• facebook
  • whatsapp
  • telegram

రోబోటిక్స్ 

నలభైకి పైగా భాషల్లో బోధించే షాలు!

స్వతంత్రంగా లేదా అర్ధ స్వతంత్రంగా నిర్దిష్ట పనులను నిర్వహించగలిగిన యంత్రాలు రోబోట్‌లు. ఇవి సాధారణ, పునరావృత చర్యల నుంచి సంక్లిష్ట, అధునాతన పనుల వరకు అన్నింటినీ నిర్వహిస్తున్నాయి. ఈ వర్చువల్‌ మిషన్‌ల డిజైనింగ్, ప్రోగ్రామింగ్, ఉత్పత్తి, ఉపయోగాల అధ్యయనమే రోబోటిక్స్‌. ఆరోగ్య, రక్షణ రంగాలు, ఖనిజాల వెలికితీత, అంతరిక్ష అన్వేషణ  వంటి వాటిలో వీటిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల రోబోట్‌లు, వాటి ప్రత్యేకతలు తదితర అంశాల గురించి పోటీ పరీక్షార్థులు తగిన అవగాహన పెంపొందించుకోవాలి. 


ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


1.  కిందివాక్యాలను పరిశీలించండి.

ఎ) రోబోట్‌ అనే పదానికి బానిస అని అర్థం.

బి) రోబోట్‌ల డిజైన్, తయారీ, అనువర్తనాల గురించి తెలియజేసే ఇంజినీరింగ్‌ను రోబోటిక్స్‌ అంటారు.

1) ఎ, బి లు సరైనవి. ఎ వాక్యం బి తో సంబంధం చూపుతుంది.

2) ఎ, బి లు సరైనవి కావు. ఎ వాక్యం బితో సంబంధం చూపదు.

3) ఎ సరైంది, బి సరికాదు.

4) బి సరైంది, ఎ సరికాదు.




2.   రోబోట్‌ల రకాల గురించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి?    

ఎ) మొదటి తరం రోబోట్‌లను ఆటోమొబైల్‌ పరిశ్రమల్లో వాడుతున్నారు.

 బి) రెండో తరం రోబోట్‌లు కదులుతాయి, బరువైన వస్తువులను లోడింగ్, అన్‌లోడింగ్‌ చేస్తాయి. 

సి) మూడో తరం రోబోట్‌లకు సెన్సార్‌లు ఉండి సమాచార విశ్లేషణకు ఉపయోగపడతాయి.

1) ఎ, బి       2) బి, సి    3) ఎ, బి, సి      4) ఎ 

 

 

3.  నాలుగో తరం రోబోట్‌ల గురించి కిందివాటిలో సరికాని వాక్యం ఏది?

ఎ) ఇవి రూపంలో మానవుడిలా ఉంటాయి. మానవులు చేసే అన్ని పనులు చేయగలవు.

బి) మానవ ఆకారంలో, కృత్రిమ మేధను కలిగి ఉంటాయి.

సి) మానవ రూపంలో ఉండి మానవులు చేయలేని ప్రమాదకర పనులను చేస్తాయి.

డి) మానవ రూపంలో ఉండి మానవుడితో కలిసి జీవితం పంచుకుంటాయి.

ఇ) మానవుడి కంటే అధిక మేధస్సు కలిగి ఉంటాయి.

1) ఎ, బి   2) డి, ఇ   3) బి, సి   4) సి, డి

 

 

4.   ఆండ్రాయిడ్‌ రోబోట్‌ల గురించి కింది వాక్యాలను పరిశీలించి, సరైన వాటిని గుర్తించండి.    

ఎ) వీటిని బయోనిక్‌ మ్యాన్, సింథటిక్‌ హ్యూమన్స్‌ అంటారు.

బి) వీటిపై మానవుడి చర్మం లాంటి పదార్థంతో కప్పి ఉంటుంది.

సి) కృత్రిమ మేధను కలిగి, ముఖ కవళికలను గుర్తిస్తాయి.

1) ఎ, బి     2) బి, సి      3) ఎ      4) ఎ, బి, సి 



 

5.   రోబోట్‌ల వల్ల ఉపయోగాలేంటి?

ఎ) పరిశ్రమల్లో ఉత్పత్తి పెరుగుతుంది.

బి) అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తాయి.

సి) అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని పనిచేస్తాయి.

1) ఎ, బి  2) బి, సి  3) ఎ, సి  4) ఎ, బి, సి




6.  ప్రస్తుతం రోబోట్‌లను ఏయే రంగాల్లో వాడుతున్నారు?

ఎ) అంతరిక్ష రంగంలో అంతరిక్ష నౌకల మరమ్మతులకు 

బి) సరిహద్దుల్లో పహారాకు

సి) వైద్య రంగంలో శస్త్రచికిత్సలు చేయడానికి

డి) గనుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ఖనిజాల వెలికితీతకు 

ఇ) పరిశ్రమల్లో వెల్డింగ్, డ్రిల్లింగ్‌ పనులకు

1) ఎ, బి, సి    2) బి, సి, డి     3) ఎ, బి, సి, డి, ఇ     4) ఎ, సి, డి

 


7.  రోబోట్‌లు, వాటిని తయారుచేసిన సంస్థలను సరైన క్రమంలో అమర్చండి.

ఎ) ఆసిమో        1) బిట్స్‌-పిలానీ

బి) అచ్యుత్‌        2) హోండా

సి) నటరాజ్‌       3) టోయోటా

డి) కిరోబో        4) ముంబయి ఐఐటీ

ఇ) సోఫియా      5) హాన్‌సన్‌ రోబోటిక్స్‌

1) ఎ-2, బి-1, సి-4, డి-3, ఇ-5

2) ఎ-4, బి-2, సి-3, డి-1, ఇ-5

3) ఎ-3, బి-2, సి-5, డి-4, ఇ-1

4) ఎ-5, బి-1, సి-2, డి-4, ఇ-3




8.  వివిధ రోబోట్‌లకు సంబంధించి కింది జతల్లో సరికానివి ఎన్ని?

ఎ) ఆసిమో - మొదటి హ్యూమనాయిడ్‌ రోబోట్‌

బి) లక్ష్మి - బ్యాంకింగ్‌ రోబోట్‌

సి) కిరోబో - మొదటి పర్యావరణసహిత రోబోట్‌

డి) నటరాజ్‌ - పూర్తి ప్లాస్టిక్‌తో తయారైన రోబోట్‌

ఇ) మిత్ర - మొదటి మాట్లాడే హ్యూమనాయిడ్‌ రోబోట్‌

ఎఫ్‌) రాస్‌ - మొదటి లాయర్‌ రోబో

1) 2 జతలు    2) 3 జతలు     3) 4 జతలు    4) 5 జతలు




9.   దక్ష్ అనే రోబో గురించి కింది వాక్యాలను పరిశీలించి, సరికాని దాన్ని గుర్తించండి.

ఎ) దీన్ని డీఆర్‌డీఓ తయారుచేసింది.

బి) ఇది మొదటి భారత మిలిటరీ రోబో.

 సి) ఇది పేలుడు పదార్థాలను గుర్తించగలదు.

డి) దీన్ని సరిహద్దుల్లో గస్తీ కోసం వాడుతున్నారు.

1) ఎ     2) బి     3) డి     4) సి




10. కిందివాటిని జతపరచండి.

రోబోట్‌            ప్రత్యేకత

ఎ) కిరోబో     1) విపత్తు నిర్వహణ

బి) అట్లాస్‌     2) ముఖకవళికలను గుర్తిస్తుంది

సి) రాడా      3) మహిళా హ్యూమనాయిడ్‌  రోబోట్‌    

డి) షాలు      4) కృత్రిమమేధ కలిగిన రోబోట్‌

ఇ) చిట్టి       5) హాస్పిటల్‌ రోబోట్‌

1) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5

2) ఎ-2, బి-1, సి-4, డి-3, ఇ-5

3) ఎ-3, బి-2, సి-1, డి-4, ఇ-5

4) ఎ-1, బి-3, సి-2, డి-4, ఇ-5




11. కిందివాటిలో వ్యోమమిత్ర అనే రోబోట్‌ గురించి సరైన వాక్యాలను ఎన్నుకోండి.

ఎ) ఇస్రో ఇనర్షియల్‌ సిస్టం యూనిట్‌ దీన్ని రూపొందించింది. 

బి) ఇది మొదటి మహిళా హాఫ్‌ (సగం) హ్యూమనాయిడ్‌ రోబోట్‌.

సి) దీన్ని మొదటి రెండు గగన్‌యాన్‌ యాత్రల్లో వాడుతున్నారు.

డి) ఈ రోబోట్‌ యాత్రలో స్విచ్‌ పానెల్‌ ఆపరేషన్‌కు ఉపయోగపడుతుంది.

1) ఎ, బి     2) బి, సి    3) ఎ, బి, సి    4) ఎ, బి, సి, డి

 

 

12. ఇచ్చిన వాటిలో కెంపా అనే రోబోట్‌ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.

ఎ) బెంగళూరుకు చెందిన సిరెనా టెక్నాలజీస్‌ ఈ రోబోట్‌ను రూపొందించింది. 

బి) ఇది ప్రస్తుతం బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో ఉంది.

 సి) ఇది మొదటితరం రోబోకు ఉదాహరణ.

 డి) ఈ రోబో ఆంగ్ల, కన్నడ భాషల్లో మాట్లాడగలదు.

1) ఎ     2) బి     3) సి     4) డి




13. షాలు అనే రోబో గురించి కిందివాటిలో సరైంది-    

ఎ) భారతదేశంలో ఇది మహిళా హ్యూమనాయిడ్‌ రోబోట్‌.

బి) 47 భాషల్లో మాట్లాడే విద్యా రోబోట్‌.

సి) తరగతి గదిలో రోబోట్‌ టీచర్‌గా ఉండగలదు.

1) ఎ   2) ఎ, బి, సి   3) బి, సి   4) ఎ, సి

 


14. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

ఎ) ప్రోబోట్‌ - సమాచారాన్ని ప్రాసెస్‌ చేస్తుంది. 

బి) నోబోట్‌ - ఇంటర్‌నెట్‌ వెతికి సమాచారాన్ని గ్రహిస్తుంది.

సి) కోబోట్‌ - మానవులతో కలిసి పనిచేస్తుంది.

డి) చాట్‌బోట్‌ - మానవులతో కలిసి యుద్ధం చేస్తుంది.

1) ఎ     2) బి     3) డి    4) సి



 

15. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.    

ఎ) భారతదేశంలో రోబోట్‌ల ఖరీదు ఎక్కువ.

బి) భారత్‌లో రోబోటిక్‌ రంగంలో నిపుణులు ఎక్కువగా లేరు.

1) ఎ సరైంది, బి సరికాదు. ఇవి రెండూ ఒకే అంశానికి సంబంధించినవి.

2) ఎ, బి లు సరైనవి. ఈ రెండూ ఒకే అంశానికి సంబంధించినవి.

3) ఎ సరికాదు, బి సరైంది. ఈ రెండూ వేర్వేరు వాక్యాలు.

4) ఎ, బి లు సరైనవి. ఈ రెండూ ఒకే అంశానికి చెందిన వాక్యాలు కావు.




16. రోబోటిక్స్‌ పరిశోధన గురించిన కింది వాక్యాల్లో సరైనవి-

ఎ) సెంటర్‌ ఫర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌ సంస్థ బెంగళూరులో ఉంది. ఇది చాతుర్‌ రోబోట్‌ను అభివృద్ధి చేసింది.

బి) సెంటర్‌ ఫర్‌ రోబోటిక్‌ రిసెర్చ్‌ ఐఐటీ కాన్పుర్‌లో ఉంది.

1) ఎ      2) బి    3) ఎ, బి     4) రెండూ సరికావు



 

17. కింది పేరాను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి.మానవులతో కలిసి పనిచేసే రోబోట్‌లను కోబోట్స్‌ అంటారు. ఇవి మనతో పని చేసేటప్పుడు ఎలాంటి అపాయం ఉండదు. వీటికి తక్కువ ప్రదేశం అవసరమవుతుంది. వీటిని అమర్చడం, నిర్వహణ తేలిక. ఇవి కదలగలవు, ఖర్చు తక్కువ. వీటివల్ల ఉత్పత్తి పెరుగుతుంది. మానవులపై అనుకూల ప్రభావం ఉంటుంది.

1) మానవుడు లేకుండా పనిచేసే రోబోట్‌లను కోబోట్స్‌ అంటారు.

2) ఇవి మానవులకు దగ్గరగా ఉండటం వల్ల అపాయం.

3) వీటిని అమర్చడం కష్టం, నిర్వహణ వ్యయం ఎక్కువ.

4) వీటివల్ల ఉత్పత్తి పెరుగుతుంది.



 

18. రోబోట్‌లతో పోలిస్తే కోబోట్‌లు ఏవిధంగా వేరుగా ఉంటాయి?

1) రోబోట్‌ల కంటే కోబోట్‌లను బిగించడం తేలిక.

2) రోబోట్‌ల బరువు ఎక్కువ, కోబోట్‌ల బరువు తక్కువ.

3) రోబోట్‌ల కంటే కోబోట్‌ల నుంచి రక్షణ ఎక్కువ.

4) పై అన్ని విధాలుగా వేరుగా ఉంటాయి.




19. కింద పేర్కొన్న రోబోట్‌లు, వాటిని తయారుచేసిన సంస్థలను సరైన క్రమంలో అమర్చండి.

ఎ) రాస్‌        1) బోస్టన్‌ డైనమిక్‌

బి) అట్లాస్‌      2) ఐబీఎం

సి) దక్ష్        3) టాటా

డి) బ్రాబో        4) డీఆర్‌డీఓ

ఇ) రాడా        5) విస్టారా

1) ఎ-1, బి-2, సి-4, డి-5, ఇ-3

2) ఎ-2, బి-3, సి-1, డి-4, ఇ-5

3) ఎ-2, బి-1, సి-4, డి-3, ఇ-5

4) ఎ-3, బి-2, సి-4, డి-1, ఇ-5

 

 

20. సూర్యుడిలో కింది ఏ చర్యలు జరగడం వల్ల అనంతమైన శక్తి వెలువడుతుంది?

1) కేంద్రక విచ్ఛిత్తి     2) కేంద్రక సంలీనం   3) కేంద్రకాల కలయిక  4) పరమాణువుల కలయిక

 

 

21. సూర్యుడు, నక్షత్రాల్లో అతి ఎక్కువగా ఉండే వాయువు?

1) హైడ్రోజన్‌     2) ఆక్సిజన్‌    3) నైట్రోజన్‌     4) ఆర్గాన్‌

 


22. పదార్థం నాలుగో రూపమైన ప్లాస్మా కింద పేర్కొన్న వాటిలో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది?

1) భూమిపై       2) భూమి మధ్యలో    3) సముద్రాల్లో      4) సూర్యుడిలో 



సమాధానాలు

1-1; 2-3; 3-2; 4-4; 5-4; 6-3; 7-1; 8-1; 9-3;  10-2; 11-4; 12-3; 13-2; 14-3; 15-2; 16-3; 17-4; 18-4; 19-3; 20-2; 21-1; 22-4.  

 

 


   ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...  

 

 

 

Posted Date : 22-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌