• facebook
  • whatsapp
  • telegram

సంఖ్యాశ్రేణి

క్రమంలో అమరిన సంఖ్యల సమూహం!

 


నెలవారీ బడ్జెట్లు లేదా ఖర్చులను గణించడానికి, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంఖ్యా నమూనాలపై అవగాహన ఉండాలి. పరీక్షలు, ఉద్యోగాల ఇంటర్వ్యూలు, ఇతర విద్యాసంబంధ అంశాల్లోనూ సంఖ్యలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల్లోని తార్కిక, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను, నమూనాల గుర్తింపు సామర్థ్యాన్ని, సమస్యల పరిష్కార శక్తిని అంచనా వేయడానికి రీజనింగ్‌లో ‘సంఖ్యాశ్రేణి’ నుంచి ప్రశ్నలు అడుగుతారు.  

‘సంఖ్యాశ్రేణి’ అనే పాఠ్యాంశంలో అంకశ్రేఢి, గుణశ్రేఢి ముఖ్యమైనవి. వాటికి సంబంధించి ‘n’ పదాల మొత్తం, పదాల సంఖ్యను కనుక్కోవాల్సి ఉంటుంది. 

శ్రేఢి: ఒక నిర్దిష్టమైన నియమాన్ని పాటించే సంఖ్యల సమూహాన్ని శ్రేఢి అంటారు. 


ఉదా: 12, 19, 26, 33, .....


అంకశ్రేఢి: శ్రేఢిలో మొదటి పదాన్ని విస్మరించి, మిగిలిన అన్ని పదాలు దాని ముందున్న పదానికి ఒక స్థిరసంఖ్యను కలపడం ద్వారా ఏర్పడతాయి. 

    (లేదా) 

శ్రేఢిలో ప్రతి రెండు వరుస పదాల మధ్య భేదం సమానంగా ఉంటే అది ‘అంకశ్రేఢి’లో ఉంది అంటారు. 


ఉదా: 9, 17, 25, 33, .....


పై శ్రేఢిలో ప్రతి రెండు వరుస పదాల మధ్య భేదం 8 గా ఉంది. 


17  9 = 25  17 = 33  25 = 8 


అంకశ్రేఢి సాధారణ రూపం: 

a, a + d, a + 2d, a + 3d, .....- a + (n − 1)d

అంకశ్రేఢిలో  n పదం Tn = a + (n − 1)d

అంకశ్రేఢిలో n పదాల మొత్తం       

  

 a= మొదటి పదం 

d= పదాంతరం 

n= పదాల సంఖ్య 

గుణశ్రేఢి: శ్రేఢిలో ఏ రెండు వరుస పదాల మధ్య నిష్పత్తి అయినా సమానంగా ఉంటే అది ‘గుణశ్రేఢి’లో ఉందని అంటారు. 

ఉదా: 6, 12, 24, 48, ..... 

పై శ్రేఢిలో ప్రతి రెండు వరుస పదాల నిష్పత్తి 

గుణశ్రేఢి సాధారణ రూపం: 

a, ar, ar2, ar3, .....arn−1     

గుణశ్రేఢిలో n పదం (Tn) = arn−1

గుణశ్రేఢిలో n పదాల మొత్తం 

 

మాదిరి ప్రశ్నలు 

 1. 44, 49, 54, 59, ..... శ్రేణిలో వచ్చే 80వ పదం ఏది? 

1) 440     2) 420     3) 400     4) 439

వివరణ: 44, 49, 54, 59, ..... 

a = 44, d = 49 − 44 = 5, n = 80  

Tn = a + (n − 1)d

 = 44 + (80 − 1)5 

= 44 + 79 × 5 = 44 + 395
= 439 

జ:

 

2. 143, 152, 161, 170, . శ్రేణిలో వచ్చే 150వ పదం ఏది? 

1) 1484    2) 1548    3) 1448    4) 1884

వివరణ:  143, 152, 161, 170, ..... 

a = 143, d = 152 − 143 = 9, n = 150  

Tn = a + (n − 1)d

 = 143 + (150 − 1)9 

= 143 + 149 × 9

= 143 + 1341

= 1484

జ: 1

 

3. 13, 26, 52, 104, ...... శ్రేణిలో వచ్చే 16వ పదం ఏది? 

1) 12 × 215    2) 13 × 314   3) 13 × 215    4) 13 × 152

వివరణ:13, 26, 52, 104, .....

Tn = a.rn −1 

= 13.216−1

 = 13.215 

జ: 3


4. 4, 12, 36, 108,..... శ్రేణిలో వచ్చే 20వ పదం ఏది? 

1) 4 × 320 2) 4 × 319 3) 2 × 203 4) 4 × 193

వివరణ: 4, 12, 36, 108, ..... 

Tn = a.rn −1 

= 4.320−1

 = 4.319 

జ:

 

5. 9, 20, 31, 42 ..... శ్రేణిలో ఎన్నో పదం 438 అవుతుంది? 

1) 39    2) 41    3) 29   4) 40 

వివరణ: 9, 20, 31, 42, ..... a = 9, d = 20 − 9 = 11, Tn = 438 

Tn = a + (n − 1)d 

438 = 9 + (n − 1)11 

438 − 9 = (n − 1)11

429 = (n − 1)11

n − 1 = 39 n = 40వ పదం 

జ: 4


6. 6, 30, 150, 750, ..... శ్రేణిలో ఎన్నో పదం 9372/2 అవుతుంది?

1) 5వ  2) 6వ  3) 4వ     4) 8వ  

వివరణ:  6, 30, 150, 750, ..... 

5n −1 = 3124 

5n = 3125 

5n = 55

 n = 5 వ పదం

జ: 1


7. 14, 21, 28, 35, ...... అనే శ్రేఢిలో 20 పదాల మొత్తం ఎంత?

1) 1600     2) 1520    3) 1610    4) 1590 

వివరణ:14, 21, 28, 35, .....

a = 14, d = 21 − 14 = 7, n = 20  

= 10 [28 + 133] 

= 10 × 161 

= 1610 

జ: 


8. 2, 7, 12,.... శ్రేణిలో ఎన్ని పదాల మొత్తం 297 అవుతుంది? 

1) 11    2) 10    3) 9     4) 12

వివరణ: 2, 7, 12, ..... a = 2, d = 7 − 2 = 5, Sn = 297 

1వ ఆప్షన్‌ని ప్రతిక్షేపించగా

594 = 11(5 × 11 − 1)
= 11(55 − 1) 

= 11 × 54 
= 594

జ:  1

 

9.    3, 9, 15, 21, .... శ్రేణిలో 21వ పదం ఏది?

1) 117     2) 123     3) 121     4) 119

వివరణ: 3, 9, 15, 21, ..... 

a = 3, d = 9 - 3 = 6, n = 21
Tn = a + (n - 1)d
= 3 + (21 - 1)6 = 3 + 120 = 123

జ: 2



10.  6, 12, 24, 48, ... శ్రేణిలో 11వ పదం ఏది? 

1) 3.210   2) 6.210   3) 6.211   4) 3.211

వివరణ: 6, 12, 24, 48, ... 

 

జ: 4



11. అంకశ్రేఢి nవ పదం 0. అంకశ్రేఢి 54, 51, 48, .... అయితే n విలువను కనుక్కోండి.

1) 15    2) 21    3) 18    4) 19

వివరణ: అంకశ్రేఢి n వ పదం 0

ఇచ్చిన అంకశ్రేఢి 54, 51, 48, ......

a = 54, d = 51 - 54 = -3

అంకశ్రేఢిలో 19 పదాలు ఉన్నాయి.    

 జ: 4


 

12. అంకశ్రేఢి 2, 7, 12, ..... లో 10వ పదం?

1) 245   2) 243   3) 297   4) 47

వివరణ: ఇచ్చిన దత్తాంశం 2, 7, 12, ...... 

a = 2, d = 7 - 2 = 5

 

10వ పదం 47 అవుతుంది.         

జ: 4


 

 

Posted Date : 13-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్రటేరియల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌