• facebook
  • whatsapp
  • telegram

ఎమినో ఆమ్లాలు - ప్రోటీన్లు

1. ఎంజైమ్‌లు కిందివాటిలో వేటి నుంచి ఏర్పడతాయి?
ఎ) కార్బొహైడ్రేట్లు                  బి) ప్రోటీన్లు
సి) కొవ్వు ఆమ్లాలు               డి) న్యూక్లిక్ ఆమ్లం
జ‌: బి ( ప్రోటీన్లు)


2. శస్త్రచికిత్స తర్వాత కుట్లు వేయడానికి ఉపయోగించే పాలిమర్ ఏది?
జ‌: పాలీ గ్త్లెకోలిక్ ఆమ్లం


3. శరీరానికి అత్యధిక శక్తిని ఇచ్చే ఆహార పదార్థం ఏది?
జ‌: ప్రోటీన్లు


4. బైయూరేట్ పరీక్షతో కిందివాటిలో వేటిని గుర్తించవచ్చు?
ఎ) పిండి పదార్థాలు               బి) కొవ్వులు
సి) మాంసకృత్తులు                డి) విటమిన్లు
జ‌: సి ( మాంసకృత్తులు)


5. కింది ఏ ఆహార పదార్థానికి అధిక కెలోరిక్ విలువ ఉంటుంది?
ఎ) అన్నం         బి) పప్పులు      సి) నెయ్యి          డి) పైవన్నీ
జ‌: సి (నెయ్యి )


6. శరీరంలో ఆవశ్యక ఎమినో ఆమ్లాల సంఖ్య ఎంత?
జ‌: 9


7. కిందివాటిలో ప్రోటీన్లను గుర్తించే పరీక్ష ఏది?
ఎ) మాలిష్             బి) మిల్లోన్
సి) టోలెన్స్            డి) పైవన్నీ
జ‌: బి ( మిల్లోన్)


8. జొన్నలు, బియ్యం, బంగాళా దుంపలు, బార్లీలో  ప్రధానంగా ఉండే ఆహార పదార్థం ఏది?
జ‌: కార్బొహైడ్రేట్లు


9. కిందివాటిలో జంతువుల స్టార్చ్‌లో ప్రధానంగా ఉండేవి ఏవి?
ఎ) ఎమినో ఆమ్లాలు    బి) సెల్యులోజ్
సి) గ్లైకోజెన్                 డి) ఏదీకాదు
జ‌: సి( గ్లైకోజెన్)


10. ప్రోటీన్లలో ఉండే బంధం ఏది?
జ‌: పెప్త్టెడ్


11. కిందివాటిలో మానవుడు ఉపయోగించే ఎమినో ఆమ్లాలు ఏవి?
ఎ) ఆల్ఫా - ఎమినో       బి) బీటా-ఎమినో
సి) గామా - ఎమినో       డి) ఏదీకాదు
జ‌: ఎ ( ఆల్ఫా - ఎమినో)


12. గ్త్లెసిన్ అణుభారం సుమారుగా ఎంత?
జ‌: 75 గ్రా/మోల్


13. కిందివాటిలో అత్యవసర ఎమినో ఆమ్లం కానిది ఏది?
ఎ) ప్రొలైన్                   బి) హిస్టడీన్
సి) మిథియోనిన్          డి) లూసీన్
జ‌: ఎ ( ప్రొలైన్)


14. అతి సాధారణ ఎమినో ఆమ్లం ఏది?
జ‌: సి (గ్లైసీన్)


15. కిందివాటిలో సల్ఫర్ పరమాణువుతో కూడిన ఎమినో ఆమ్లం ఏది?
ఎ) గ్త్లెసిన్, ఎలాస్టిన్           బి) సిస్టీన్, మిథియోనిన్
సి) సిస్టేన్, థియోసిన్        డి) ఏదీకాదు
జ‌: బి( సిస్టీన్, మిథియోనిన్)


16. ఎమినో ఆమ్లాలు అనేవి...
జ‌: ప్రోటీన్ల నిర్మితాలు


17. DNA లో ఉండే చక్కెర యూనిట్ ...
జ‌: డీ ఆక్సి రైబోన్


18. మానవ శరీరంలో దీవితి పాత్ర...
జ‌: ప్రోటీన్ల సంశ్లేషణలో తోడ్పుడుతుంది.

Posted Date : 17-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌