• facebook
  • whatsapp
  • telegram

ర్యాంకింగ్ టెస్ట్

ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నల్లో... ఒక సమూహంలోని వ్యక్తులకు పైనుంచి లేదా కింద నుంచి ర్యాంకులను పేర్కొంటారు. వీటి ఆధారంగా ఆ గుంపులోని మొత్తం వ్యక్తుల సంఖ్యను కనుక్కోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రశ్నలు పజిల్స్ రూపంలో ఉంటాయి. సమూహంలోని సభ్యుల ర్యాంకులను పరస్పరం మార్చడం ద్వారా... కొత్త ర్యాంకులతో ఇద్దరి మధ్య ఉండే వ్యక్తుల సంఖ్యను కనుక్కోవడం లాంటి ప్రశ్నలు ఈ కోవలోకి వస్తాయి.

 

మాదిరి ప్రశ్నలు

1. ఒక తరగతిలో రాము ర్యాంకు చివరి నుంచి 22 కాగా మొదటి నుంచి 14. ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?

    ఎ) 36     బి) 34     సి) 37     డి) 35

సమాధానం: (డి)

వివరణ: తరగతిలో ఒక విద్యార్థి ర్యాంకు మొదటి నుంచి R1 , చివరి నుంచి R2 అయితే ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య
    T = R1 + R2 – 1
    పై సూత్రం నుంచి, R1 = 14, R2 = 22
మొత్తం విద్యార్థుల సంఖ్య (T) = 14 + 22 – 1 = 36 – 1 = 35

 

2. 40 మంది విద్యార్థులు ఉండే ఒక తరగతిలో రవి ర్యాంకు కుడి నుంచి 14 అయితే ఎడమ నుంచి అతడి ర్యాంకు ఎంత?
    ఎ) 24     బి) 25     సి) 26     డి) 27

సమాధానం: (డి)

వివరణ: తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య T, ఒక విద్యార్థి ర్యాంకు ఒకవైపు నుంచి R1, రెండోవైపు నుంచి R2 అయితే
R2 = T - R1 + 1.
పై సూత్రం నుంచి, T = 40, R1 = 14.
కాబట్టి ఎడమ నుంచి రవి ర్యాంకు
(R2) = 40 - 14 + 1 = 26 + 1 = 27

 

3. ఒక వరుసలోని బాలికల్లో సుధ ఎడమ నుంచి 10వ స్థానంలోనూ, సంధ్య కుడి నుంచి 15వ స్థానంలోనూ ఉన్నారు. వారిద్దరూ స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత సుధ ఎడమవైపు నుంచి 25వ స్థానంలో ఉంది. ఆ వరుసలోని మొత్తం బాలికల సంఖ్య ఎంత?
    ఎ) 39     బి) 40     సి) 38     డి) 41

సమాధానం: (ఎ)

వివరణ: వరుసలో ఎడమవైపు నుంచి సుధ స్థానం = 10
కుడివైపు నుంచి సంధ్య స్థానం = 15
వారి స్థానాలను పరస్పరం మార్చుకుంటే, సుధ స్థానం ఎడమవైపు నుంచి = 25, ఇది సంధ్య పూర్వ స్థానానికి సమానం.

పై చిత్రం ఆధారంగా, ఎడమ నుంచి సుధ ర్యాంక్ (R1) = 25
కుడి నుంచి సుధ ర్యాంక్ (R2) = 15
ఆ వరుసలోని మొత్తం బాలికల సంఖ్య
(T) = R1 + R2 - 1 = 25 + 15 - 1 = 39
సంక్షిప్త పద్ధతి: వరుసలోని మొత్తం బాలికల సంఖ్య = (స్థాన మార్పిడి తర్వాత ఎడమవైపు నుంచి సుధ స్థానం) + (మార్పిడికి ముందు కుడివైపు నుంచి సంధ్య స్థానం) 1
= 25 + 15 -1 = 39
సూత్రం: (T) = R3 + R2 -1
= 25 + 15 - 1 = 39

 

4. 29 విద్యార్థులు ఉండే ఒక వరుసలో రోహిత్... ఎడమవైపు నుంచి 17వ వాడు కాగా కరణ్ కుడివైపు నుంచి 17వ వాడు. ఆ వరుసలో వారిద్దరి మధ్య ఎంతమంది విద్యార్థులు ఉంటారు?
    ఎ) 3     బి) 5     సి) 6     డి) 7

సమాధానం: (ఎ)

వివరణ: కుడివైపు నుంచి కరణ్ స్థానం = 17
కరణ్‌కు ఎడమవైపు ఉండే విద్యార్థుల సంఖ్య = 29 - 17 = 12

ఎడమ నుంచి కరణ్ స్థానం = 13
ఎడమవైపు నుంచి రోహిత్ స్థానం = 17
వారిద్దరి మధ్య ఉండే విద్యార్థుల సంఖ్య = 3

 

5. ఒక బాలికల వరుసలో నివేదిత ఎడమవైపు నుంచి 18వ స్థానంలోనూ, ప్రీతి కుడివైపు నుంచి 22వ స్థానంలోనూ ఉన్నారు. వారిద్దరి మధ్య 5 గురు బాలికలుంటే, ఆ వరుసలోని మొత్తం బాలికల సంఖ్య ఎంత?
    ఎ) 45     బి) 33     సి) 46     డి) 45, 33

సమాధానం: (డి)

వివరణ: ఈ సమస్యను రెండు రకాలుగా సాధించ వచ్చు.
సందర్భం 1:

వరుసలోని మొత్తం బాలికల సంఖ్య = 18 + 5 + 22 = 45
సందర్భం 2:

వరుసలోని మొత్తం బాలికల సంఖ్య = 22 + 18 (5 + ప్రీతి + నివేదిత)
= 22 + 18 - 7
= 40 - 7 = 33.

Posted Date : 28-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్రటేరియల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌