌).

సి) ఆర్టికల్‌ 17, 23, 24లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు సకారాత్మకమైనవి (పాజిటివ్‌).

డి) ప్రాథమిక హక్కులన్నీ సంప్రదాయకమైనవి. 

1) ఎ, బి, సి        2) ఎ, సి, డి       

3) ఎ, బి, సి, డి       4) ఎ, బి, డి 


22. ఆర్టికల్‌ 352 ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే ఆర్టికల్‌ 19లో పేర్కొన్న స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు రద్దవుతాయని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 355        2) ఆర్టికల్‌ 357

3) ఆర్టికల్‌ 358       4) ఆర్టికల్‌ 361


23. భారత రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పటికీ ఆర్టికల్‌ 359 ప్రకారం ఏ ఆర్టికల్‌లో పేర్కొన్న ప్రాథమిక హక్కు రద్దు కాదు?

1) ఆర్టికల్‌ 20       2) ఆర్టికల్‌ 21

3) ఆర్టికల్‌ 22       4) 1, 2


24. కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది?

1) ఆర్టికల్‌ 358కి స్ఫూర్తినిచ్చిన దేశం జర్మనీ.

2) ఆర్టికల్‌ 359కి స్ఫూర్తినిచ్చిన దేశం జపాన్‌.

3) అమెరికా రాజ్యాంగానికి చేసిన మొదటి 10 సవరణలను బిల్‌ ఆఫ్‌ రైట్‌్్సగా పేర్కొంటారు.

4) అమెరికాలో బిల్‌ ఆఫ్‌ రైట్స్‌ 1793, డిసెంబరు 15 నుంచి అమల్లోకి వచ్చింది.


25. టెలిగ్రామ్‌ను రిట్‌ పిటిషన్‌గా స్వీకరించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?

1) లూయిస్‌-డి-రిటిట్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) మోహన్‌లాల్‌ శర్మ Vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసు

3) స్టానిలాస్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ కేసు

4) ఎం.ఆర్‌.మసాని Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు


26. ‘రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఒక చేతితో ఇచ్చి, మరొక చేతితో తీసుకుంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) నార్మన్‌ డి.ఫామర్‌    2) సోలీ జె.సొరాబ్జీ

3) నానీఫాల్కీవాలా    4) అనంతశయనం అయ్యంగార్‌

 


సమాధానాలు

1-1; 2-3; 3-4; 4-4; 5-2; 6-1; 7-3; 8-1; 9-3; 10-1; 11-4; 12-2; 13-1; 14-3; 15-2; 16-1; 17-3; 18-2; 19-1; 20-3; 21-1; 22-3; 23-4; 24-4; 25-2; 26-1. 
 

Posted Date : 16-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌