• facebook
  • whatsapp
  • telegram

లాజికల్‌ వెన్‌ చిత్రాలు

సూచనలు (ప్ర. 1 - 4): కిందివాటిలో ప్రతి ప్రశ్నలో మూడు పదాలు, నాలుగు ఆప్షన్స్‌ వెన్‌ చిత్రాల రూపంలో ఉన్నాయి. పదాల ఆధారంగా సరైన వెన్‌ చిత్రాన్ని ఎంచుకోండి.


1. పురుషులు, స్త్రీలు, గుమస్తాలు 


పురుషులు, స్త్రీలు లింగపరంగా వేరు. గుమస్తాల్లో స్త్రీలు, పురుషులు ఉండొచ్చు. 


సమాధానం: సి

 

2. పొగతాగేవారు, న్యాయవాదులు, పొగతాగనివారు

పొగతాగేవారు, పొగతాగనివారు విభిన్న వ్యక్తులు.


న్యాయవాదుల్లో పొగతాగేవారు, తాగనివారు ఉంటారు.


సమాధానం: బి

 

3. ముఖ్యమంత్రి, శాసనసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు

శాసనసభ సభ్యుల్లో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. 


రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌లో భాగం. 


సమాధానం: బి


4. బహుభుజి, దీర్ఘచతురస్రం, చతురస్రం

బహుభుజుల్లో దీర్ఘచతురస్రం, చతురస్రం ఉంటాయి. కొన్ని దీర్ఘచతురస్రాలు చతురస్రాలు కూడా అవుతాయి.


సమాధానం:

 

5. కింది పటంలో అన్ని జ్యామితీయ చిత్రాల్లో ఉన్న సంఖ్య?

ఎ) 4      బి) 3       సి) 5       డి) 8


సాధన: దీర్ఘచతురస్రం, వృత్తం, త్రిభుజం కలయికలో ఉన్న సంఖ్య 3


సమాధానం: బి

 

సూచనలు (ప్ర. 6 - 7): కింది పటం ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


1. పెద్ద త్రిభుజం కళాకారులను సూచిస్తుంది.


2. చిన్న త్రిభుజం శాస్త్రవేత్తలను సూచిస్తుంది.


3. చతురస్రం నృత్యకారులను సూచిస్తుంది.


4. వృత్తం వైద్యులను సూచిస్తుంది.

6. కళాకారుల్లో వైద్యులు, నృత్యకారులను మాత్రమే సూచించే అక్షరం?

ఎ) D     బి) G       సి) H    డి) A

7. కళాకారుల్లో శాస్త్రవేత్తలు, వైద్యులు కానివారిని సూచించే అక్షరాలు?

ఎ) A, L     బి) B, G    సి) L, H   డి)  A, B 

సాధన: 6 - బి; కళాకారులు అంటే పెద్ద త్రిభుజం లోపల ఉండే వైద్యులు (వృత్తంలో). నృత్యకారులు చతురస్రంలో ఉంటారు. ఈ మూడింటి కలయిక ఉన్న అక్షరం ‘G’

7 - డి; కళాకారుల్లో శాస్త్రవేత్తలు, వైద్యులు కాని వారు అంటే పెద్ద త్రిభుజంలో ఉండి,  చిన్న త్రిభుజం (శాస్త్రవేత్తలు), వృత్తం (వైద్యులు)లో లేకుండా ఉండే ఉమ్మడి అక్షరాలు - A, B

8. ఒక విందులో చేపలు, చికెన్, శాకాహార భోజనం పెట్టారు. కొందరు చేపలు మాత్రమే తింటే, మరికొందరు చికెన్‌ తిన్నారు. ఇంకొందరు శాకాహారులు. మిగిలినవారు చేపలు, చికెన్‌ రెండూ తిన్నారు. ఈ సమాచారం ఆధారంగా కింది వెన్‌ చిత్రాల్లో సరైనదాన్ని గుర్తించండి.


 

సమాధానం: సి

 

Posted Date : 04-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్రటేరియల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌