• facebook
  • whatsapp
  • telegram

పదాల తార్కిక క్రమం 

అమరిక అర్థమైతే సమాధానం!


 

 

తరగతిలో పాఠాన్ని చక్కగా బోధించాలన్నా, ఏదైనా విషయాన్ని ఎవరికైనా స్పష్టంగా వివరించాలన్నా కమ్యూనికేషన్‌ కరెక్టుగా ఉండాలి. అది ఉండాలంటే తార్కిక ఆలోచనా శక్తి, హేతుబద్ధత కావాలి. అభ్యర్థుల్లో అలాంటి సామర్థ్యాలను పరీక్షించడానికే రీజనింగ్‌లో భాగంగా ‘పదాల తార్కిక క్రమం’ అధ్యాయం నుంచి ప్రశ్నలు అడుగుతారు. అందులో ఒక అంశం లేదా సంఘటనకు సంబంధించిన పదాలను విడి విడిగా ఇస్తారు. అవి నిర్మాణాత్మక నమూనాలో ఉంటాయి. ఆ క్రమాన్ని గుర్తించి, అర్థవంతంగా అమరిస్తే సమాధానాన్ని కనిపెట్టవచ్చు. 


రీజనింగ్‌లో పదాల తార్కిక క్రమం (లాజికల్‌ సీక్వెన్స్‌ ఆఫ్‌ వర్డ్స్‌) అధ్యాయం నుంచి వచ్చే ప్రశ్నల్లో అంతర్గత సంబంధం కలిగిన వేర్వేరు పదాలను ఒక్కోదాన్ని ఒక్కో అంకెతో సూచిస్తూ వివిధ క్రమాల్లో ఇస్తారు. ప్రశ్నలో ఇచ్చిన పదాలు ఒక వరుసలో జరిగే సంఘటనలను సూచిస్తాయి. అభ్యర్థి ఆ పదాలు దేనికి చెందినవో తెలుసుకొని సంఘటనల క్రమాన్ని గుర్తించాలి.


మాదిరి ప్రశ్నలు


కింది ప్రశ్నల్లోని పదాలను అర్థవంతమైన క్రమం వచ్చే విధంగా అమర్చి ఇచ్చిన సమాధానాల నుంచి అత్యంత సముచితమైన దాన్ని ఎంపిక చేయండి.


1.     1) పరీక్షలు  2) కాన్వొకేషన్‌  3) ప్రవేశం  4) ఫలితాలు  5) ప్రథమ శ్రేణి    

1) 2, 5, 4, 1, 3       2) 3, 1, 4, 5, 2   

3) 2, 4, 3, 5, 1        4) 1, 2, 4, 5, 3

వివరణ: ప్రవేశం పరీక్షలఫలితాలు ప్రథమ శ్రేణి కాన్వొకేషన్‌

           (3)      (1)       (4)         (5)        (2)

జ: 2




2.     1) పోలీసు  2) శిక్ష  3) నేరం  4) న్యాయమూర్తి  5) తీర్పు

1) 3, 1, 2, 4, 5       2) 1, 2, 4, 3, 5   

3) 5, 4, 3, 2, 1       4) 3, 1, 4, 5, 2

వివరణ: నేరం పోలీసు న్యాయమూర్తి తీర్పు శిక్ష

            (3)      (1)        (4)       (5)     (2)

జ: 4




3.     1) పేదరికం  2) జనాభా  3) మరణాలు  4) నిరుద్యోగం  5) రోగాలు

1) 2, 3, 4, 5, 1       2) 3, 4, 2, 5, 1  

3) 2, 4, 1, 5, 3        4) 1, 2, 3, 4, 5

వివరణ: జనాభా నిరుద్యోగం పేదరికం రోగాలు మరణాలు

               (2)       (4)        (1)      (5)       (3)

జ: 3




4.     1) ఆకులు  2) పండ్లు  3) కాండం  4) వేర్లు  5) పువ్వులు

1) 3, 4, 5, 1, 2       2) 4, 3, 1, 5, 2  

3) 4, 1, 3, 5, 2       4) 4, 3, 1, 2, 5

వివరణ: వేర్లుకాండం ఆకులు పువ్వులు పండ్లు

              (4)     (3)      (1)      (5)      (2)

జ: 2




5.     1) దేశం  2) గ్రామం  3) పట్టణం  4) జిల్లా  5) రాష్ట్రం

1) 2, 3, 4, 5, 1       2) 2, 3, 4, 1, 5   

3) 1, 3, 5, 4, 2       4) 1, 2, 3, 4, 5

వివరణ: గ్రామం పట్టణం జిల్లా రాష్ట్రం దేశం

             (2)      (3)      (4)     (5)     (1)

జ: 1




6.     1) గోడ   2) మట్టి   3) ఇల్లు   4) గది   5) ఇటుకలు

1) 5, 2, 1, 4, 3      2) 2, 5, 4, 1, 3  

3) 2, 5, 1, 4, 3      4) 1, 2, 3, 4, 5

వివరణ: మట్టి ఇటుకలు గోడ గది ఇల్లు 

          (2)      (5)      (1)    (4)    (3)

జ: 3




7.     1) ప్రొబేషన్‌  2) ఇంటర్వ్యూ  3) నియామకం 4) ఎంపిక  5) ప్రచురణ  6) దరఖాస్తు

1) 5, 6, 2, 3, 4, 1       2) 5, 6, 3, 2, 4, 1   

3) 6, 5, 4, 2, 3, 1       4) 5, 6, 2, 4, 3, 1

వివరణ: ప్రచురణ దరఖాస్తు ఇంటర్వ్యూ ఎంపిక నియామకం ప్రొబేషన్‌

              (5)       (6)       (2)        (4)       (3)        (1)

జ: 4




8.     1) ఏనుగు  2) పిల్లి  3) దోమ  4) పులి  5) తిమింగళం

1) 5, 3, 1, 2, 4       2) 3, 2, 4, 1, 5   

3) 1, 3, 5, 4, 2       4) 2, 5, 1, 4, 3 

వివరణ: దోమ పిల్లి పులి ఏనుగు తిమింగళం

                 (3)    (2)    (4)     (1)       (5)

జ: 2




9.     1) దారం  2) మొక్క  3) చీర  4) పత్తి  5) వస్త్రం 

1) 2, 4, 5, 1, 3      2) 2, 4, 3, 5, 1   

3) 2, 4, 5, 3, 1       4) 2, 4, 1, 5, 3

వివరణ: మొక్క పత్తి దారం వస్త్రం చీర 

                (2)     (4)    (1)      (5)    (3)

జ: 4


 


10. 1) శిశువు  2) ముసలి  3) పెద్దవారు  4) కౌమార దశ  5) పిల్లలు

1) 5, 4, 3, 2, 1       2) 3, 4, 2, 1, 5   

3) 2, 3, 4, 5, 1       4) 1, 5, 4, 3, 2

వివరణ: శిశువు పిల్లలు కౌమార దశ  పెద్దవారు ముసలి

           (1)     (5)        (4)         (3)      (2)

జ: 4




11. 1) వాక్యం  2) పదం  3) అధ్యాయం  4) పద సమూహం  5) పేరాగ్రాఫ్‌

1) 3, 1, 5, 4, 2       2) 3, 5, 1, 4, 2   

3) 2, 4, 1, 3, 5       4) 3, 2, 5, 1, 4

వివరణ: అధ్యాయం   పేరాగ్రాఫ్‌  వాక్యం   పద సమూహం   పదం

                 (3)        (5)       (1)        (4)        (2)

జ: 2 


 


12. 1) పుట్టుక  2) మరణం  3) సమాధి  4) వివాహం  5) విద్య

1) 1, 5, 4, 3, 2        2) 1, 5, 4, 2, 3   

3) 1, 4, 2, 3, 5       4) 1, 2, 4, 3, 5

వివరణ: పుట్టుక విద్య వివాహం  మరణం  సమాధి

 (1)     (5)     (4)        (2)     (3)

జ: 2




13. 1) ఇంద్రధనస్సు  2) వాన  3) సూర్యుడు  4) సంతోషం  5) పిల్లవాడు

1) 4, 5, 1, 2, 3      2) 2, 1, 4, 3, 5   

3) 2, 3, 1, 5, 4       4) 4, 2, 3, 5, 1

వివరణ: వాన   సూర్యుడు   ఇంద్రధనస్సు   పిల్లవాడు  సంతోషం

 (2)      (3)        (1)        (5)        (4)

జ: 3




14. 1) బంగారం  2) ఇనుము  3) ఇసుక   4) ప్లాటినం  5) డైమండ్‌

1) 2, 4, 3, 5, 1       2) 3, 2, 1, 5, 4   

3) 4, 5, 1, 3, 2       4) 5, 4, 3, 2, 1

వివరణ: ఇసుక ఇనుము బంగారం   డైమండ్‌ ప్లాటినం

(3)      (2)       (1)       (5)      (4)

జ: 2




15. 1) భుజం  2) మణికట్టు  3) మోచేయి  4) అరచేయి  5) వేలు

1) 5, 4, 2, 3, 1       2) 3, 4, 5, 2, 1  

3) 3, 1, 4, 2, 5        4) 2, 4, 5, 3, 1

వివరణ: వేలు   అరచేయి   మణికట్టు   మోచేయి   భుజం

(5)     (4)        (2)       (3)      (1)\

జ: 1




16. 1) పెరుగు  2) గడ్డి  3) నెయ్యి  4) పాలు  5) ఆవు

1) 5, 2, 4, 1, 3        2) 5, 2, 3, 4, 1   

3) 4, 2, 5, 3, 1        4) 2, 5, 4, 3, 1

వివరణ: ఆవు  గడ్డి పాలు పెరుగు నెయ్యి

(5)    (2)     (4)      (1)     (3)

జ: 1




17. 1) దేశం  2) కలప  3) అడవి  4) చెక్క  5) చెట్లు

1) 1, 4, 3, 2, 5      2) 1, 3, 5, 4, 2   

3) 2, 4, 3, 1, 5       4) 5, 2, 3, 1, 4

వివరణ: దేశం అడవిచెట్లు చెక్క కలప

(1)     (3)     (5)     (4)    (2)

జ: 2


 


18. 1) ఆదాయం  2) కీర్తి   3) విద్య   4) ఉద్యోగం

1) 3, 4, 1, 2       2) 4, 1, 3, 2   

3) 3, 4, 2, 1       4) 1, 3, 4, 2

వివరణ: విద్యఉద్యోగం ఆదాయం కీర్తి

(3)      (4)       (1)     (2)

జ: 1




19. 1) గుజ్జు  2) ముద్రణ  3) కాగితం  4) కొనుగోలు  5) ప్రచురణ

1) 1, 5, 4, 2, 3      2) 1, 3, 2, 5 4  

3) 1, 4, 5, 2, 3      4) 1, 2, 3, 5, 4

వివరణ: గుజ్జు కాగితం ముద్రణ ప్రచురణ కొనుగోలు

         (1)      (3)      (2)       (5)       (4)

జ: 2




20. 1) కోయడం  2) వంటకం  3) కూరగాయలు  4) మార్కెట్‌  5) వండటం 

1) 4, 1, 5, 3, 2        2) 4, 3, 1, 5, 2    

3) 2, 3, 4, 5, 1       4) 3, 2, 4, 5, 1

వివరణ: మార్కెట్‌ కూరగాయలుకోయడంవండటం వంటకం

                (4)        (3)         (1)       (5)      (2)

జ: 2




21. 1) చదవడం  2) కూర్చోవడం  3) రాయడం  4) ముద్రించడం 

1) 1, 3, 2, 4        2) 2, 3, 4, 1  

3) 3, 1, 2, 4       4) 3, 2, 4, 1

వివరణ: రాయడంకూర్చోవడం ముద్రించడం చదవడం 

              (3)        (2)         (4)         (1)

జ: 4

 

 

 


 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

 

Posted Date : 07-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్రటేరియల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌