• facebook
  • whatsapp
  • telegram

పాటలు వినిపించే అనునాదం!

ధ్వని
 

 

ఉరుములు ఉరిమినా, సప్త స్వరాలు పలికినా శబ్దమే కారణం. కర్ణభేరి దెబ్బతినే విధంగా గర్జించినా, శ్రావ్యంగా చెవిని సోకినా, అన్నీ ధ్వని పరిణామలే. సంగీతం లేని సినిమా సంపూర్ణ వినోదాన్ని పంచడం కష్టం. వెనుక వచ్చే వాహనాలు హెచ్చరికలు చేయకపోతే ముప్పు వాటిల్లడం ఖాయం. ఒకరి మాట మరొకరికి వినిపించకపోతే ప్రపంచమే ప్రమాదంలో పడిపోతుంది. ఇవన్నీ గాలిలోని కణాల కంపనం ద్వారా జరిగే శక్తి ప్రసారంతో ఏర్పడే తరంగాల తమాషాలే. మొత్తం మీద నిత్య జీవితాల్లో అత్యంత కీలకపాత్ర పోషించే ధ్వని, భౌతికశాస్త్రంలో ఒక యాంత్రిక తరంగ రూపం. ఇది అనేక ధర్మాలను ప్రదర్శిస్తూ, ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...




1.    యానకంలోని కణాలు తరంగ చలన దిశకు సమాంతరంగా కంపిస్తే, ఆ తరంగాలను ఏమంటారు?

1) అనుదైర్ఘ్య తరంగాలు                    2) తిర్యక్‌ తరంగాలు

3) విద్యుదయస్కాంత తరంగాలు      4) ద్రవ్య తరంగాలు

 

2.     శృంగం, ద్రోణి ఏ తరంగాల్లో ఏర్పడతాయి?

1) అనుదైర్ఘ్య తరంగాలు                       2) తిర్యక్‌ తరంగాలు

3) విద్యుదయస్కాంత తరంగాలు         4) ద్రవ్య తరంగాలు

 

3.     ఒకే ప్రావస్థలో ఉండే రెండు వరుస కణాల మధ్య దూరాన్ని ఏమంటారు?

1) కంపన పరిమితి            2) ఆవర్తన కాలం   

3) తరంగ దైర్ఘ్యం              4) తరంగ వేగం

 

4.     ఆరోగ్యవంతుడైన మానవుడు వినగలిగే శ్రవ్య అవధి?

1) 200 Hz - 20,000 Hz          2) 20 Hz - 2,000 Hz

3) 2,000 Hz - 20 Hz             4) 20 Hz - 20,000 Hz

 

5.     కిందివాటిలో పరశ్రవ్య ధ్వనిని వినగలిగే వాటిని గుర్తించండి.

1) గబ్బిలాలు            2) ఖడ్గమృగాలు   

3) డాల్ఫిన్‌లు           4) కుక్కలు

 

6.     కిందివాటిలో అతిధ్వనిని వినగలిగే జీవులు 

1) డాల్ఫిన్‌లు         2) తిమింగలాలు   

3) ఏనుగులు           4) పాములు


 

7.     గాలిలో ధ్వని వేగానికి లాప్లాస్‌ సమీకరణం?

 

8.     వాయువు ఉష్ణోగ్రతలో ప్రతి 1°C పెరుగుదలకు ధ్వనివేగంలో పెరుగుదల?

1) 1.61 మీ./సె.         2) 0.61 మీ./సె. 

3) 0.16 మీ./సె.         4) 1.16 మీ./సె.

 

9.     వాయువులో నీటి శాతం పెరిగితే ధ్వని వేగం కూడా పెరుగుతుంది. కారణం?

1) తడిగాలి సాంద్రత పొడి గాలి సాంద్రత కంటే ఎక్కువ

2) తడిగాలి సాంద్రత పొడి గాలి సాంద్రత కంటే తక్కువ

3) తడి, పొడి, గాలి సాంద్రతలు సమానం

4) తడి, పొడి గాలి సాంద్రతలు శూన్యం

 

10. గాలిలో ధ్వని వేగం ఆధారంగా విమానాలు, క్షిపణుల వేగాన్ని మాక్‌ సంఖ్యల్లో కొలుస్తారు. m > 1 అయితే ఆ వేగం?

1) సోనిక్‌ వేగం                   2) హైపర్‌ సోనిక్‌ వేగం

3) సూపర్‌ సోనిక్‌ వేగం       4) సబ్‌ సోనిక్‌ వేగం

 

11. ధ్వని పిచ్‌ దేనిపై ఆధారపడుతుంది?

1) పౌనఃపున్యం              2) ధ్వని తీవ్రత   

3) ధ్వని నాణ్యత           4) ధ్వని వివర్తనం

 

12. కిందివాటిలో ధ్వని తీవ్రత ఆధారపడే అంశం-

1) పౌనఃపున్యం              2) కంపన పరిమితి   

3) ఆవర్తన కాలం           4) ధ్వని నాణ్యత

 

13. హైడ్రోజన్‌ వాయువులో ధ్వని వేగం ఎంత?

1) 1402 మీ./సె.          2) 1522 మీ./సె.   

3) 1284 మీ./సె.          4) 5941 మీ./సె.

 

14. గడియారంలోని లోలకం శబ్ద తీవ్రతను గుర్తించండి.

1) 70 - 80 dB             2) 50 - 60 dB 

3) 90 - 95 dB             4) 30 dB

 

15. భవన ధ్వని శాస్త్రం ఆద్యుడు?  

1) డబ్ల్యూ.సి.సబైన్‌            2) రుడాల్ఫ్‌ హెర్ట్జ్‌

3) రాబర్ట్‌ బాయిల్‌              4) గెలీలియో

 

16. ఒక ప్రదేశం నుంచి 0.1 సెకన్‌ తర్వాత వచ్చే ప్రతిధ్వనిని స్పష్టంగా వినడానికి ధ్వని జనకానికి, అవరోధానికి మధ్య ఉండాల్సిన కనీస దూరం?    

1) 15 మీ.            2) 20 మీ.  

3) 16.5 మీ.         4) 25.5 మీ.

 

17. తెలియని శృతిదండం పౌనఃపున్యం తెలుసుకోవడానికి ఉపయోగపడే ధ్వని ధర్మం?

1) వివర్తనం                 2) విస్పందనాలు

3) అనునాదం             4) వ్యతికరణం

 

18. రేడియోలో పౌనఃపున్యాన్ని మారుస్తూ స్టేషన్‌ ప్రసార పౌనఃపున్యానికి సమానం చేసినప్పుడు ధ్వనికి ఉండే ఏ ధర్మం వల్ల పాటలు వినిపిస్తాయి?

1) అనునాదం                2) డాప్లర్‌ ప్రభావం   

3) విస్పందనాలు          4) వివర్తనం

 

19. నక్షత్రాల నుంచి వచ్చే కాంతిలో రెడ్‌షిఫ్ట్, బ్లూషిఫ్ట్‌ అనే దృగ్విషయాలను గుర్తించే ధ్వని ధర్మం?    

1) వివర్తనం                2) వ్యతికరణం  

3) అనునాదం           4) డాప్లర్‌ ప్రభావం

 

20. తాత్కాలిక చెవిటితనం రావడానికి కారణమైన ధ్వని పౌనఃపున్యం?

1) 2000 - 3000 Hz             2) 4000 - 6000 Hz

3) 1000 - 500 Hz               4) 4000 - 8000 Hz

 

21. సముద్రంలో మిలిటరీ సోనార్‌ వల్ల ‘బీక్‌డ్‌ వేల్స్‌’ అనే తిమింగలాలు మృత్యవాత పడటానికి కారణమైన శబ్దతీవ్రత (డెసిబుల్స్‌లో)?

1) 500 dB                 2) 300 dB  

3) 200 dB                 4) 150 dB

 

22. వర్షాకాలంలో పిడుగులు వచ్చే సందర్భంలో ప్రతిధ్వనిస్తూ వినిపించే ఉరుములు ఏర్పడటానికి కారణమైన ధ్వని ధర్మం?

1) ధ్వని వక్రీభవనం              2) ధ్వని వ్యతికరణం  

3) అనునాదం                      4) వరుస పరావర్తనాలు

 

23. భారతీయ సప్తస్వరాల్లో (స, రి, గ, మ, ప, ద, ని, స) ‘గ’ పౌనఃపున్యాన్ని (హెర్ట్జ్‌ల్లో) గుర్తించండి.

1) 320 Hz                2) 512 Hz 

3) 480 Hz                4) 256 Hz 

 

24. శూన్యం ద్వారా ధ్వని ప్రయాణించదని గంటజాడీ ప్రయోగం ద్వారా నిరూపించిన శాస్త్రవేత్త?

1) గ్రహంబెల్‌                    2) రుడాల్ఫ్‌ హెర్ట్జ్‌ 

3) రాబర్ట్‌ బాయిల్‌              4) డాప్లర్‌

 

25. కిందివాటిలో తీగవాయిద్యం కానిది?

1) వయోలిన్‌               2) సితార  

3) బుల్‌బుల్‌                4) హార్మోనియం

 

26. కిందివాటిలో వాయు వాయిద్యం కానిది?

1) ఫ్లూట్‌                   2) క్లారినేట్‌ 

3) తబల                  4) షెహనాయ్‌

 

27. గబ్బిలాలు ఆహారాన్ని సేకరించడానికి ధ్వని ఏ ధర్మాన్ని ఉపయోగించుకుంటాయి?

1) ధ్వని వివర్తనం             2) ధ్వని పరావర్తనం 

3) ప్రతినాదం                  4) వ్యతికరణం

 

28. నీటిలో మునిగిన వస్తువుల దూరాలను ‘సోనార్‌’ అనే పరికరంతో కొలుస్తారు. అయితే దీనిలో ఉపయోగించే ధ్వని ధర్మం?

1) ధ్వని వ్యతికరణం                2) ధ్వని వివర్తనం   

3) ధ్వని పరావర్తనం                 4) అనునాదం 

 

29. క్యాసెట్‌ల రికార్డింగ్‌లో 9 డెసిబుల్స్‌ (dB) వరకు అనవసర ధ్వనులను నివారించడానికి ఉపయోగించే పద్ధతి?

1) DOLBY - A               2) DOLBY - B

3) DOLBY - SR            4) DOLBY - S

 

30. 0.1 సెకన్‌ కంటే తక్కువ కాలంలో వచ్చే ప్రతిధ్వని, అసలు ధ్వనితో కలిసిపోయి సాగదీసిన ధ్వనిలా వినిపించే ధ్వని ధర్మం?

1) ధ్వని వ్యతికరణం                2) ధ్వని పరావర్తనం 

3) ప్రతినాదం                             4) అనునాదం

 

31. కిందివాటిలో ధ్వని పిచ్‌కు సంబంధించి సరైన అంశం?

1) సింహం > పురుషుడు > స్త్రీ > పిల్లవాడు 

2) పురుషుడు > సింహం > స్త్రీ > పిల్లవాడు

3) సింహం > స్త్రీ > పురుషుడు > పిల్లవాడు

4) పిల్లవాడు > స్త్రీ > సింహం > పురుషుడు

 

32. కిందివాటిలో ఏ యానకంలో ధ్వని వేగం అధికం?

1) గాలి           2) నీరు           3) ఇనుము           4) థర్మకోల్‌

 

33. పీడనం పెరిగితే ధ్వని వేగంలో కలిగే మార్పును గుర్తించండి.

1) పెరుగుతుంది                  2) మారదు  

3) పెరగవచ్చు                      4) తగ్గుతుంది

 

34. గాలిలో ప్రయాణించే ధ్వని తరంగాలు కిందివాటిలో ఏ ధర్మాలను ప్రదర్శించవు?

1) వ్యతికరణం               2) అధ్యారోహణం  

3) వివర్తనం                   4) ధ్రువణం

 

35. మన దేశంలో ప్రతిధ్వని వినిపించే స్థలం ఎక్కడ ఉంది?

1) కేరళ                      2) మహారాష్ట్ర  

3) తమిళనాడు           4) ఆంధ్రప్రదేశ్‌

 

36. ధ్వనిని రికార్డు చేయడాన్ని ఏమంటారు?

1) ఆడియోగ్రఫీ                 2) రేడియోగ్రఫీ  

3) వీడియోగ్రఫీ                 4) ఫొటోగ్రఫీ

 

37. పిడుగు పడే సమయంలో మెరుపు కనిపించిన తర్వాత ఉరుము వినిపిస్తుంది. కారణం ధ్వని వేగం కంటే కాంతి వేగం?

1) సగం                     2) ఎక్కువ  

3) తక్కువ                 4) సమానం

 

38. కిందివాటిలో ఏ రోజు ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది?

1) 30°C వద్ద తడి రోజు                2) 0°C వద్ద పొడిరోజు 

3) 0°C వద్ద తడి రోజు                   4) 30°C వద్ద పొడిరోజు

 

39. చంద్రుడి మీద ఉన్న వ్యోమగాముల మాటలు వారికి వినిపించవు... కారణం?

1) అధిక పౌనఃపున్యం                    2) చంద్రుడి మీద నీరు లేకపోవడం 

3) యానకం లేకపోవడం                4) ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం

 

40. పారిస్‌లోని సీన్‌ నది మీద సైనికులు కవాతుతో వెళ్లినప్పుడు వంతెన పడిపోవడానికి కారణమైన ధ్వని ధర్మం?

1) ప్రతిధ్వని                  2) విస్పందనాలు  

3) ప్రతినాదం                 4) అనునాదం

 

41. ధ్వని వేగం ఎప్పుడు అధికంగా ఉంటుంది?    

1) వేసవి కాలం               2) చలి కాలం   

3) వర్షాకాలం                  4) పైవన్నీ 

 

42. సముద్ర లోతును కొలిచే పరికరాన్ని గుర్తించండి.

1) అల్టీమీటర్‌                   2) హైడ్రోమీటర్‌ 

3) పాథోమీటర్‌                 4) మానోమీటర్‌

 

43. గంటలను కొయ్యలతో కాకుండా లోహాలతో తయారుచేయడానికి కారణం?

1) లోహాల ఉష్ణవాహకత్వం ఎక్కువ          2) లోహాల సాంద్రత ఎక్కువ 

3) లోహాలు ధ్వని బంధకాలు                    4) కొయ్యలు ధ్వని బంధకాలు 

 

44. ధ్వని బహుళ పరావర్తనం ఆధారంగా పనిచేసే పరికరం?    

1) ఈసీజీ                     2) స్టెతస్కోపు   

3) రాడార్‌                    4) ఆల్ట్రా సోనోగ్రఫీ

 

45. కిందివాటిలో పరశ్రవ్య ధ్వనిని గుర్తించండి.

1) 180 Hz                       2) 18 Hz    

3) 500 Hz                       4) 1500 Hz

 

 


సమాధానాలు

11; 22; 33; 44; 52; 61; 74; 82; 92; 103; 111; 122; 133; 144; 151; 163; 172; 181; 194; 202; 213; 224; 231; 243; 254; 263; 272; 283; 292; 303; 311; 323; 332; 344; 351; 361; 372; 381; 393; 404; 411; 423; 434; 442; 452.

 

ర‌చ‌యిత‌: చంటి రాజుపాలెం
 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 09-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌