• facebook
  • whatsapp
  • telegram

క్షేత్రగణితం

1. 20 సెం.మీ. భుజం ఉన్న ఒక సమఘనం నుంచి 5 సెం.మీ. భుజం ఉన్న ఎన్ని సమఘనాలను కత్తిరించవచ్చు?
జ: 64 

 

2. మూడు లోహపు దీర్ఘఘనాల కొలతలు వరుసగా 5 సెం.మీ. × 6 సెం.మీ. × 7 సెం.మీ.; 4 సెం.మీ. × 7 సెం.మీ. × 8 సెం.మీ.; 13 సెం.మీ. × 3 సెం.మీ. × 2 సెం.మీ. అయితే దీర్ఘఘనాలను కరిగించి ఒకే ఘనంగా తయారుచేస్తే ఆ సమఘనం భుజం? (సెం.మీ.లలో)
జ: 8

 

3. ఒక దీర్ఘఘనం యొక్క వెడల్పు దాని ఎత్తుకు రెట్టింపు, పొడవులో సగం ఉంటుంది. దాని ఘనపరిమాణం 1000 ఘ.సెం.మీ. అయితే ఆ దీర్ఘఘనం వెడల్పు ఎంత? (సెం.మీ.లలో)
జ: 10

 

4. దీర్ఘఘనాకృతిలో ఉన్న ఒక నీటితొట్టె లోపలి కొలతలు అంటే పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 6 మీ., 5 మీ., 4.5 మీ. అయితే ఆ తొట్టెలో ఎన్ని లీటర్ల నీరు పడుతుంది?
జ: 135000 లీ.

 

5. ఒక దీర్ఘఘనం పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా l, b, h. దీని పొడవునకు 3 రెట్లు, వెడల్పునకు 6 రెట్లు ఉండేలా పొడవు, వెడల్పులను మార్చి మరో దీర్ఘఘనాన్ని రూపొందించారు. అయితే దీని ఘనపరిమాణం ముందున్న దీర్ఘఘనం ఘనపరిమాణంలోఎంత శాతం పెరుగుతుంది?
జ: 1700%

 

6. ఒక సబ్బు పెట్టె కొలతలు 25 సెం.మీ. × 20 సెం.మీ. × 10 సెం.మీ. ఆ పెట్టెలో 10 సెం.మీ. × 5 సెం.మీ. × 2.5 సెం.మీ. కొలతలు ఉన్న సబ్బులు ఎన్ని పడతాయి?
జ: 40

 

7. రెండు సమఘనాల భుజాల నిష్పత్తి 7 : 9. అయితే వాటి ఘనపరిమాణాల నిష్పత్తి?
జ: 343 : 729

 

8. ఒక సమఘనం యొక్క భుజాన్ని రెట్టింపు చేస్తే దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది?
జ: 8

 

9. ఒక దీర్ఘఘనం యొక్క మూడు ఆసన్న తలాల వైశాల్యాలు వరుసగా 120 సెం.మీ.2, 72 సెం.మీ.2, 60 సెం.మీ.2 అయితే ఆ దీర్ఘఘనం ఘనపరిమాణం? (సెం.మీ.3 లలో)
జ: 720

 

10. 40 మీ. పొడవు, 75 సెం.మీ. వెడల్పు, 5 సెం.మీ. ఎత్తు కలిగిన గోడను నిర్మించడానికి 25 సెం.మీ. పొడవు, 10 సెం.మీ. వెడల్పు, 5 సెం.మీ. ఎత్తు ఉన్న ఇటుకలు ఎన్ని కావాలి?
జ: 1200

 

11. 5 సెం.మీ. ఆ 4 సెం.మీ. ఆ 3 సెం.మీ. కొలతలున్న ఒక లోహపు పెట్టె బరువు 1 కి.గ్రా. అయితే 15 సెం.మీ. × 8 సెం.మీ. × 3 సెం.మీ. కొలతలున్న అదే లోహంతో చేసిన లోహపు పెట్టె బరువు ఎంత? (కి.గ్రా.లలో
జ: 6

 

12. ఒక దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులను 10% చొప్పున పెంచితే దాని ఘనపరిమాణంలో పెరుగుదల శాతమెంత?
జ: 33.1%

 

13. ఒక దీర్ఘఘనం పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 10 సెం.మీ., 8 సెం.మీ., 3 సెం.మీ. అయితే ఆ దీర్ఘఘనం పక్కతల, సంపూర్ణతల వైశాల్యాలు వరుసగా
జ: 108 చ.సెం.మీ., 268 చ.సెం.మీ.

 

14. ఒక సమఘనం భుజం 9 సెం.మీ. అయితే దాని పక్కతల, సంపూర్ణతల వైశాల్యాలు వరుసగా
జ: 324 చ.సెం.మీ., 486 చ.సెం.మీ.

 

15. ఒక దీర్ఘఘనం పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 1.2 మీ., 30 సెం.మీ., 15 సెం.మీ. అయితే దాని ఘనపరిమాణం ఎంత?
జ: 54000 ఘ.సెం.మీ.

 

16. ఒక పాత్ర సమఘనాకారంలో ఉంది. దాని భుజం 30 సెం.మీ. అయితే ఆ పాత్రలో పట్టే నీటి ఘనపరిమాణం ఎంత? (లీటర్లలో)
జ: 27

 

17. దీర్ఘఘనాకారంలో ఉన్న చెక్కముక్క ఘనపరిమాణం 189 సెం.మీ.3, దాని పొడవు 7 సెం.మీ., ఎత్తు 4.5 సెం.మీ. అయితే వెడల్పు ఎంత? (సెం.మీ.లలో)
జ: 6

 

18. 24 సెం.మీ. భుజం ఉన్న ఒక సమఘనం నుంచి 4 సెం.మీ. భుజం ఉన్న సమఘనాలను ఎన్ని కత్తిరించవచ్చు?
జ: 216

 

19. ఒక్కో ప్యాకెట్‌లో 12 అగ్గిపెట్టెలు ఉన్నాయి. ప్రతి అగ్గిపెట్టె పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 4 సెం.మీ., 2.5 సెం.మీ., 1.5 సెం.మీ. అయితే 60 సెం.మీ. ఆ 30 సెం.మీ. ఆ 24 సెం.మీ కొలతలు ఉన్న ఒక అట్టపెట్టెలో ఎన్ని ప్యాకెట్లు పడతాయి?
జ: 240

Posted Date : 31-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్రటేరియల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌